ఆరోజు డివిలియర్స్ లేకుంటే టీ20ల్లో డబుల్ సెంచరీ నమోదయ్యేది: క్రిస్ గేల్

న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో వెస్టిండీస్ విధ్వంసకర బ్యాట్స్‌మన్ క్రిస్ గేల్ ఆడిన సునామీ ఇన్నింగ్స్ అందరికి సుపరిచితమే. 2013 సీజన్‌లో పుణె వారియర్స్ ఇండియాతో జరిగిన నాటి మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తరఫున బరిలోకి దిగిన గేల్.. ఆకాశమే హద్దుగా చెలరేగాడు. అసాధారణమైన ఆటతో ఆకాశమే హద్దుగా బౌలర్లపై విరుచుకుపడిన ఈ విండీస్ వీరుడు ఏకంగా 13 ఫోర్లు, 17 సిక్సర్లతో బౌండరీల భీభత్సం సృష్టించాడు.

200 కొట్టేలా..
అతని ధాటైనా ఇన్నింగ్స్ చూసిన ప్రతీ ఒక్కరూ.. టీ20ల్లో అసాధ్యమైన డబుల్ సెంచరీ సుసాధ్యమయ్యే క్షణం వచ్చేసిందనుకున్నారు. కానీ సహచర ఆటగాడు.. సౌతాఫ్రికా లెజెండ్ ఏబీ డివిలియర్స్ (8 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లు 31) చిన్న పాటి తుఫాను సృష్టించడంతో గేల్ పరుగుల సునామీకి కళ్లెం పడింది. అజేయ సెంచరీ( 175)కే గేల్ పరిమితం కావాల్సి వచ్చింది. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక వ్యక్తిగత స్కోర్‌గా మాత్రం నిలిచిపోయింది.

ఏబీడీ లేకుంటే..
అయితే తాజాగా గేల్ ఈ విధ్వంసకర ఇన్నింగ్స్‌ను గుర్తు చేసుకున్నాడు. టీమిండియా ఓపెనర్ మయాంక్ అగర్వాల్ ‘ఓపెన్ నెట్స్ విత్ మయాంక్' కార్యక్రమంలో భారత ఆటగాడు కేఎల్ రాహుల్‌తో కలిసి పాల్గొన్న గేల్.. పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. పుణెతో జరిగిన నాటి మ్యాచ్‌లో డివిలియర్స్ ఆడకుంటే డబుల్ సెంచరీ చేసేవాడినని చెప్పుకొచ్చాడు. దీనికి సంబంధించిన వీడియోను బీసీసీఐ షేర్ చేసింది.

పిచ్ చాలా కఠినంగా..
ఇక వర్షం అంతరాయం కలిగించిన నాటి మ్యాచ్‌లో పిచ్ చాలా కఠినంగా ఉందని తన సహచర ఆటగాడు రవిరాంపాల్‌కు చెప్పానని గేల్ గుర్తు చేసుకున్నాడు.‘వర్షం పడక ముందు నేను ఎదుర్కొన్న కొన్న ఓవర్లు నాకింకా గుర్తుకున్నాయి. వర్షం రావడంతో డ్రెస్సింగ్ రూమ్‌లోకి వెళ్లిన నేను రవి రాంపాల్‌తో పిచ్ చాలా కఠినంగా ఉంది. మనం 170-180 పరుగులు చేస్తేనే గెలవగలమని చెప్పా. ఎందుకుంటే పిచ్ అంత బాగుంది. 'అని ఈ విధ్వంసకర బ్యాట్స్‌మన్ తెలిపాడు. ఇక గేల్ విధ్వంసంతో ఆర్సీబీ ఆ మ్యాచ్‌లో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 263 పరుగులు చేసింది. ఒక్క భువనేశ్వర్ కుమార్(0/23) మినహా.. బౌలర్లంతా గేల్ విధ్వంసానికి బలయ్యారు. అనంతరం పుణె 133/9 కే పరిమితమై 130 పరుగుల ఘోర పరాజయాన్ని చవిచూసింది.

వర్షం ముగిసిన తర్వాత
ఇక వర్షం ముగిసిన తర్వాత మైదానంలోకి వెళ్తే పిచ్ పూర్తిగా మారిందని,తన జోన్‌లోకి వచ్చినట్లు అనిపించిందని గేల్ గుర్తు చేసుకున్నాడు.‘వర్షం ముగిసిన తర్వాత బరిలోకి దిగిన నేను.. ఎక్కడ వదిలేసానో అక్కడి నుంచే ప్రారంభించాను. ఆ ఫ్లోలో ఆడేసాను. బ్యాట్స్‌మన్‌కు ఏ మాత్రం తప్పు చేయని రోజు ఒకటుంటుంది. అది అలాంటిదే. అదో అద్భుతమైన ఇన్నింగ్స్. విశేషం ఏంటంటే జట్టు స్కోర్ 175 పరుగులు ఉండాలన్న నేనొక్కడినే ఆ రన్స్ చేశాను. ఏబీడీ ధాటిగా ఆడకుంటే నేను 200 పరుగులు చేసేవాడిని'అని ఈ విండీస్ వీరుడు చెప్పుకొచ్చాడు. ఇక సన్ రైజర్స్ స్పిన్నర్ రషీద్ ఖాన్‌ను చీల్చి చిండాడిన విషయాన్ని కూడా గేల్ గుర్తు చేసుకున్నాడు. ఇక క్రికెట్‌లో టెస్ట్ ఫార్మాట్‌కు మించింది లేదన్నాడు.
కపిల్ చెప్పిన ఆ మాటలే 1983 ప్రపంచకప్ విజయానికి కారణం: శ్రీకాంత్
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications