
వార్నర్ ఇష్టం..
‘ది కైల్ అండ్ జాకీ ఓ' షోలో పాల్గొన్న ఆమెను హోస్ట్ కిస్ కైల్.. లైంగిక జీవితంపై కొన్ని ప్రశ్నలు అడిగాడు. ‘ఫుట్ బాల్ ప్లేయర్లు మ్యాచ్‌కు ముందు సెక్స్ చేయరు. క్రికెటర్లు కూడా ఇలానే ఉంటారా? వార్నర్ తన మ్యాచ్‌కు ముందు సెక్స్ చేస్తాడా?'అని ప్రశ్నించాడు. దీనికి క్యాండిస్ అది డేవిడ్ వార్నర్ ఇష్టంపై ఆధారపడి ఉంటుందని, అతను కావాలనుకుంటే చేస్తాడని, లేకుంటే లేదని తెలిపింది. అంతేకానీ చేయకుండా ఉండవద్దనే నిబంధనతో అయితే ఏమి ఉండడని చెప్పుకొచ్చింది. అంతేకాకుండా తన భర్త ఈ విషయంలో చాలా సమర్థుడని బోల్డ్ కామెంట్స్ కూడా చేసింది.

వార్నర్‌కు కావాల్సింది చేస్తా..
అయితే మ్యాచ్ డే వరకు సెక్స్ చేయడానికి వార్నర్ సిద్దమైతే ఏం చేస్తారని ప్రశ్నించగా.. అతనికి కావాల్సింది చేస్తానని బదులిచ్చింది. ఈ సమాధానం విన్న హోస్ట్ కైల్.. క్యాండిస్‌ను కొనియాడాడు. ‘ఎంత మంచి మహిళవో.. అందుకే మీ బంధం గట్టిగా ఉంది'అని ప్రశంసించాడు. ఇక క్యాండిస్ కూడా రిలేషన్ షిప్ అంటేనే ఇచ్చుపుచ్చుకోవడం, ఒకరికొకరం అండగా ఉండటమని తెలిపింది.

ముగ్గురు పిల్లలు..
ఇక డేవిడ్ వార్నర్, క్యాండిస్ దంపతులకు మొత్తం ముగ్గురు పిల్లలు. ఇవి(6ఏళ్లు), ఇండి(4 ఏళ్లు), ఇస్లా(15 నెలలు) ముగ్గురు అమ్మాయిలే. ఇక ఐపీఎల్ 2020 సీజన్ ముగిసినా వార్నర్ వారి కుటుంబ సభ్యులను ఇప్పట్లో కలిసే అవకాశం లేదు. టీమిండియాతో అప్‌కమింగ్ సిరీస్ నేపథ్యంలో అతను మరో 14 రోజులు క్వారంటైన్‌లో ఉండనున్నాడు. నవంబర్ 27 నుంచి ఆస్ట్రేలియా, భారత్ మధ్య మూడే టీ20, వన్డేలు, నాలుగు టెస్ట్‌ల సిరీస్ జరగనుంది. ఇప్పటికే భారత ఆటగాళ్లు బయోబబుల్‌లో చేరి ప్రాక్టీస్ చేస్తున్నారు.

వార్నర్ @548
ఐపీఎల్ 2020 సీజన్‌లో డేవిడ్ వార్నర్ అద్భుత ప్రదర్శన కనబర్చాడు. 16 మ్యాచ్‌ల్లో 134.64 స్ట్రైక్‌రేట్‌తో 548 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు హాఫ్ సెంచరీలున్నాయి. ఇక జట్టును క్వాలిఫయర్-2 వరకు తీసుకెళ్లాడు. కానీ ఢిల్లీ చేతిలో ఓడిన హైదరాబాద్.. టైటిల్ ఫైట్‌కు వెళ్లే అవకాశాన్ని తృటిలో చేజార్చుకుంది. ఇక హైదరాబాద్ ఓడినా.. అభిమానుల మనసులను గెలుచుకుంది. గాయాలతో స్టార్ ఆటగాళ్లు దూరమైనా వార్నర్ జట్టును నడిపిన తీరు ప్రతీ ఒక్కరిని ఆకట్టుకుంది. అంతేకాకుండా ఐపీఎల్‌లో 5వేల పరుగుల క్లబ్‌లో చేరిన తొలి విదేశీ ఆటగాడు కూడా వార్నరే కావడం గమనార్హం.
ఆ మొహమాటం లేకపోవడమే ముంబై సక్సెస్‌కు కారణం.. రషీద్ ఖాన్‌ను ఇవ్వమన్నారు: టామ్ మూడీ


Click it and Unblock the Notifications












