Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సౌరవ్ గంగూలీ, విరాట్ కోహ్లీకి తేడా అదే: మాజీ పేసర్

Former India pacer Venkatesh Prasad Says Sourav Ganguly and Virat Kohli on similar lines as captains

ముంబై: సౌరవ్‌ గంగూలీ, విరాట్‌ కోహ్లీ కెప్టెన్సీ దాదాపుగా ఒకే తరహాలో ఉంటుందని టీమిండియా మాజీ పేసర్‌ వెంకటేశ్‌ ప్రసాద్‌ అన్నాడు. కాకపోతే అన్ని వేళలా దాదా భావోద్వేగాని గురయ్యేవారు కాదన్నారు. పీకల్లోతు కష్టాల్లో మునిగిపోయిన జట్టును కూడా సాహసోపేతంగా ముందుకు నడిపించేవారని ప్రశంసించారు.

సమూలంగా మార్చేశాడు..

సమూలంగా మార్చేశాడు..

‘జట్టుపై ప్రతికూలత ఏర్పడినప్పుడు గంగూలీ సారథ్య బాధ్యతలు అందుకున్నాడు. ఆ తర్వాత జట్టును సమూలంగా మార్చేశాడు. వాస్తవానికి దీనికి ఎన్నో నాయకత్వ నైపుణ్యాలు అవసరం. వాటిని సౌరవ్‌ అద్భుతంగా ప్రదర్శించాడు. తన ప్రతిభతో నాయకుడిగా ఆటగాడిగా తిరుగులేని ప్రమాణాలు నెలకొల్పాడు. ఫీల్డింగ్‌, ఫిట్‌నెస్‌ వంటి విషయాల్లో గంగూలీకి కొన్ని లోపాలు ఉన్నాయి. అయితే లోపాలు లేకుండా ఎవరుంటారు? ఆ సమయంలో ఒక నాయకుడు అవసరం. సారథిగా ఏం చేయాలో దాదా చేసి చూపించాడు. జట్టులో పరివర్తన రాబట్టాడు'అని ప్రసాద్‌ చెప్పుకొచ్చాడు.

సీనియర్లు, జూనియర్ల కలయికతో..

సీనియర్లు, జూనియర్ల కలయికతో..

'దాదా సారథ్యం చేపట్టినప్పుడు సచిన్‌, కుంబ్లే, ద్రవిడ్‌, శ్రీనాథ్‌, లక్ష్మణ్‌, నాలాంటి అనుభవజ్ఞులం ఉన్నాం. హర్భజన్‌, సెహ్వాగ్‌, నెహ్రా, జహీర్‌, యువీ వంటి యువకులు ఉన్నారు. తన నాయకత్వ ప్రతిభతో మా అందరి సహకారంతో గంగూలీ లక్ష్యాలు సాధించాడు. 2003 ఫైనల్లో ఓడినప్పటికీ దాదా ఎంతో కృషి చేశాడు.

దాదా బాటలోనే కోహ్లీ..

దాదా బాటలోనే కోహ్లీ..

కోహ్లీ సైతం దాదా దారిలోనే నడుస్తున్నాడు. అయితే దాదా ప్రతిసారీ భావోద్వేగాలు ప్రదర్శించేవాడు కాదు. చాలా తక్కువసార్లు అతడు ఉద్వేగానికి గురవ్వడం మేం చూసేవాళ్లం. విరాట్‌లో అభిరుచి ఎక్కువ. నియంత్రిత దూకుడు ఉంది. కొన్నిసార్లు అతడు మితిమీరినట్టు అనిపిస్తుంది కానీ నిజానికి అలా కాదు. తన దూకుడే అతడిని నడిపిస్తోంది. ప్రతి సందర్భంలోనూ కోహ్లీ భావోద్వేగం చెందితే దాదా చాలా అరుదైన సందర్భాల్లో ప్రదర్శించేవాడు' అని ప్రసాద్‌ విశ్లేషించాడు.

129 పరుగులకే 7 వికెట్లు.. ఓడాల్సిన వన్డేలో 2 వికెట్లతో గెలిచిన భారత్!

Story first published: Wednesday, June 10, 2020, 21:35 [IST]
Other articles published on Jun 10, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+