Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

'అతను అచ్చం నా లాంటివాడే': బేబీ బాస్‌పై దిగ్గజ క్రికెటర్ ప్రశంసల వర్షం!

భారత మాజీ విస్పోటక ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్, టీమిండియా యువ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీపై ప్రశంసల వర్షం కురిపించారు. తొలి బంతి నుంచే ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడే వైభవ్ సూర్యవంశీ ఆలోచనా విధానం, ధైర్యం అచ్చం తన శైలినే పోలి ఉన్నాయని వీరేంద్ర సెహ్వాగ్ కామెంట్ చేశారు. ఢిల్లీలో జరిగిన పీహెచ్‌డీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ వార్షిక సదస్సులో సెహ్వాగ్ మాట్లాడుతూ వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ శైలిపై ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకున్నారు. వైభవ్ సూర్యవంశీ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్ లో ఉన్నాడని.. స్టేడియంలోకి అడుగుపెట్టగానే మొదటి బంతి నుంచే బౌండరీలు బాదాలనే సంకల్పం అతడిలో స్పష్టంగా కనిపిస్తుందని వెల్లడించారు.

భారత్‌తో పోరుకు కివీస్ సిద్ధం: వన్డే జట్టు ప్రకటన... స్టార్ ఆల్‌రౌండర్ రీఎంట్రీ!

భారత్‌తో పోరుకు కివీస్ సిద్ధం: వన్డే జట్టు ప్రకటన... స్టార్ ఆల్‌రౌండర్ రీఎంట్రీ!

ఈ విధ్వంసకర మనస్తత్వం తన ఆటతీరును గుర్తుచేస్తుందని, రాబోయే రోజుల్లో భారత్ తరఫున వైభవ్ సూర్యవంశీకి ఎన్ని అవకాశాలు వస్తాయి, ఎలాంటి ప్రదర్శన చేస్తాడనేది చాలా కీలకమని వీరేంద్ర సెహ్వాగ్ పేర్కొన్నారు. జట్టు ఎంపికలో వయసు కంటే ఆటగాళ్ల ప్రతిభ, స్టేడియంలో చూపే ప్రదర్శనే ప్రామాణికం కావాలని సెహ్వాగ్ స్పష్టం చేశారు. అండర్-19 వంటి టోర్నీల్లో వయసు పరిమితి అవసరమే అయినా, ఐపీఎల్ లేదా భారత సీనియర్ జట్టు స్థాయికి వచ్చేసరికి కేవలం ప్రతిభకే ప్రాధాన్యం ఇవ్వాలని అభిప్రాయపడ్డారు. ఓ వైపు 38 ఏళ్ల వయసులో విరాట్ కోహ్లీ ఆడుతుంటే మరోవైపు 15 ఏళ్ల వయసుకే వైభవ్ సూర్యవంశీ రాణిస్తున్నాడని.. ఇక్కడ వయసుతో సంబంధం లేదని కేవలం ఆటతీరు మాత్రమే ముఖ్యమని వీరేంద్ర సెహ్వాగ్ స్పష్టం చేశారు.

Former Indian opener Virender Sehwag Praises Vaibhav Sooryavanshi Says He Thinks Just Like Me
నా వైఫల్యానికి నేనే కారణం.. ఎవర్ని నిందించను: సంజూ శాంసన్

Also Read

నా వైఫల్యానికి నేనే కారణం.. ఎవర్ని నిందించను: సంజూ శాంసన్

కేవలం 15 ఏళ్ల వయసులోనే ఐపీఎల్‌లో పరుగుల వరద పారించి ఆరెంజ్ క్యాప్ సాధించి వైభవ్ సూర్యవంశీ.. ఆ తర్వాత అంతర్జాతీయ స్థాయిలో జింబాబ్వే పర్యటన, ఆసియా క్రీడల్లో కూడా విధ్వంసకర ఇన్నింగ్స్‌లతో అలరించాడు. ప్రస్తుతం వెస్టిండీస్ జట్టుతో జరుగుతున్న టీ20 సిరీస్ లో అభిషేక్ శర్మ, సంజు శాంసన్‌లు ఓపెనర్లుగా ఉన్నందున వైభవ్ సూర్యవంశీ బెంచ్‌కే పరిమితమైనప్పటికీ.. భవిష్యత్తు భారత క్రికెట్లో అతను కీలక శక్తిగా ఎదుగుతాడని విశ్లేషకులు భావిస్తున్నారు.

Story first published: Sunday, October 11, 2026, 10:44 [IST]
Other articles published on Oct 11, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+