Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కెప్టెన్సీ బాధ్యతలు రోహిత్‌కు ఇవ్వాలి.. లేకుంటే దేశానికే నష్టం: గౌతం గంభీర్

Gautam Gambhir says Rohit Sharma should lead India in limited-overs
Gautam Gambhir-'India's Loss If Rohit Sharma Isn't Made White-Ball Captain Going Forward'

న్యూఢిల్లీ: ఐపీఎల్‌లో తిరుగులేని కెప్టెన్‌గా మారిన ముంబై ఇండియన్స్ సారథి రోహిత్ శర్మపై ప్రశంసల జల్లు కురుస్తోంది. హిట్‌మ్యాన్ నాయకత్వ లక్షణాలు, ముంబై ఇండియన్స్ ఆధిపత్య ప్రదర్శనపై అటు అభిమానులు.. ఇటు క్రికెట్ విశ్లేషకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మాజీ క్రికెటర్లు కూడా రోహిత్ కెప్టెన్సీకి ఇంప్రెస్ అవుతున్నారు. ఈ క్రమంలోనే రోహిత్ శర్మను పరిమిత ఓవర్ల క్రికెట్లో టీమిండియా కెప్టెన్‌గా చేయాలనే డిమాండ్ వ్యక్తమవుతోంది. రోహిత్ సారథ్యానికి ఫిదా అయిన ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖెల్ వాన్.. భారత జట్టు టీ20 పగ్గాలను హిట్ మ్యాన్‌కు ఇవ్వాలని సూచించాడు.

భారత్‌కే నష్టం..

భారత్‌కే నష్టం..

ఇక అవకాశం దొరికితే టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీపై విమర్శలు గుప్పించే టీమిండియా మాజీ ఓపెనర్ గౌతం గంభీర్ కూడా వెంటనే రోహిత్‌కు సారథ్య బాధ్యతలు అప్పగించాలని డిమాండ్ చేశాడు. వన్డేల్లో లేదా టీ20ల్లో.. కుదిరితే రెండు ఫార్మాట్లలో రోహిత్‌ను కెప్టెన్ చేయాలన్నాడు. ఈ నిర్ణయం తీసుకోకపోతే భారత క్రికెట్‌కే నష్టం జరుగుతుందని ఈ‌ఎస్‌పీఎన్‌ క్రిక్‌ఇన్‌ఫోతో మాట్లాడుతూ హెచ్చరించాడు. కోహ్లీ గొప్ప కెప్టెన్ కాదని తానేం అనడం లేదని, కానీ కోహ్లీ కన్నా రోహిత్ మెరుగ్గా ఉన్నాడని చెప్పాడు.

అందుకే రోహిత్ బెస్ట్..

అందుకే రోహిత్ బెస్ట్..

‘టీమిండియాకు రోహిత్ శర్మ సారథ్యం వహించకుంటే అతనికి జరిగే నష్టమేం లేదు. మంచి టీమ్‌తోనే ఓ కెప్టెన్ రాణించగలడని నాకు తెలుసు. దాన్ని నేను అంగీకరిస్తున్నా. కానీ సాధించిన విజయాలతోనే మంచి కెప్టెన్? కాదా? అని నిర్ణయిస్తారు. రోహిత్ ముంబైకి ఐదుసార్లు టైటిళ్లు అందించాడు. ధోనీ అత్యంత విజయవంతమైన భారత కెప్టెన్ అని ఎప్పుడూ చెబుతుంటాం. ఎందుకంటే.. అతడు రెండు వరల్డ్ కప్‌లు, మూడు ఐపీఎల్ టైటిళ్లు సాధించాడు.'అని గంభీర్ చెప్పుకొచ్చాడు.

ఇద్దరుంటే తప్పేం లేదు..

ఇద్దరుంటే తప్పేం లేదు..

రోహిత్‌కు కెప్టెన్‌గా బాధ్యతలు అప్పగిస్తే జట్టును అతను విజయం పథంలో నడపగలడని స్పష్టం చేశాడు. స్ల్పిట్ కెప్టెన్సీని పరిగణలోకి తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని గంభీర్ తెలిపాడు.‘రోహిత్ ఐదు ఐపీఎల్ టైటిళ్లు గెలిస్తే.. కోహ్లీ ఒక్కటి కూడా గెలవలేకపోయాడు. విరాట్ సరైన కెప్టెన్ కాదని అనడం లేదు. కానీ కోహ్లి, రోహిత్ ఇద్దరూ ఐపీఎల్‌లో సమాన కాలంపాటు కెప్టెన్లుగా వ్యవహరించారు. నా దృష్టిలో రోహిత్ నాయకుడిగా నిలబడ్డాడు'అని గంభీర్ వ్యాఖ్యానించాడు.

ముంబై ప్రపంచకప్ గెలుస్తుంది..

ముంబై ప్రపంచకప్ గెలుస్తుంది..

ముంబై ఇండియన్స్‌ ఐపీఎల్ 2020 టైటిల్ గెలవడంపై ట్విటర్ వేదికగా స్పందించిన ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకెల్ వాన్.. ఆ జట్టు టీ20 ప్రపంచకప్ కూడా గెలుస్తుందని ప్రశంసించాడు. 'ఇక ప్రశ్నలు అనవసరం.. రోహిత్ శర్మ‌ను టీమిండియా టీ20 జట్టుకు కెప్టెన్‌గా ఎంపిక చేయాలి. ఆటగాళ్లను ఎలా వాడుకోవాలో అతడికి బాగా తెలుసు. అద్భుత మ్యాన్ మేనేజర్.. లీడర్ కూడా. టీ20 గేమ్‌లను ఎలా గెలవాలో రోహిత్‌కు బాగా తెలుసు. అతడిని టీ20 కెప్టెన్ చేయడం వల్ల విరాట్ కోహ్లీకి కూడా భారం తగ్గే అవకాశం ఉంది. మిగతా జట్లు ఈ విధానాన్ని (ఇద్దరు కెప్టెన్లు)అనుసరించి ఫలితం రాబడుతున్నాయి' అని ట్వీట్ చేశాడు.

మ్యాచ్‌కు ముందు కూడా చేస్తాడు.. లైంగిక జీవితంపై డేవిడ్ వార్నర్ సతీమణి బోల్డ్ కామెంట్స్!

Story first published: Wednesday, November 11, 2020, 16:57 [IST]
Other articles published on Nov 11, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+