ఆరోజు దాల్మియా లేకుంటే.. అక్తర్ కెరీర్ అప్పుడే ముగిసేది: పీసీబీ మాజీ చీఫ్

కరాచీ: భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) మాజీ ప్రెసిడెంట్ జగ్మోహన్ దాల్మియా సహాయపడకపోయి ఉంటే మాజీ పేసర్ షోయబ్ అక్తర్ కెరీర్ 2000-01లోనే ముగిసిపోయేదని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) మాజీ అధ్యక్షుడు తౌకీర్ జియా వ్యాఖ్యానించాడు. దాల్మియా 1997 నుంచి 2000 వరకు ఐసీసీ అధ్యక్షుడిగా పనిచేశారు. అయితే 1999లో అక్తర్ బౌలింగ్ శైలిపై దుమారం రేగడంతో ఐసీసీ విచారణ జరిపింది. అప్పుడు దాల్మియా పీసీబీకి మద్దతుగా నిలిచారని తాజాగా ఓ ఇంటర్వ్యూలో జియా వెల్లడించాడు.

పుట్టకతోనే వచ్చిందని...
‘ఐసీసీ సభ్యులంతా అక్తర్ బౌలింగ్ యాక్షన్‌పై అభ్యంతరం వ్యక్తం చేసినా... దాల్మియా మాకు మద్దతుగా నిలిచారు. ఐసీసీలో అయనకున్న పలుకుబడి దృష్ట్యా మిగతా సభ్యుల అభ్యంతరాలన్నీ వీగిపోయాయి. అక్తర్‌కు పుట్టుకతోనే కుడిచేతి మోచేయి కాస్త పొడుగ్గా ఉందని, దాంతోనే అలాంటి యాక్షన్‌తో బౌలింగ్ చేస్తున్నట్లు నమ్మబలకడంతో ఆ వివాదం అంతటితో ముగిసింది.'అని జియా తెలిపాడు.
మియాందాద్ ఉద్వాసన ఇమ్రాన్ ఖాన్ కుట్రే.. పాక్ మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు

గ్రూప్ తగాదాలే...
2003 ప్రపంచకప్‌లో పాకిస్థాన్ ఓటమికి జట్టులోని గ్రూప్ తగాదాలే కారణమని జియా పేర్కొన్నాడు. కక్షసాధింపు చర్యల్లో భాగంగానే కొందరు ఆటగాళ్లు కావాలనే సరిగ్గా ఆడలేదని, ఫలితంగా పాక్ సూపర్ సిక్స్‌కు కూడా అర్హత సాధించలేకపోయిందని వాపోయాడు. ఈ మెగాటోర్నీ తర్వాత పాకిస్థాన్ స్టార్ ప్లేయర్లు వసీం అక్రమ్, వకార్ యూనిస్, సయీద్ అన్వర్‌లను జట్టు నుంచి తొలిగించాలని నాటి చీఫ్ సెలెక్టర్ వసీమ్ బస్రీ కోరినట్లు జియా గుర్తు చేసుకున్నాడు.
‘ప్రపంచకప్ కోసం మేం ఎంపిక చేసిన అత్యుత్తమైన జట్టు ఆటతీరు చూసి తీవ్ర నిరాశకు గురయ్యాను. ఈ మెగాటోర్నీకి ముందే జట్టులో ఆటగాళ్లు గ్రూప్‌లుగా విడిపోయారని విన్నాను. ఈ విభేదాల కారణంగానే కొందరూ కావాలనే ఉత్తమ ప్రదర్శన ఇవ్వలేకపోయారు.'అని జియా తెలిపాడు.

వకార్ వల్లే..
ఆ టోర్నీలో వకార్ యూనిస్ జట్టును నడిపించాడని, అయితే అతను కొంతమంది ఆటగాళ్లకు మద్దతు ఇవ్వలేదనే వార్తలు అప్పట్లో వినిపించాయని జియా గుర్తు చేసుకున్నాడు. ‘వరల్డ్‌కప్ టీమ్ సారథ్య బాధ్యతలను వసీంకు ఇవ్వాలని నేను ప్రతిపాదించా. కానీ బోర్డులోని చాలా మంది నన్ను వ్యతిరేకించారు. ఆఖరికి ఫిక్సింగ్ ఆరోపణల కారణంగా ఐసీసీ కూడా అంగీకరించలేదు.
ప్రపంచకప్ తర్వాత సెలెక్షన్ ఛైర్మన్‌తో కూర్చొని.. వసీం, వకార్, సయిద్, మరికొంతమంది ఆటగాళ్లను జట్టు నుంచి తొలగించాలని సూచించా. అనంతరం రషీద్ లతీఫ్‌కు సారథ్య బాధ్యతలు అప్పగిస్తూ.. కొత్త టీమ్‌ను సిద్ధం చేయాలని కోరాం. వారితో పాటు సీనియర్ ప్లేయర్లు అయిన షోయబ్ అక్తర్, ఇంజుమామ్ ఉల్ హక్‌లను పక్కనపెట్టాం. రషీద్ తన బాధ్యతలను బాగానే నిర్వర్తించాడు. కానీ ఆ తర్వాత పరిస్థితులన్నీ మారాయి'అని జియా చెప్పుకొచ్చాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications