
అనుమానమే విచారించండి..
ఇక తన దగ్గర ఆధారాలున్నట్లు మేకపోతు గాంభీర్యం ప్రదర్శించిన ఈ శ్రీలంక మాజీ మంత్రి.. పోలీసుల ముందు ప్లేట్ ఫిరాయించాడు. ఫిక్సింగ్ జరిగిందనేది తన అనుమానం మాత్రమేనని వెల్లడించాడు. ‘భారత్, శ్రీలంక మధ్య జరిగిన ప్రపంచకప్-2011 ఫైనల్ మ్యాచ్ ఫిక్సయిందని నేను అనుమానం వ్యక్తం చేశాను. నా అనుమానంపై విచారణ చేయాల్సిందిగా పోలీసులను కోరాను. అంతేకాకుండా ఫైనల్ మ్యాచ్ ఫిక్సయిందని అక్టోబర్ 30, 2011న ఐసీసీకి ఫిర్యాదు చేసిన కాపీని కూడా ఇచ్చాను'అని పోలీసుల విచారణ అనంతరం మహిదానంద మీడియాకు తెలిపారు.

సర్కస్ మొదలైంది..
ఇక మహిదానందర ఆరోపణలను ఇప్పటికే లంక మాజీ ఆటగాళ్లు మహేళ జయవర్దనే, కుమార సంగక్కర, అరవింద డిసిల్వా ఖండించారు. నిరాధర ఆరోపణలు చేయవద్దని, ఆధారాలు ఉంటే ఇవ్వాలని మండిపడ్డారు. సర్కస్ మొదలైందని మహేల సెటైరిక్‌గా ట్వీట్ చేయగా.. ‘ప్రపంచకప్ ఫైనల్‌ను ఫిక్స్ చేయడం అంత చిన్న విషయమేమీ కాదు. మ్యాచ్ ఆడిన తుది జట్టులో భాగం కాని వ్యక్తి అలా ఎలా చేయగలడో మాకైతే తెలీదు. 9 ఏళ్ల తర్వాత ఇప్పుడైనా మాకు జ్ఞానోదయం కలిగించండి'అంటూ కుమార సంగక్కర వ్యంగ్యాస్త్రాలు సంధించాడు.

ఈ దగాకోరును వదిలిపెట్టొద్దు..
బేస్‌లెస్ ఆరోపణలతో నిందలు మోపుతున్న మహిదానందను వదిలి పెట్టవద్దని, విచారణ జరిపించాలని డిసిల్వా డిమాండ్ చేశాడు. విశ్వసనీయత లేని మహీందానంద భారత్, శ్రీలంక ఆటగాళ్లతో పాటు 2011 ప్రపంచకప్ ఫైనల్‌తో సంబంధం ఉన్న అందరిపై ఆరోపణలు చేస్తూ..వారి కీర్తీ, ప్రతిష్టలకు భంగం కలిగించే ప్రయత్నం చేస్తున్నాడని మండిపడ్డాడు. ముఖ్యంగా భారత అభిమానులు, దిగ్గజ ఆటగాడైన సచిన్ టెండూల్కర్‌ను అవమానపరిచేలా ఉన్న అతని వ్యాఖ్యలపై సమగ్ర విచారణ జరిపించాలని ఐసీసీ, బీసీసీఐ, శ్రీలంక క్రికెట్ బోర్డులను విజ్ఞప్తి చేశాడు.

శ్రీలంక అమ్ముడుపోయింది..
తమ దేశానికి చెందిన ఓ టీవీతో మాట్లాడుతూ మహీదానంద అలుత్గామాగే ఈ ఫిక్సింగ్ ఆరోపణలు చేశారు. ‘మీకు నేనో విషయం చెప్పాలనుకుంటున్నా. 2011 ప్రపంచకప్ అమ్ముడుపోయింది. ఈ విషయాన్ని నేను క్రీడల మంత్రిగా ఉన్నప్పుడే చెప్పాను. 2011 లేదంటే 2012 ఏడాదో సరిగ్గా గుర్తుకు రావడం లేదు కానీ... ఫైనల్ మ్యాచ్ మేం గెలవాల్సింది. అయితే ఇది తెలియజేయడం నా బాధ్యతని చెబుతున్నా... ఆ మ్యాచ్ ఫిక్సయింది. ప్రజలు దీనిపై కలత చెందారని తెలుసు. దీనిపై ఏ చర్చకైనా నేను సిద్ధం' అని అన్నారు. అయితే ఈ ఫిక్సింగ్‌లో లంక ఆటగాళ్లెవరూ పాల్గొనలేదని, కొన్ని వర్గాలు ఇందులో భాగమయ్యాయని చెప్పుకొచ్చారు.
ఆరోజు డివిలియర్స్ లేకుంటే టీ20ల్లో డబుల్ సెంచరీ నమోదయ్యేది: క్రిస్ గేల్


Click it and Unblock the Notifications
