Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఆస్ట్రేలియాకు అగ్రస్థానమా.? ఎట్టెట్టా: గంభీర్

Gautam Gambhir Asks On what front are Australia the No. 1-ranked Test team?

న్యూఢిల్లీ: అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) ఇటీవల విడుదల చేసిన టెస్ట్ ర్యాంకింగ్స్‌లో ఆస్ట్రేలియా అగ్రస్థానం దక్కించుకున్న విషయం తెలిసిందే. దీంతో 2016 నుంచి టాప్‌లో కొనసాగిన భారత్ మూడో స్థానానికి పడిపోయింది. కోహ్లీసేనను వెనక్కు నెట్టి న్యూజిలాండ్ రెండో స్థానాన్ని కైవసం చేసుకుంది. అయితే ఈ ర్యాంకింగ్స్‌పై టీమిండియా మాజీ ఓపెనర్ గౌతం గంభీర్ సందేహం వ్యక్తం చేశాడు. ఉపఖండంలో విఫలమైన ఆసీస్‌‌కు అగ్రస్థానం ఎలా కేటాయిస్తారని ప్రశ్నించాడు.

ఏ లెక్కన ఆసీస్ నెంబర్ వన్

ఏ లెక్కన ఆసీస్ నెంబర్ వన్

ఏ ప్రాతిపదికన ర్యాంకులు నిర్ణయించారో తనకు అర్థం కావడం లేదన్నాడు. చాలా కాలం నుంచి టీమిండియానే ఇంట, బయట విజయాలు సాధిస్తే ఆసీస్‌కు టాప్ ర్యాంక్ ను ఎలా కట్టబెట్టారన్నాడు. స్టార్ స్పోర్స్ షో క్రికెట్ కనెక్టెడ్‌లో గంభీర్ మాట్లాడుతూ.. టెస్ట్ చాంపియన్‌షిప్ పాయింట్ల కేటాయింపే హాస్యాస్పదకంగా ఉన్నాయని ఐసీసీ తీరును తప్పుబట్టాడు.

‘భారత్ మూడో ర్యాంకు పడిపోవడం నాకేం ఆశ్చర్యం కలిగించలేదు. నేను ఈ పాయింట్లు, ర్యాంకింగ్ సిస్టమ్‌ను అస్సలు నమ్మను. ముఖ్యంగా ఈ వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ పాయింట్ల కేటాయింపే పరమ చెత్త. స్వదేశంలో గెలిచినా.. విదేశంలో విజయం సాధించి ఒకే తరహా పాయింట్ల కేటాయింపు అనేదే హస్యాస్పదకం.

భారతే నెంబర్ వన్..

భారతే నెంబర్ వన్..

స్వదేశంలో కన్నా విదేశాల్లో భారత్ ఎక్కువగా ఓడిపోవచ్చు. కానీ విదేశీ టెస్ట్ సిరీస్‌ల్లో ఆస్ట్రేలియాపై గెలిచింది. సౌతాఫ్రికాపై సిరీస్ నెగ్గింది. ఇంగ్లండ్‌ను ఓ టెస్ట్‌లో ఓడించింది. ప్రస్తుతం టాప్‌ ర్యాంక్‌లో ఉన్న జట్లు కనీసం ఈ ప్రదర్శన కూడా కనబర్చలేదు. ఓవరాల్‌గా భారత్ మెరుగైన ప్రదర్శన చేసింది. నా దృష్టిలో ఇండియానే నెంబర్ వన్. ఎందుకంటే ఆసీస్‌కు టాప్ ర్యాంక్ ఇచ్చిన విషయంలో నాకు అనేక అనుమానాలు ఉన్నాయి. విదేశాల్లో ఆ జట్టు అంతగా విజయాలు సాధించలేదు. ముఖ్యంగా ఉపఖండ పిచ్‌లపై దారుణంగా విఫలమైంది.'అని గంభీర్ చెప్పుకొచ్చాడు.

టాప్ ర్యాంక్ చేజారినా..

టాప్ ర్యాంక్ చేజారినా..

మే నెల తొలి వారంలో విడుదల చేసిన కొత్త లెక్కల ప్రకారం ఆస్ట్రేలియా (116 పాయింట్లు) టాప్‌ ర్యాంకుకు చేరగా... న్యూజిలాండ్‌ (115) రెండో స్థానానికి ఎగబాకింది. భారత్‌ (114) మూడో ర్యాంకుకు పడిపోయింది. అయితే 2003లో టెస్టు ర్యాంకుల్ని ప్రవేశపెట్టాక టాప్‌-3 జట్ల మధ్య మరీ ఇంత అత్యల్ప వ్యత్యాసం ఉండటం ఇదే మొదటిసారి. కోహ్లి సేన 2016-17 సీజన్‌ నుంచి చక్కని ప్రదర్శనతో వరుసబెట్టి ఒక్కో సిరీస్‌ గెలుస్తూ వచ్చింది.

దీంతో ‘టాప్‌' ర్యాంకును చేరుకోవడంతోపాటు ఇన్నాళ్లూ పదిలపరుచుకుంది. అలా ఒకటో నంబర్‌ జట్టుగా గదను సగర్వంగా అందుకుంది. అయితే వార్షిక లెక్కల ప్రకారం 2019 మే నుంచి ఫలితాల్ని పరిగణిస్తారు. దీని ప్రకారం ఆసీస్‌ టాప్‌ను దక్కించుకుంది. కానీ ఐసీసీ టెస్టు చాంపియన్‌షిప్‌లో మాత్రం భారతే అగ్రస్థానంలో ఉంది.

కుక్కలు మొరుగుతూనే ఉంటాయ్.. ట్రోలర్స్‌‌కు మహ్మద్ షమీ వైఫ్ కౌంటర్!

Story first published: Monday, May 11, 2020, 20:50 [IST]
Other articles published on May 11, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+