Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సౌరవ్ గంగూలీ టీ20 క్రికెట్‌కు పనికిరాడు.. కేకేఆర్ మాజీ కోచ్ వివాదాస్పద వ్యాఖ్యలు!

Former KKR coach John Buchanan Says Sourav Ganguly was not suited to T20 cricket as player or captain

న్యూఢిల్లీ: భారత క్రికెట్‌ చరిత్రలో అత్యంత విజయవంతమైన కెప్టెన్లలో ఒకడిగా గుర్తింపు పొందిన సౌరవ్ గంగూలీ.. టీ20 క్రికెట్‌కు ఏ విధంగా పనికిరాడని కోల్‌కతా నైట్ రైడర్స్ మాజీ కోచ్ జాన్ బుచానాన్ అన్నాడు. ధనాధన్ క్రికెట్‌లో కెప్టెన్ నిర్ణయాలు చాలా త్వరగా తీసుకోవాలని, ఆ నైపుణ్యం దాదాలో లేదని వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. కోల్‌కతా ప్రిన్స్‌గా 2008 ఆరంభ సీజన్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు పగ్గాలందుకున్న దాదా.. ఆశించిన మేర ఫలితాన్ని చూపించలేకపోయాడు. ఆ సీజన్‌లో జట్టు ఆరోస్థానంతో సరిపెట్టుకోగా.. అనంతరం జరిగిన రెండు సీజన్లలో దారుణంగా విఫలమైంది. మధ్యలో గంగూలీ కెప్టెన్సీ కూడా కోల్పోయి.. మళ్లీ అందుకున్నాడు. అయినా కోల్‌కతా రాత మారలేదు. ఇక 2010 వరకు కోల్‌కతాకు ఆడిన గంగూలీ.. ఆ తర్వాత 2011,12 సీజన్లలో పుణే వారియర్స్ ఇండియాకు ప్రాతినిథ్యం వహించాడు.

ఆ క్వాలిటీ గంగూలీలో లేదు..

ఆ క్వాలిటీ గంగూలీలో లేదు..

ఐపీఎల్ ప్రారంభ రెండు సీజన్లలో జాన్ బుచానాన్ కోల్‌కతా నైట్‌రైడర్స్ కోచ్‌గా వ్యవహరించాడు. అతని కోచింగ్ కాలం మొత్తం వివాదాలతోనే ముగిసింది. ముఖ్యంగా దాదాతో అతనికి ఏ మాత్రం పొసిగేది కాదు. అయితే తాజాగా స్పోర్ట్స్ స్టార్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బుచానాన్ గంగూలీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.‘ఐపీఎల్ ప్రారంభ సమయంలో ఓ కెప్టెన్ చాలా త్వరగా నిర్ణయం తీసుకోవాలని, అతని ఆట కూడా పరిమిత ఓవర్ల ఫార్మాట్‌కు అనుగుణంగా ఉండాలని అనుకునేవాడిని. ఆ విషయంలోనే గంగూలీతో నాకు కొన్ని విభేదాలు వచ్చాయి. అసలు టీ20 ఫార్మాట్‌కు దాదా ఓ ఆటగాడిగా, కెప్టెన్‌గా ఏ మాత్రం పనికిరాడనేది నా అభిప్రాయం.'అని తెలిపాడు.

గంగూలీతో విభేదాలు..

గంగూలీతో విభేదాలు..

ఇక ఫస్ట్ సీజన్‌లో కేకేఆర్ దారుణంగా విఫలమవడంతో తదుపరి సీజన్‌లో గంగూలీ కెప్టెన్సీపై వేటు వేసిన జాన్ బుచానాన్.. బ్రెండన్ మెకల్లమ్‌ను జట్టు సారథ్య బాధ్యతలు అప్పగించాడు. అయితే ఆ సీజన్‌లో కూడా ఆశించిన ఫలితం రాకపోవడంతో మళ్లీ గంగూలీకే జట్టు పగ్గాలు దక్కాయి. ఇక మల్టీపుల్ కెప్టెన్‌ల పద్దతిని ప్రవేశపెట్టాలని జాన్ బుచానాన్ విపరీతంగా ప్రయత్నించాడు. కానీ ఇది దాదాతో విభేదాలకు దారితీసింది. అయితే ఈ పద్దతి టీ20 క్రికెట్‌కు మేలు చేస్తుందని చెప్పుకొచ్చాడు. క్షణాల్లో ఫలితం మారే ఆటలో ఒక్కడే సారథిగా వ్యవహరించడం ఒత్తిడితో కూడుకున్నదన్న జాన్.. ఇద్దరు ఉంటే నిర్ణయాలు తీసుకోవడం చాలా సులువవుతుందన్నాడు.

ప్రతీ ఒక్కరు కెప్టెన్‌గా..

ప్రతీ ఒక్కరు కెప్టెన్‌గా..

‘ఒక వ్యక్తి పరిస్థితులకు తగ్గట్లు అన్ని నిర్ణయాలు తీసుకోవడం కష్టమని నా అభిప్రాయం. ఈ రోజుల్లో ప్రతీ ఆటగాడు తనకు తాను కెప్టెన్‌గా భావించి ఆడాలి. బౌలర్లు తాము వేసే ప్రతీ బంతికి బాధ్యత వహిస్తారు. కెప్టెన్, కోచ్ సలహాలు, సూచనలు లేకుండానే బ్యాట్స్‌మెన్ అక్కడికక్కడ నిర్ణయాలు తీసుకుంటారు. అలాంటప్పుడు ఒక్కడిపైనే భారం మోపడం ఎంతవరకు సమంజసం.'అని జాన్ బుచానన్ అన్నాడు.

సక్సెస్ ఫుల్ కెప్టెన్ దాదా..

సక్సెస్ ఫుల్ కెప్టెన్ దాదా..

భారత క్రికెట్‌లోనే దాదా ఓ విప్లవాన్ని తీసుకువచ్చాడు. ఫిక్సింగ్ ఉచ్చులో చిక్కుకొని విలవిలలాడుతున్న జట్టుకు ఊపిరిపోసాడు. యువ ఆటగాళ్లతో మేటి జట్టును తయారు చేశాడు. ఇంగ్లండ్ గడ్డపై నాట్‌వెస్ట్ సిరీస్.. 2002 చాంపియన్స్ ట్రోఫీ‌లు అందించాడు. అంచనాల్లేకుండా బరిలోకి దిగిన 2003 ప్రపంచకప్‌లో భారత జట్టును ఫైనల్‌గా చేర్చాడు. దాదా నీడలో ఎదిగిన ఆటగాళ్లతోనే ధోనీ సేన 2007, 2011 ప్రపంచకప్ గెలిచింది. గంగూలీ కష్టానికి ప్రతిఫలమే ఈ రెండు విజయాలని చాలా మంది మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతుంటారు.

చాహర్ బ్రో.. నువ్వో ఫైటర్, నీ ఆట కోసం ఎదురుచూస్తున్నాం

Story first published: Sunday, August 30, 2020, 20:07 [IST]
Other articles published on Aug 30, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+