Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

యూవీ చెప్పింది నిజమే.. ప్రస్తుత టీమిండియాలో రోల్‌మోడల్స్ లేరు: గంభీర్

Gautam Gambhir Says Agree with Yuvraj Singh, there is dearth of role models in current Indian team
Gautam Gambhir Agrees With Yuvraj Singh Statement

న్యూఢిల్లీ: ప్రస్తుత భారత జట్టులో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ మినహాయించి మార్గదర్శకులే లేరని ఇటీవల మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. అయితే ఈ వ్యాఖ్యలను తాజాగా టీమిండియా మాజీ క్రికెటర్, బీజేపీ ఎంపీ గౌతం గంభీర్ సమర్ధించాడు. స్టార్ స్ట్పోర్ట్స్ క్రికెట్ కనెక్టెడ్ షోలో పాల్గొన్న ఈ స్పోర్ట్స్ పొలిటీషియన్.. యూవీ అభిప్రాయంతో ఏకీ భవిస్తున్నట్లు చెప్పుకొచ్చాడు.

యూవీ వ్యాఖ్యలతో ఏకీభవిస్తున్నా..

యూవీ వ్యాఖ్యలతో ఏకీభవిస్తున్నా..

‘యూవీ అభిప్రాయంతో నేను ఏకీభవిస్తున్నాను. ప్రస్తుత టీమిండియాలో రోల్‌ మోడళ్ల కొరత ఉంది. 2000 సమయంలో టీమిండియాలో ద్రవిడ్, కుంబ్లే, లక్ష్మణ్, సౌరవ్ గంగూలీ, సచిన్ టెండూల్కర్‌ వంటి సీనియర్లు జట్టుకి మార్గదర్శకంగా ఉండేవారు. జట్టు కష్టాల్లో ఉన్న సమయంలో ఇటువంటి సీనియర్‌ ఆటగాళ్లు ఉండడం ముఖ్యం. ప్రస్తుత జట్టులో అటువంటి సీనియర్ ఆటగాళ్లు ఉన్నట్లు నేను భావించట్లేదు. తమ సొంత ప్రయోజనాలను పక్కనపెట్టి కొత్త కుర్రాళ్లకు సాయం చేసేవారు లేరు' అని గంభీర్‌ చెప్పుకొచ్చాడు.

మాకు.. మీకు తేడా అదే..

మాకు.. మీకు తేడా అదే..

ఇటీవల రోహిత్ శర్మతో ఇన్‌స్టాగ్రామ్‌ లైవ్‌ చాట్ చేసిన యువరాజ్ సింగ్‌ పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. అప్పటి తరానికి ప్రస్తుత తరం ఆటగాళ్లకు ఉన్న తేడా చెప్పమని రోహిత్ ప్రశ్నించగా.. క్రమశిక్షణ ఒక్కటేనని యూవీ బదులిచ్చాడు. ‘మాతరానికి ఇప్పటికీ నేను గుర్తించిన తేడా ఏంటంటే.. మా అప్పుడు సీనియర్లంటే మాకు గౌరవం, భయం ఉండేది. అప్పటి సీనియర్ ప్లేయర్లు.. టీమ్‌లోని జూనియర్స్‌‌కు దిశానిర్దేశం చేసేవాళ్లు. కానీ.. ఇప్పుడు ఐపీఎల్, సోషల్ మీడియా కారణంగా రాత్రికి రాత్రే ఫేమ్ వస్తుండటంతో ఆటగాళ్లు కూడా క్రమశిక్షణ తప్పుతున్నారు.' అని యువరాజ్ చెప్పుకొచ్చాడు.

నా క్రికెట్ జీవితంలో ఆ ఇన్నింగ్స్‌ మరవలేనిది : భారత మాజీ కెప్టెన్

మాతరంలో జరిగేది కాదు..

మాతరంలో జరిగేది కాదు..

ఇక తమ తరంలో మీడియా ముందు కూడా చాలా గౌరవంగా నడుచుకునేవాళ్లమని తెలిపాడు. ‘అప్పటి భారత జట్టులో ఓ మంచి సంస్కృతి ఉండేది. మీడియా ముందు ఎలా మాట్లాడాలి..? అభిమానులతో ఎలా వ్యవహరించాలి..? అనేదానిపై జూనియర్ల‌కు సీనియర్ క్రికెటర్లు సలహాలు, సూచనలు ఇచ్చేవారు. ఒకవేళ ఏదైనా పొరపాటు జరిగితే.. అలా చేయకూడదంటూ సున్నితంగా హెచ్చరించేవారు. కానీ.. ఇప్పుడు భారత్ జట్టులో ఆ సంస్కృతి ఏమీ నాకు కనిపించడం లేదు. జూనియర్ క్రికెటర్లు సోషల్ మీడియా, పార్టీ కల్చర్ అంటూ రచ్చ చేస్తున్నారు. కానీ.. అప్పట్లో మేము వీటి గురించి కనీసం ఆలోచించను కూడా లేదు. ఏదైనా తప్పు చేస్తే.. సీనియర్లు కోప్పడతారనే భయం మాకు ఉండేది. రాహుల్- హార్దిక్ వివాదం మా టైమ్‌లో అసలు జరిగి ఉండేది కాదు'అని యువీ స్పష్టం చేశాడు.

కేజ్రీవాల్‌కు సవాల్..

ఇక శనివారం గంభీర్ సోషల్ మీడియా వేదికగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ఓ సవాల్ విసిరాడు. దేశ రాజధానిలో పెరుగుతున్న కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు ఆప్‌ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు తన వంతు సాయంగా మెడికల్‌ కిట్లను గంభీర్‌ అందించాడు. పీపీఈ కిట్లను ప్యాక్‌ చేసిన సంచుల ఫోటోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తూ.. ‘ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నా. వైద్యారోగ్య కార్యకర్తలకు వెయ్యి పీపీఈ(పర్సనల్‌ ప్రొటెక్షన్‌ ఎక్విప్‌మెంట్‌) కిట్‌లను పంపిణీ చేశాను. ఇప్పుడు మీ వంతు. ఢిల్లీ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చండి. మరిన్ని పరికరాల అవసరం ఉంటే వాటి వివరాలు నాకు తెలియజేయండి. పంపిస్తాను' అని కేజ్రీవాల్‌‌కు సవాల్ విసురుతూ ట్వీట్‌ చేశాడు.

Story first published: Sunday, April 12, 2020, 13:18 [IST]
Other articles published on Apr 12, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+