అప్పుడే కోహ్లీ భవిష్యత్త్ ఖారారైంది: మాజీ సెలెక్టర్

న్యూఢిల్లీ: మట్టిలో మాణిక్యాల్ని వెలుగులోకి తీసుకురావడంలో టీమిండియా మాజీ బ్యాట్స్‌మన్ దిలీప్ వెంగ్‌సర్కార్‌కు ఓ ప్రత్యేక నైపుణ్యం ఉంది. భారత క్రికెట్ నియంత్రణ మండలి( బీసీసీఐ) చీఫ్ సెలెక్టర్‌గా అతడు సరికొత్త ప్రమాణాలు నెలకొల్పాడు. అతని హయాంలోనే విరాట్ కోహ్లీ లాంటి మేటి క్రికెట్ ప్రపంచానికి పరిచయమయ్యాడు. కోహ్లీని చూడగానే.. అతడు భారత భవిష్యత్ ఆశాకిరణం అనిపించిందని తాజాగా వెంగ్‌సర్కార్ గుర్తు చేసుకున్నాడు.

ఆ మ్యాచ్ చూసే..
అండర్-19 వరల్డ్‌క్‌పలో భారత్‌ను విజేతగా నిలబెట్టిన తర్వాత.. 2008లో కోహ్లీ టీమిండియాకు ఎంపియ్యాడు. అయితే, విరాట్‌లోని ప్రతిభను చూసే అతడిని భారత జట్టుకు ఎంపిక చేసినట్టు వెంగ్‌సర్కార్ చెప్పాడు.‘కోల్‌కతా వేదికగా బాంబేతో జరిగిన అండర్-16 మ్యాచ్‌లో ఢిల్లీకి చెందిన కోహ్లీ ఆటను గమనించా. అప్పుడు అతడికి 15 ఏళ్లు. ఆ మ్యాచ్‌ల్లో కోహ్లీ ఆట ఆకట్టుకుంది. అతని కెప్టెన్ తేజస్వీ యాదవ్'అని ‘స్పోర్ట్స్ కిదా'కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెంగ్‌సర్కార్ చెప్పాడు.

అండర్-19 ప్రపంచకప్ గెలవడంతో..
‘అండర్-19 వరల్డ్‌కప్‌లో కోహ్లీ సారథ్యంలో భారత్ విజేతగా నిలిచింది. అ టోర్నీలో పరుగులు చేయడంతోపాటు జట్టును ముందుండి నడిపించాడు. ఆ తర్వాత ఆస్ట్రేలియాలో ఎమర్జింగ్ ప్లేయర్స్ టోర్నీ జరిగింది. అందులో న్యూజిలాండ్, ఆస్ట్రేలియా ప్రతి ఏడాదీ పాల్గొంటాయి. అప్పుడు సెలెక్షన్ కమిటీ చైర్మన్‌గా ఉన్న నేను.. ఈ టోర్నీలో ఆకట్టుకొనే ప్రదర్శన చేసిన వాళ్లకు టీమిండియాలో తప్పకుండా చోటుకల్పించాలని ముందే నిర్ణయించుకున్నా. ముఖ్యంగా అండర్-23 క్రికెటర్లలో విరాట్‌ను ఎంపిక చేశాను'అని వెంగ్‌సర్కార్ గుర్తు చేసుకున్నాడు. కివీస్ ఎమర్జింగ్ ప్లేయర్స్ టీమ్‌తో భారత ఎమర్జింగ్ ప్లేయర్స్ మ్యాచ్ జరిగినప్పుడే కోహ్లీ భవిష్యత్ ఖరారైందన్నాడు.

సెంచరీతో చెలరేగాడు..
‘న్యూజిలాండ్‌తో జరిగిన ఆ మ్యాచ్‌ను చూశా. గ్లేన్ టర్నర్, గ్రేగ్ చాపెల్ కూడా నాతో మ్యాచ్‌కు హాజరయ్యారు. అప్పుడు ఆస్ట్రేలియా-ఏ జట్టును చాపెల్ పర్యవేక్షిస్తున్నాడు. ఆ మ్యాచ్‌లో కివీస్ 240 లేక 250 పరుగులు చేసిందనుకుంటా( సరైన స్కోర్ 248/6). విరాట్ ఓపెనింగ్ చేస్తానని అడిగాడు. అతను ఆ మ్యాచ్‌లో 123( చేసింది 120) పరుగులతో అజేయంగా నిలిచాడు. అతను చేసిన పరుగులు నాకింకా గుర్తున్నాయి. ఆ మ్యాచ్‌లో ప్రతీ బంతిని నేను చూశాను'అని ఈ భారత మాజీ కెప్టెన్ తెలిపాడు.

అప్పుడే అనుకున్నా..
‘సెంచరీ అయిన తర్వాత కూడా విరాట్ వికెట్ ఇచ్చుకోలేదు. సూపర్ బ్యాటింగ్‌తో అద్భుత విజయాన్నందించాడు. అది నన్ను చాలా ఆకట్టుకుంది. అప్పుడే ఈ కుర్రాడు భారత క్రికెట్‌ను మరింత ముందుకు తీసుకెళ్తాడనుకున్నా. ప్రపంచ క్రికెట్‌నే శాసిస్తాడని భావించా. ఎందుకంటే అతను మానసికంగా చాలా పరిణితి చెందినట్లు కనిపించాడు. వెంటనే అతన్ని భారత జట్టుకు ఎంపిక చేశాం. ఆ తర్వాత ఏం జరిగిందో మీకందరికి తెలిసిందే'అని వెంగ్ సర్కార్ చెప్పుకొచ్చాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications
రోహిత్ సెంచరీతో చెలరేగిన వేళ.. పాక్‌ను పాతరేసిన భారత్!