For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

మియాందాద్ ఉద్వాసన ఇమ్రాన్ ఖాన్ కుట్రే.. పాక్ మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు

Basit Ali Says Imran Khan was the man who ordered Javed Miandad’s exclusion from Pakistan side

ఇస్లామాబాద్: పాకిస్థాన్ లెజండరీ క్రికెటర్ జావెద్‌ మియాందాద్‌ను జట్టు నుంచి తొలగించడం వెనుక కుట్ర ఉందని ఆ దేశ మాజీ క్రికెటర్‌ బాసిత్‌ అలీ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఈ కుట్రలో ఇమ్రాన్‌ ఖాన్‌ ప్రధాన సూత్రధారని, తనను పావుగా వాడుకున్నారని ఆరోపించాడు.

1993-96 మధ్య 19 టెస్టులు, 50 వన్డేలలో పాకిస్థాన్‌కు ప్రాతినిధ్యం వహించిన బాసిత్.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ కుట్రకు సంబంధించిన విషయాలను వెల్లడించాడు. ఇన్నాళ్లు దేశ శ్రేయస్సు కోసం మౌనంగా ఉన్నానని, ఈ విషయం ఎక్కడా చెప్పలేదని వ్యాఖ్యానించాడు.

ఇమ్రాన్ ఖాన్ ఆదేశాలతో..

ఇమ్రాన్ ఖాన్ ఆదేశాలతో..

1992 వరల్డ్‌కప్‌తో రిటైరైన ఇమ్రాన్‌ ఖాన్‌...తన శిష్యుడు, అప్పటి కెప్టెన్‌ వసీం అక్రమ్‌ కలిసి మియాందాద్‌ను తొలగించారని బాసిత్ ఆరోపించాడు. అప్పటి వరకు నాలుగో స్థానంలో అద్భుతంగా బ్యాటింగ్ చేసిన తనను మియాందాద్ ఉద్వాసనతో ఆరో స్థానంలో బ్యాటింగ్ చేయమన్నారని గుర్తు చేసుకున్నాడు.

‘1993 ప్రాంతంలో జట్టునుంచి మియాందాద్‌కు ఉద్వాసన పలకడానికి కుట్ర జరిగింది. అందుకే నన్ను జావెద్‌తో పోల్చడం ప్రారంభించారు. నిజాయతీగా చెప్పాలంటే మియాందాద్‌తో పోలిస్తే ఒక్కశాతం కూడా అతడికి నేను సరితూగను. నాలుగోస్థానంలో దిగే నన్ను మియాందాద్‌ను తప్పించగానే ఆరోస్థానానికి దిగజార్చారు. నాలుగో స్థానంలో అద్భుతంగా బ్యాటింగ్ చేసిన నేను ఆరో స్థానంలో దారుణంగా విఫలమయ్యాను. ఆ ప్లేస్‌లో నేను ఆడలేననే విషయం వారికి తెలుసు.

నా ఆట పట్ల నాకు ప్యాషన్ ఉండేది. నేను భారీ షాట్లు ఆడబోయి ఔటయ్యేవాడిని. నాకు బ్యాటింగ్ కూడా వచ్చేది కాదు. ఆ సమయంలో వసీం అక్రమ్ కెప్టెన్‌‌. ఇమ్రాన్‌ ఆదేశాలమేరకు నడుచుకునే అక్రమ్‌ ఇదంతా చేశాడు.'అని బాసిత్‌ ఆరోపించాడు.

ముందు జావేద్ లేడు..

ముందు జావేద్ లేడు..

ఇక 1996 ప్రపంచకప్ పాకిస్థాన్ జట్టులో ముందుగా మియాందాద్ పేరు లేదని, తాను వైదొలిగితేనే జావెద్ జట్టులోకి వచ్చాడని బాసిత్ తెలిపాడు. ‘ముందుగా ప్రకటించిన 1996 ప్రపంచకప్‌ పాకిస్థాన్ జట్టులో మియాందాద్ పేరు లేదు. 15 సభ్యులతో కూడిన టీమ్‌లో నేనొకడిని. కానీ మియాందాద్ ప్లేయర్ల దగ్గరకు వచ్చి అతనికి వరల్డ్‌కప్ ఆడాలనుందని రిక్వెస్ట్ చేశాడు. అత్యధిక ప్రపంచకప్‌లు ఆడిన రికార్డు నమోదు చేయాలనుకుంటున్నట్లు తెలిపాడు.

అతని కోసం ఎవరు ప్లేస్ ఇస్తారని ప్రశ్నించాడు. దీంతో అతనిపై ఉన్న గౌరవంతో నా ప్లేస్‌ను త్యాగం చేశాను.

అదే నా బెస్ట్ టూర్..

అదే నా బెస్ట్ టూర్..

1987లో ఇండియా టూర్‌కు వచ్చినప్పుడు భారత ఆటగాళ్లతో కలిసి హోలీ ఆడామని జావెద్ మియాందాద్ తెలిపిన విషయం తెలిసిందే. ఓ యూట్యూబ్‌ వీడియోలో మాట్లాడుతూ మధురమైన ఈ పాత జ్ఞాపకాన్ని నెమరేసుకున్నాడు. ‘బెంగళూరులో టెస్టు సందర్భంగా భారత్-పాక్ ఆటగాళ్లు ఒకే హోటల్‌లో స్టే చేశాం. సాయంత్రం మేమంతా ఒకే చోట చేరి సరదాగా మాట్లాడుకునే వాళ్లం. అది హోలీ సీజన్‌ కావడంతో హోటల్‌లోని వారంతా హోలీ ఆడేవారు. నాకు ఇంకా గుర్తుంది. మేమంతా కలిసి ఇమ్రాన్‌ఖాన్‌ రూంలోకి వెళ్లి రంగులు చల్లుకున్నాం. భారత క్రికెటర్లను కూడా మేము వదల్లేదు. వారు కూడా మాకు ఎలాంటి అడ్డు చెప్పలేదు' అని ఈ పాక్ లెజండరీ బ్యాట్స్‌మన్ గుర్తు చేసుకున్నాడు. ఇక తనకెరీర్‌లో ఇదే బెస్ట్ టూర్ అని చెప్పుకొచ్చాడు.

Story first published: Thursday, April 16, 2020, 20:34 [IST]
Other articles published on Apr 16, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+