
అత్యుత్తమ సారథి..
‘నేను చూసిన అత్యుత్తమ భారత కెప్టెన్ ధోనీనే. నా అభిప్రాయం ప్రకారం గత 50 ఏళ్ల క్రికెట్ చరిత్రలో మైఖెల్ బ్రేర్లీ, ఇయాన్ చాపెల్, మార్క్ టేలర్, క్లైవ్ లాయడ్ తమ సారథ్యంతో అత్యంత ప్రభావం చూపారు. వారి సరసన ధోనీ కూడా నిలుస్తాడు. అతనిలో ఉన్న అత్యుత్తమ లక్షణం ఆత్మవిశ్వాసం. దాంతోనే సహచర ఆటగాళ్లను ప్రోత్సాహించేవాడు. అతనికి రాజకీయాలు చేయడం తెలియదు. ఏదైనా నేరుగా మాట్లాడుతాడు. అదే విధంగా స్పందిస్తాడు.

పాజిటీవ్ కెప్టెన్..
అతని ఆలోచనలు ఎప్పుడూ సానుకూలంగా ఉంటాయి. చాలా ఓపెన్‌గా ఉండే ధోనీతో పనిచేయడం చాలా సులువు. అతను ఏదైనా చేయాలనుకుంటే అది చేస్తానని ఆత్మవిశ్వాసంతో చెబుతాడు. ధోనీ చలాకితానాన్ని నేను భాగా ఆస్వాదించాను. అతను మంచి పోటీదారుడు. సవాళ్లను ఎప్పుడూ ఇష్టపడేవాడు. అత్యుత్తమ ఆటగాడైన ధోనీకి సవాల్ విసిరడాన్ని నేను బాగా ఇష్టపడేవాడిని. ధోనీ నా అంచనాలను అందుకున్నాడు. అతని అపారమైన నైపుణ్యాలను సరైన రీతిలో ఉపయోగించుకొని స్పూర్తిదాయక సారథిగా నిలిచాడు.'అని చాపెల్ కొనియాడాడు.

ఆశ్చర్యపోయా..
2005 నుంచి 2007 వరకు భారత్‌కు హెడ్ కోచ్‌గా వ్యవహరించిన ఈ ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్.. ధోనీ బంతిని బాదే విధానానికి ముగ్దుడైనట్లు చెప్పుకొచ్చాడు. ‘తొలిసారి ధోనీ బ్యాటింగ్ చూసినప్పుడు ఆశ్చర్యపోయా. ఆ క్షణమే అతనో గొప్ప క్రికెటర్ అవుతాడనిపించింది. ప్రపంచం ఓ శక్తివంతమైన ఆటగాడిని చూడబోతుందని భావించా. అసాధారణమైన పొజిషన్‌లో అతను బంతిని అలవోకగా హిట్ చేసేవాడు. నేను చూసిన ఆటగాళ్లలో అతను అత్యంత శక్తివంతమైన బ్యాట్స్ మన్.' అని చాపెల్ ప్రశంసించాడు.

సవాల్ విసిరేవాడిని..
‘మ్యాచ్‌ను ముగించే విషయంలో నేనేప్పుడు ధోనీకి సవాల్ విసిరేవాడిని. మ్యాచ్ గెలవడానికి గల పరుగులు చేసినప్పుడు అతని ముఖంలో చిరునవ్వు కనిపించేంది. ఖచ్చితంగా నేను చూసిన ఆటగాళ్లలో అతనో అత్యుత్తమ ఫినిషర్'అని చాపెల్ కొనియాడాడు. ఆస్ట్రేలియా తరఫున 87 టెస్ట్‌లు, 74 వన్డేలు ఆడిన చాపెల్.. 2005లో భారత్ హెడ్‌కోచ్‌గా బాధ్యతలు చేపట్టాడు. అనంతరం అప్పటి కెప్టెన్ సౌరవ్ గంగూలీతో వచ్చిన పొరపొచ్చుల కారణంగా కోచ్ బాధ్యతల నుంచి అర్ధాంతరంగా తప్పుకున్నాడు. అతని కోచింగ్ పట్ల నాటి సీనియర్ ప్లేయర్లు జహీర్ ఖాన్, సచిన్ టెండూల్కర్ కూడా విముఖత వ్యక్తం చేశారు. ఇక గంగూలీని జట్టు నుంచి తప్పించడంపై అప్పట్లో పెద్ద దుమారం రేగింది.
డివిలియర్స్ సర్.. రెండు రోజుల్లో నీ దగ్గరున్న ఆ మూడు రెండు అవుతాయి: చహల్


Click it and Unblock the Notifications












