
వన్డే క్రికెట్‌ను సజీవంగా..
ఇక టీ20ల మెరుపులతో ఆదరణ తగ్గుతున్న వన్డే క్రికెట్‌ను సజీవంగా ఉంచాలనే లక్ష్యంతో ఐసీసీ.. ‘క్రికెట్ వరల్డ్ కప్ సూపర్ లీగ్ 'పేరిట కొత్త టోర్నీకి శ్రీకారం చుట్టింది. వాస్తవానికి గతంలో ఈ టోర్నీని రూపొందిచిన ఐసీసీ కరోనా నేపథ్యంలో వెనక్కి తగ్గింది. అయితే 2023 ఫిబ్రవరి-మార్చిలో జరగాల్సిన వన్డే వరల్డ్ కప్ అక్టోబర్-నవంబర్‌కు వాయిదా పడి తగినంత సమయం లభించడంతో ఐసీసీ మళ్లీ దీనిపై దృష్టి పెట్టి ముందుకు వెళ్లాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్, ఐర్లాండ్ మధ్య జరిగే మూడు వన్డేల సిరీస్‌తో వరల్డ్‌కప్ సూపర్ లీగ్ ప్రారంభమవుతుందని సోమవారం ఓ ప్రకటనలో తెలిపింది.

ఇది చాలా కష్టం..
ఇక ఐసీసీ తీసుకొచ్చిన ఈ సరికొత్త లీగ్‌పై స్కై స్పోర్ట్స్‌తో మాట్లాడిన అథర్టన్ ఈ సూపర్ లీగ్ చాలా సంక్షిష్టంగా ఉందన్నాడు. ‘ఇప్పటి వరకు జరిగిన ప్రతీదానికి ఓ లాజిక్ ఉంది. కానీ ఇప్పుడు జరిగేవి చాలా సంక్లిష్టంగా ఉన్నాయి. ఐసీసీ ఈవెంట్స్ అయిన వన్డే వరల్డ్ కప్, టీ20 ప్రపంచకప్, చాంపియన్స్ ట్రోఫీలను ఫ్యూచర్ టూర్ ప్రోగ్రామ్‌లో భాగంగా ఆయా దేశాల మధ్య జరిగే ద్వైపాక్షిక సిరీస్‌లతో ముడిపెట్టాలనుకుంటున్నారు.
ఈ రెండింటిని మిక్స్ చేయడం చాలా కష్టం. అభిమానులకు అర్థం కూడా కాదు. వీధుల్లోకి వెళ్లి ఓ వ్యక్తికి వరల్డ్ టెస్ట్ చాంపియన్ షిప్, వన్డే సూపర్ లీగ్ గురించి వివరించండి. అతనికి మీరేం చెబుతున్నారో కూడా అర్థం కాదు.'అని అథర్టన్ చెప్పుకొచ్చాడు. ఇక టెస్ట్ చాంపియన్‌షిప్ పాయింట్ల వ్యవస్థపై ఇప్పటికే తీవ్ర విమర్శలు వ్యక్తమైన విషయం తెలిసిందే.

మొత్తం 13 జట్లు
ఐసీసీ తెచ్చిన ఈ సూపర్ లీగ్ మొత్తం 13 టీమ్‌లు ఆడతాయి. ర్యాంకింగ్ ప్రకారం టాప్-12 జట్లతో పాటు 2015-17 ఐసీసీ వరల్డ్ క్రికెట్ సూపర్ లీగ్ విజేతగా నిలిచిన నెదర్లాండ్స్ 13వ జట్టుగా బరిలోకి దిగుతుంది. వచ్చే మూడేళ్లలోగా నిర్ణీత సమయంలో ప్రతీ జట్టు మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లు కనీసం ఎనిమిది (నాలుగు ఇంటా, నాలుగు బయట ప్రాతిపదికన) ఆడుతుంది. గెలిచిన జట్టుకు 10 పాయింట్లు, డ్రా, టై లేదా రద్దు అయితే 5 పాయింట్లు లభిస్తాయి.

ప్రపంచకప్ బరిలో 10 జట్లు
పాయింట్లపరంగా టాప్-7లో నిలిచిన జట్లు 2023 వన్డే వరల్డ్ కప్‌కు నేరుగా అర్హత సాధిస్తాయి. వీటికి తోడు ఆతిథ్య దేశంగా భారత్‌కు ఇప్పటికే అవకాశం లభించింది. భారత్ టాప్-7లో ఉంటే ఎనిమిదో టీమ్‌కు చాన్స్ దక్కుతుంది. నేరుగా క్వాలిఫై కాని 5 టీమ్‌లు, మరో 5 అసోసియేట్ జట్లతో కలిసి వరల్డ్ కప్ క్వాలిఫయర్ 2023 టోర్నీ ఆడతాయి. ఇందులో టాప్-2 జట్లు మాత్రమే ముందంజ వేస్తాయి. మిగిలిన 8 సహా మొత్తం 10 జట్లతో వన్డే ప్రపంచ కప్ జరుగుతుంది.
దేవుడా..ఈ పాక్ క్రికెటర్లకు కొంచెం బుద్ది ప్రసాదించు, కుళ్లుతో రగిలిపోతున్నారు: భారత క్రికెటర్


Click it and Unblock the Notifications












