న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ప్రాణాల కంటే మందు ముఖ్యమా? మద్యం ప్రియులపై గంభీర్ ఫైర్!

 Gautam Gambhir not in favour of splitting T20s into 2 innings

న్యూఢిల్లీ: కరోనా నేపథ్యంలో దేశవ్యాప్తంగా విధించిన లాక్‌డౌన్‌‌‌కు కేంద్ర ప్రభుత్వం కొన్ని సడలింపులు ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం మద్యం దుకాణాలు తెరవడంతో మందుబాబులు ఎగబడ్డారు. షాపులు తెరిచిన కాసేపు అంతా బాగానే ఉన్నప్పటికీ... కొన్ని గంటల తర్వాత పరిస్థితి అదుపుతప్పింది. భౌతిక దూరం, మాస్కులు ధరించడం వంటివి కనిపించలేదు.

ఆగ్రహానికి గురైన గంభీర్..

అంతేకాకుండా, తోపులాటలు చోటు చేసుకున్నాయి. కరోనా వైరస్ భయం కూడా లేకుండా మద్యం ప్రియులు వ్యవహరించారు. దీంతో, పలు ప్రాంతాల్లో మద్యం షాపులను పోలీసులు బంద్ చేయించాల్సి వచ్చింది. ఈ వ్యవహారంపై బీజేపీ ఎంపీ, మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ మందుబాబులపై మండిపడ్డారు. ఢిల్లీ జనాలకు ప్రాణాల కంటే మందే ముఖ్యమా? అని ప్రశ్నిస్తూ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌కు మందు షాపుల వద్ద జనాలు ఎగబడుతున్న ఫొటోలను జత చేశారు.

టీ20‌ల్లో ఇన్నింగ్స్‌లు ఎందుకు?

టీ20‌ల్లో ఇన్నింగ్స్‌లు ఎందుకు?

ఇక టీ20‌లను ఇన్నింగ్స్‌‌లుగా విభజించాలనే పత్రిపాదనను ఈ మాజీ ఓపెనర్ వ్యతిరేకించాడు. స్టార్ స్పోర్ట్స్ క్రికెట్ కనెక్టెడ్‌షో ఈ ప్రతిపాదనపై ఆస్ట్రేలలియా దిగ్గజ పేసర్ బ్రెట్‌లీతో కలిసి గంభీర్ చర్చించాడు. ‘టీ20 క్రికెట్‌ను రెండు ఇన్నింగ్స్‌లుగా విభజించాల్సిన అవసరం ఉందని నేను అనుకోను. కాకపోతే మాస్టర్ సచిన్ టెండూల్కర్ సూచించినట్లు వన్డే క్రికెట్‌ను విభజిస్తే బాగుంటుంది. ఎందుకంటే 50 ఓవర్లను రెండు ఇన్నింగ్స్‌లు విభజిస్తే 25 ఓవర్లు ఉంటాయి. అప్పుడు దానికో అర్థం ఉంటుంది.'అని గంభీర్ అభిప్రాయపడ్డాడు.

 టాస్ ప్రభావం కూడా ఉండదు..

టాస్ ప్రభావం కూడా ఉండదు..

ఇలా చేయడం వల్ల టాస్ అంశాన్ని కూడా పక్కకు పెట్టినట్లు అవుతుందన్నాడు. ‘వన్డే‌లను రెండు ఇన్నింగ్స్‌లుగా విభజిస్తే టాస్ పాత్ర కూడా తగ్గుతుంది. ఎందుకంటే జట్టు విజయాల్లో టాస్ చాలా కీలకంగా వ్యవహరిస్తుంది. ముఖ్యంగా విదేశీ సిరీస్‌ల్లో టాస్ ప్రభావం మరీ ఎక్కువ. కానీ టీ20ల్లో మాత్రం ఈ విధానం అమలు చేయడం బాగుండదు. దీన్ని అమలు చేయడం ఎప్పటికైనా కష్టమే. చిన్న ఫార్మాట్‌కు కుదిస్తే ఇంకా చిన్నదవుతుంది.'అని గంభీర్ చెప్పుకొచ్చాడు.

 కొన్ని అలానే ఉంచాలి..

కొన్ని అలానే ఉంచాలి..

ఇక క్రికెట్‌లో కొన్ని విషయాలను సాంప్రదాయకంగా కొనసాగించాలని బ్రెట్‌లీ అభిప్రాయపడ్డాడు. ‘ఐపీఎల్, బిగ్‌బాష్ లీగ్‌లతో టీ20 క్రికెట్‌పై నాకు అవగాహన ఉంది. ఈ ఫార్మాట్ పట్ల ప్రేక్షకులున్న ఉత్సహమే వారిని మైదానాలుకు రప్పిస్తుంది. ఇక క్రికెట్‌లో కొన్ని విషయాలను సాంప్రదాయకంగా కొనసాగించాలి. టీ20లను ఇన్నింగ్స్‌లుగా విభజించడం సరైంది కాదనేది నా అభిప్రాయం. ఆటలో లక్ష్యాలను నెలకొల్పడం.. చేధించడం రసవత్తరంగా ఉంటుంది. అది దెబ్బతినేలా నిర్ణయం తీసుకోవడం ఆటకు అంత మంచిది కాదు'అని బ్రెట్‌లీ చెప్పుకొచ్చాడు.

క్రికెటర్ల భార్యల వైపు చూసి.. కోహ్లీ అలా అరవడంతో రెచ్చిపోయా: రసెల్

Story first published: Tuesday, May 5, 2020, 12:32 [IST]
Other articles published on May 5, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X