
మా వల్లే ధోనీకి సులువైంది..
‘ప్రతీ ఫార్మాట్‌లోనూ ధోనీకి అద్భుతమైన జట్టు దొరకడం అదృష్టం. సచిన్, సెహ్వాగ్, యువరాజ్, విరాట్‌తోపాటు నేను జట్టులో ఉండడం వల్ల 2011 వరల్డ్‌క్‌పలో ధోనీకి సారథ్యం ఎంతో సులువైంది. అయితే, ఇలాంటి వారిని తయారు చేయడానికి దాదా ఎంతో కష్టపడ్డాడు. అందుకే, గంగూలీ వల్లే ధోనీ ఎన్నో టైటిళ్లు సాధించాడు' అని గంభీర్ అభిప్రాయపడ్డాడు.

జహీర్ వల్లే నెంబర్ వన్..
మహీ హయాంలోనే టెస్టుల్లో భారత్ తొలిసారి నెంబర్‌వన్ ర్యాంక్‌ను కైవసం చేసుకొంది. అయితే, జహీర్ ఖాన్ వల్లే అది సాధ్యమైందని గౌతీ పేర్కొన్నాడు. ‘టెస్టుల్లో ధోనీ విజయవంతమైన కెప్టెన్ అనిపించుకున్నాడంటే జహీర్ కారణం. గంగూలీ వల్లే ధోనీకి అలాంటి బౌలర్ లభించాడు. నా దృష్టిలో జహీర్.. భారత అత్యుత్తమ ప్రపంచస్థాయి బౌలర్'అని గంభీర్ చెప్పాడు.

నేలపై పడుకున్నాం..
‘నెలరోజులకు పైగా మహీ నేను ఒకే రూమ్‌లో ఉన్నాం. ఎప్పుడూ జుట్టు గురించే మాట్లాడుకునేవాళ్లం. ఎందుకంటే ధోనీ హెయిర్ అప్పట్లో చాలా పొడువు ఉండేది. అదెలా మెయింటేన్ చేస్తున్నావ్ అనేదానిపైనే ఎక్కువగా చర్చించేవాళ్లం. ఇక మేం నేలపై పడుకున్న సందర్భం నాకింకా గుర్తుంది. మా గది చిన్నగా ఉండటంతో ఇద్దరం చర్చించుకొని బెడ్స్ తీసేసి నేలపై పడుకున్నాం'అని గంభీర్ గుర్తు చేసుకున్నాడు.

క్లిష్ట స్థితిలో..
భారత్ జట్టు ఫిక్సింగ్‌లో కూరుకుపోయిన క్లిష్ట స్థితిలో కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన గంగూలీ.. సీనియర్లకు అండగా నిలుస్తూ.. జూనియర్లను ఎంకరేజ్ చేయడం ద్వారా జట్టులో సమతూకం తెచ్చే ప్రయత్నం చేశాడు. కానీ.. 2005లో అనూహ్యంగా అతని నుంచి కెప్టెన్సీ చేజారగా.. 2007లో ధోనీ చేతికి జట్టు పగ్గాలు అందాయి. అప్పటికే బాగా సెటిలైన టీమ్.. 2011 నాటికి తిరుగులేని స్థితికి చేరుకుంది. ఇక 2011 ప్రపంచకప్ ఫైనల్లో గంభీర్(97) అద్భుత ప్రదర్శనకు ధోనీ ధనాధాన్ ఇన్నింగ్స్ తోడవడంతో భారత్ 28 ఏళ్ల కలను సాకారం చేసుకున్న విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications

భారత మాజీ క్రికెటర్‌కు కరోనా పాజిటివ్!