మ్యాచ్ ఓడితే మాత్రం.. నీ తప్పుడు నిర్ణయమే కారణమని అంపైర్‌పై అరిచా: మాజీ క్రికెటర్

మెల్‌బోర్న్: ఓ మ్యాచ్‌లో అంపైర్ ఇచ్చిన తప్పుడు నిర్ణయంతో సహనం కోల్పోయి మూల్యం చెల్లించుకున్నానని ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్ బ్రాడ్ హగ్ తెలిపాడు. 2015 బిగ్‌బాష్ లీగ్‌లో మెల్‌బోర్న్ రెనెగెడ్స్, పెర్త్ స్కార్చర్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో బ్రాడ్‌ను వెస్టిండీస్ విధ్వంసకర బ్యాట్స్‌మన్ క్రిస్ గేల్ చితక్కొట్టాడు. అతని ధాటికి బ్రాడ్ 4 ఓవర్లలో 44 పరుగులు సమర్పించుకొని కెరీర్‌లోనే ఓ చెత్త ప్రదర్శనను తన పేరిట లిఖించుకున్నాడు.తాజాగా తన యూట్యూబ్ చానెల్‌లో నాటి మ్యాచ్ పరిస్థితులను గుర్తు చేసుకున్న హగ్.. అంపైర్ తప్పుడు నిర్ణయంతోనే సహనం కోల్పోయి అలా పరుగులు సమర్పించుకున్నానని తెలిపాడు. మైదానంలో ఎప్పుడూ సానుకూల దృక్పథం, సత్ప్రవర్తనతో ఉండాలని, అలా ఉంటేనే అనుకున్న సక్సెస్ వస్తుందని యువ ఆటగాళ్లకు సూచించాడు.

అనుకున్నవి జరగలేదు..
‘2015 డిసెంబర్ 30న మెల్‌బోర్న్ రెనిగేడ్స్, పెర్త్ స్కార్చర్స్ మధ్య మ్యాచ్. గేల్ రెనెగేడ్స్ తరపున బరిలోకి దిగగా.. నేను పెర్త్ జట్టు తరఫున ఆడాను. మ్యాచ్‌కు ముందే మా ఓపెనింగ్ బౌలర్లు క్రిస్‌గేల్‌ను ఔట్ చేసి శుభారంభాన్నిస్తారనుకున్నా. ఎందుకంటే ఆ నెమ్మదైన పిచ్ నా బౌలింగ్‌కు ప్రతికూలమైనది. నాకు ఎక్స్‌ట్రా బౌన్స్ పిచ్‌లైతేనే నచ్చుతుంది. ఆ తరహా పిచ్‌లపైనే నేను బంతిని బాగా తిప్పగలను. అంతకుముందే గేల్ నాపై ఆధిపత్యం చెలాయించాడు. అందుకే వీలైనంత ఎక్కువగా నా బౌలింగ్‌లో గేల్ స్ట్రైకింగ్ తీసుకోకుండా చేయాలనుకున్నా. కానీ తొలి బంతి ఆడిన ఆరోన్ ఫించ్.. గేల్‌కు స్ట్రైక్ ఇచ్చాడు. దాంతో తదుపరి ఐదు బంతులు గేల్‌కే వేయాల్సి వచ్చింది.

వికెట్ల ముందు బోల్తా కొట్టించా..
చెలారేగుతాడనే ఉద్దేశంతో క్విక్ షార్ట్ పిచ్ బంతులు వేయాలనుకున్నా. ఓవర్ పిచ్ బంతులు కూడా వేయవద్దనుకున్నా. ఇలా నాకు ప్రతికూల ఆలోచనలు రావడంతో మూడు బంతుల్లో ఓ సిక్స్, ఫోర్ సమర్పించుకున్నా. ఇక ఐదో బంతిని గేల్ ఏ మాత్రం ఊహించని రీతిలో వేసి వికెట్ల ముందు బోల్తా కొట్టించా. బ్యాట్‌ను తప్పించుకున్న బంతి మిడిల్ స్టంప్ దిశగా దూసుకెళ్తూ అతని ప్యాడ్లను తాకింది. కానీ అంపైర్ నాటౌట్ ఇచ్చాడు.

తమాషా చేస్తున్నావా?
ఆ అంపైర్‌ను గతంలో ఎప్పుడూ అంపైరింగ్ చేయడం చూడలేదు. ఎందుకు నాటౌట్ ఇచ్చావని ప్రశ్నించా. తమాషా చేస్తున్నావా? బంతి అంత స్పష్టంగా మిడిల్ స్టంప్ దిశగా దూసుకెళ్లిందని వాదించా. కానీ అతను మాత్రం నేను చెప్పేది తప్పన్నాడు. బంతి డౌన్ లెగ్ దిశగా వెళ్లిందన్నాడు. వెంటనే నేను ఈ బంతిని నీవు తొలిసారి చూశావేమో.. నేను ఇప్పటికే చాలా వేసాను. ఈ మ్యాచ్‌లో మేం ఓడిపోతే కనుక దానికి కారణం నువ్వేనని ఆ అంపైర్‌పై అరిచా. ఆ మరుసటి బంతి డాట్. కానీ తదుపరి ఓవర్‌లో 13 పరుగులు ఇచ్చా(వాస్తవానికి 16). ఎందుకంటే ఆ అంపైర్ తప్పుడు నిర్ణయంతో సహనం కోల్పోయా. ఆండ్రూటై బౌలింగ్ చేస్తున్నంత సేపు స్క్వేర్ లెగ్‌లో ఫీల్డింగ్ చేస్తున్న నేను అంపైర్‌ను తిడుతూనే ఉన్నా. ఆ సమయంలో నా ఆటపై దృష్టిసారించలేకపోయా. దాంతో ఆ సాయంత్రం క్రిస్‌గేల్ చేతిలో బలయ్యా. 44 పరుగులు సమర్పించుకున్నా. ఆ మ్యాచ్‌లో గేల్ నన్ను ఓ సెకండ్ గ్రేడ్ బౌలర్‌గా మార్చేశాడు. కానీ ఇదే సాధారణమే.

అప్‌సెట్ కావద్దు..
ఇక జీవితంలో ఏం జరిగినా మాములుగానే ఉండాలి. నెగటీవ్ ఆలోచనలు, చెడు ప్రవర్తన వల్ల వైఫల్యమే చెందుతాం. అంపైర్‌పై ఆగ్రహంతో ఫోకస్ కోల్పోయి ఆ మ్యాచ్‌లో నేను మూల్యం చెల్లించుకున్నా. అందుకే మైదానంలో ఎప్పుడూ అప్‌సెట్ కావద్దు. ఒక్క చెడ్డ బంతికో, అంపైర్ తప్పుడు నిర్ణయానికో ఆగ్రహానికి గురికావద్దు. సానుకూల దృక్ఫథంతో ఉంటేనే విజయం దక్కుతుంది. నాకు షేన్‌వార్న్‌కు ఉన్న తేడా అదే. టెస్ట్ క్రికెట్‌లో వార్న్ అందుకే సక్సెస్ అయ్యాడు. క్రికెట్ పట్ల అతనికి మంచి ఆలోచన విధానం ఉండేది. ఈ విషయంలో నాకంటే అతనెంతో మెరుగైనవాడు'అని బ్రాడ్ హగ్ చెప్పుకొచ్చాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications