'క్రికెట్‌లో అది చట్టవిరుద్ధమైనది.. ఆ షాట్‌ను ఐసీసీ నిషేధించాలి'

సిడ్నీ: స్విచ్ హిట్టింగ్ షాట్‌ను నిషేధించాలని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ ఇయాన్ ఛాపెల్ అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ)కి సూచించాడు. స్విచ్ హిట్టింగ్ షాట్ బౌలర్‌కు, ఫీల్డింగ్ జట్టుకు అన్యాయం చేస్తుందని ఛాపెల్ అభిప్రాయపడ్డాడు.అది చట్టవిరుద్ధమైన షాట్ అని పేర్కొన్నాడు. బౌలర్ బంతిని సంధించే ముందు.. కుడిచేతి వాటం బ్యాట్స్‌మన్ పూర్తిగా ఎడమచేతి వాటం బ్యాట్స్‌మన్‌గా మారి షాట్లు ఆడటాన్ని స్విచ్ హిట్టింగ్ అంటారు. ప్రస్తుతం ఆసీస్ గడ్డపై జరుగుతున్న భారత్-ఆస్ట్రేలియా వన్డే సిరీస్‌లో గ్లెన్ మాక్స్‌వెల్, డేవిడ్ వార్నర్ చాలా సార్లు స్విచ్ హిట్టింగ్ షాట్‌తో పరుగులు చేశారు.

క్రికెట్‌లో ఆ షాట్‌ను నిషేధించాలి
తాజాగా ఓ మీడియా సమావేశంలో ఇయాన్ ఛాపెల్ మాట్లాడుతూ... 'ఆస్ట్రేలియా ఆటగాళ్ల బ్యాటింగ్ అసాధారణమైంది. స్టీవ్ స్మిత్, గ్లెన్ మాక్స్‌వెల్ వంటి ప్లేయర్లు ఎంతో సులువుగా షాట్లు ఆడతారు. కొన్ని షాట్లు నమ్మశక్యంగా అనిపించవు. స్విచ్ హిట్టింగ్ ఎంతో నైపుణ్యమైన షాట్. మాక్స్‌వెల్, వార్నర్ ఎన్నోసార్లు ఆడారు. కానీ అది న్యాయబద్ధమైనది మాత్రం కాదు, చట్టవిరుద్ధమైన షాట్. ఫీల్డింగ్ చేసే జట్టుకు నష్టం చేస్తుంది. క్రికెట్‌లో ఆ షాట్‌ను ఐసీసీ నిషేధించాలి. బౌలింగ్ వేసే ముందు బౌలర్ ఏ స్థానం నుంచి బౌలింగ్ చేస్తున్నాడనేది అంపైర్‌కు ముందుగా తెలియజేస్తున్నట్లు బ్యాట్స్‌మన్ కూడా స్విచ్ హిట్టింగ్ గురించి చెబితే అది న్యాయబద్ధంగా ఉంటుంది' అని పేర్కొన్నాడు.

ఎందుకు ఇలాంటి నిబంధనలు లేవు
బ్యాట్స్‌మన్ తన చేతివాటాన్ని మార్చడం వల్ల ఫీల్డర్ల స్థానాలు బ్యాటింగ్ చేసే జట్టుకు అనుకూలంగా ఉంటాయని, దీని వల్ల బౌలింగ్ జట్టుకు నష్టం కలుగుతుందని ఇయన్ ఛాపెల్ తెలిపాడు. కాగా దీనిపై ఆటగాళ్లు ఎవరూ ఫిర్యాదు ఇవ్వకపోవడం ఆశ్చర్యంగా ఉందని అన్నాడు. 'కుడిచేతి వాటం బౌలర్, ఓవర్ ది వికెట్' అని అంపైర్‌కు చెప్పి 'ఎరౌండ్ ది వికెట్' బౌలింగ్ చేస్తే అంపైర్ కచ్చితంగా ఫిర్యాదు చేస్తాడని.. కానీ బ్యాట్స్‌మెన్ విషయంలో ఎందుకు ఇలాంటి నిబంధనలు లేవని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ ఛాపెల్ ప్రశ్నించాడు.

స్విచ్ హిట్టింగ్ షాట్లతో అలరించిన మాక్స్‌వెల్
ఆసీస్ గడ్డపై జరుగుతున్న భారత్-ఆస్ట్రేలియా వన్డే సిరీస్‌లో గ్లెన్ మాక్స్‌వెల్, డేవిడ్ వార్నర్ పరుగుల వరద పారించిన విషయం తెలిసిందే. తొలి వన్డేలో మాక్స్‌వెల్ (45; 19 బంతుల్లో 5×4, 3×6) వీరవిహారం చేశాడు. వార్నర్ కూడా 76 బంతుల్లో 69 రన్స్ చేశాడు. ఇక రెండో వన్డేలో మాక్స్‌వెల్ (63; 29 బంతుల్లో 4×4, 4×6) విధ్వంసం సృష్టించగా.. వార్నర్ కూడా 77 బంతుల్లో 83 బాదాడు. ఇద్దరూ కూడా స్విచ్ హిట్టింగ్ షాట్లతో పరుగులు సాధించారు. ఐపీఎల్ 2020లో కూడా అలాంటి షాట్లతో వార్నర్ రన్స్ చేశాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications
వన్డే, టీ20ల్లో టాపర్‌గా ఇంగ్లండ్.. రెండో స్థానంలో భారత్!!