అప్పుడు భారత్ చిన్నపిల్లలపై గెలిచినట్లు అనిపించింది: సఫారీ క్రికెటర్

కేప్‌టౌన్: 2018 సౌతాఫ్రికా టూర్‌లో భారత జట్టు అద్భుత ప్రదర్శన కనబర్చిందని ఆ జట్టు మాజీ కెప్టెన్, సీనియర్ క్రికెటర్ ఫాఫ్ డుప్లెసిస్ అన్నాడు. అదే సమయంలో తమ జట్టు ఘోరంగా విఫలమైందని అప్పుడు సఫారీ టీమ్‌ను నడిపించిన డుప్లెసిసే తెలిపాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. భారత్, సాతాఫ్రికా టుర్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

5-1తో చిత్తుగా..
నాటి వన్డే సిరీస్‌లో భారత ఆటగాళ్లు చిన్నపిల్లలపై ఆధిపత్యం చెలాయించినట్లు అనిపించిందన్నా. 'వన్డే సిరీస్‌లో మా ఆటగాళ్లు పలువురు గాయపడ్డారు. నా చేతివేలు ఒకటి ఫ్రాక్చర్ అయింది. క్వింటన్ డికాక్, హషీమ్ ఆమ్లా కూడా తీవ్రంగా గాయపడ్డారు. దాంతో మా బ్యాటింగ్ లైనప్ చతికిలపడింది. మరోవైపు భారత్ రెచ్చిపోయి ఆడింది. ఫలితంగా వన్డే సిరీస్ 5-1తో భారత్ వశమైంది. ఆ సమయంలో భారత్ విజయం.. పెద్దొళ్లు చిన్నపిల్లలపై గెలిచినట్లు అనిపించింది. ఆ సిరీస్‌లో భారత ఆటగాళ్లు చాలా అద్భుతంగా ఆడారు' అని ఈ మాజీ కెప్టెన్ చెప్పుకొచ్చాడు.

టెస్ట్ సిరీస్ గెలిచాం..
అనంతరం టెస్టు సిరీస్‌పై స్పందించిన డుప్లెసిస్ అందులో సౌతాఫ్రికా 2-1 తేడాతో గెలిచిందన్నాడు.‘టెస్టుల్లో మేం భారత్‌ను ఓడించాం, అయితే అది చాలా గొప్ప టెస్టు సిరీస్. నా కెరీర్‌లోనే అదో అత్యుత్తమ సిరీస్. ఎందుకంటే ఆ సిరీస్‌లో భారత్ తొలిసారి మొత్తం పేస్ బౌలింగ్‌ను ఉపయోగించింది. ఆ బౌలర్లు సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా లాంటి పిచ్‌ల మీద కూడా చెలరేగగలరు.

బుమ్రా అరంగేట్రం ఊహించలేదు..
ఆ సిరీస్‌లోనే బుమ్రా టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. దీన్ని ఏమాత్రం ఊహించలేదు. అతడు టెస్టుల్లో ఆడడని మేం భావించాం. ఎందుకంటే అతడెంతో నైపుణ్యం గల పేసర్. ఆర్చర్‌లా చాలా వేగంగా బంతులేస్తాడు. ఆ ఇద్దరి బౌలింగ్ చాలా బాగుంటుంది. ఆ టెస్టు సిరీస్‌లో టీమిండియా ఓడిపోయినప్పటికీ అదెంతో శక్తివంతమైన జట్టు' అని డుప్లెసిస్ వివరించాడు. కాగా, ఆ పర్యటనలో కోహ్లీసేన దక్షిణాఫ్రికాపై 5-1 తేడాతో వన్డే సిరీస్, 2-1 తేడాతో టీ20 సిరీస్‌లు గెలుపొందగా టెస్టు సిరీస్ 1-2 తో కోల్పోయింది. టెస్ట్ సిరీస్‌లో కూడా గట్టి పోటీనిచ్చిన కోహ్లీసేన.. విజయం ముంగిట చేతులెత్తేసింది.
అక్తర్‌ను చూసి సచిన్ భయపడేవాడు.. అతను ఈ విషయాన్ని ఎప్పటికీ ఒప్పుకోడు: అఫ్రిది
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications