
వరల్డ్ బెస్ట్ వైట్‌బాల్ క్రికెటర్..
ఇటీవల స్పోర్ట్స్ తక్ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో గంభీర్ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. ‘ప్రస్తుత తరంలో వరల్డ్ బెస్ట్ వైట్ బాల్ క్రికెటర్ రోహిత్ అనేది నా అభిప్రాయం. ఆల్‌టైమ్ గ్రేటెస్ట్ కాకున్నా ప్రస్తుత తరానికి అతనే బెస్ట్. మూడు డబుల్ సెంచరీలు, ఐదు ప్రపంచకప్ సెంచరీలు సాధించిన ఏకైక ప్లేయర్ అతను. అలాగే టీ20 క్రికెట్‌లో వేగవంతమైన సెంచరీ నమోదు చేసిన బ్యాట్స్‌మన్. అంతేకాకుండా ఆ మ్యాచ్‌లో రోహిత్ డబుల్ సెంచరీ చేజార్చుకున్నాడని ఫ్యాన్స్ అంటుంటారు.

మరెవరికీ సాధ్యం కాలేదు..
‘ఇంగ్లండ్ గడ్డపై జరిగిన ప్రపంచకప్‌లో ఐదు సెంచరీలు బాదాడు. ఇంకెవరు ఇలాంటి ఘనతను అందుకోలేదు. మూడు డబుల్ సెంచరీలు కూడా మరేవరూ నమోదు చేయలేదు. కాకపోతే పరుగులు చేసినవారున్నారు. కానీ వైట్ బాల్ క్రికెట్‌లో వాటి ప్రభావం తక్కువే. అత్యధిక పరుగులతో రోహిత్ శర్మ కన్నా విరాట్ కోహ్లీ ముందున్నాడు. అలాగే ప్రస్తుతంలో అతను గొప్ప బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. కానీ ప్రభావితమైన ఆటగాళ్ల విషయానికి వస్తే మాత్రం కోహ్లీ కన్నా రోహితే కొంచెం ముందన్నాడు.

పోలిక కష్టమే..
ఈ ఇద్దరిని పోల్చడం చాలా కష్టం. కోహ్లీ ఆసాధారణమైన ఆటగాడు. అతని గణంకాలే అతనేంటో తెలియజేస్తాయి. కానీ సెంచరీ తర్వాత ఔట్ అయితే డబుల్ సెంచరీ చేజార్చుకున్నాడని అభిమానులు ఏ ఆటగాడినైతే అంటారో.. అది ఆ ఆటగాడిని విలువను తెలియజేస్తుంది.'అని గంభీర్ చెప్పుకొచ్చాడు. ఇక భారత్ తరఫున 224 వన్డేలు ఆడిన రోహిత్.. 29 సెంచరీలు, 43 హాఫ్ సెంచరీలతో 9115 పరుగులు చేశాడు. 108 టీ20ల్లో 32.67 సగటుతో 2273 రన్స్ చేశాడు. 248 వన్డేల్లో కోహ్లీ 43 సెంచరీలు, 58 హాఫ్ సెంచరీలతో 11867 పరుగులు చేయగా.. 82 టీ20ల్లో 2794 రన్స్ కొట్టాడు.

రోహిత్ సక్సెస్ క్రెడిట్ ధోనీదే..
రోహిత్ శర్మ సక్స్‌స్ క్రెడిట్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీదేనని, అతని నాయకత్వ ప్రతిభతోనే హిట్‌మ్యాన్ ప్రపంచ క్రికెట్‌కు పరిచయమయ్యాడని గంభీర్ అభిప్రాయపడ్డాడు. ఈ రోజు రోహిత్ ఉన్న స్థానం, అతనికి అందుతున్న ప్రశంసలన్నీ మహీ వల్లనేనని, ఆనాడు ధోనీ లేకుంటే.. ఈ రోజు హిట్‌మ్యాన్ అనేవాడు ఉండేవాడు కాదన్నాడు. కోహ్లీ కూడా ధోనీ అండతోనే ఈ స్థాయికి చేరుకున్నాడని తెలిపాడు.
ఆ టార్చర్ తట్టుకోలేక మూడు సార్లు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా: షమీ


Click it and Unblock the Notifications
