Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఐపీఎల్ 2020 టైటిల్ ఆ జట్టుదే.. సీఎస్‌కే, ముంబై, ఆర్‌సీబీకి నో చాన్స్: మైఖెల్ వాన్

Former England skipper Michael Vaughan predicts the winner of the IPL 2020

లండన్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2020 సీజన్‌కు రంగం సిద్దమైంది. మరికొద్ది క్షణాల్లోనే ఈ క్యాష్ రిచ్ లీగ్‌కు తెరలేవనుంది. డిఫెండింగ్ చాంపియన్స్ ముంబై ఇండియన్స్, త్రీటైమ్ చాంపియన్స్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. అయితే ఈ సీజన్ టైటిల్‌ను కోల్‌కతా నైట్ రైడర్స్ గెలుస్తుందని ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ మైఖెల్ వాన్ తెలిపాడు. దినేశ్ కార్తీక్ సారథ్యంలోని ఆ జట్టు బ్యాటింగ్, బౌలింగ్ డెప్త్ చాలా బలంగా ఉందని, ప్యాట్ కమిన్స్, సునీల్ నరైన్, ఆండ్రీ రస్సెల్, ఇయాన్ మోర్గాన్ వంటి మ్యాచ్ విన్నర్లు ఉన్నారని తెలిపాడు.

బ్రెండన్ మెకల్లమ్ పర్యవేక్షణలో..

అంతేకాకుండా బ్రెండన్ మెకల్లమ్ కోచ్‌గా ఉండటం ఆ జట్టుకు అదనపు బలమన్నాడు. ఇప్పటికే మెక్‌కల్లమ్ కరీబియన్ ప్రీమియర్ లీగ్(సీపీఎల్) 2020 సీజన్‌లో తమ జట్టు ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్‌కు టైటిల్ అందించాడని గుర్తు చేశాడు. ఆ మ్యాజిక్‌ను ఇక్కడ రిపీట్ చేస్తాడని చెప్పుకొచ్చాడు. ‘కోల్‌కతా నైట్‌ రైడర్స్ ఈ సీజన్ ఐపీఎల్ టైటిల్ గెలుస్తుంది. బ్రెండన్ మెకల్లమ్ కోచ్‌గా ఉండటం ఆ జట్టుకు అదనపు బలం. కరీబియన్‌ ప్రీమియర్ లీగ్(సీపీఎల్)‌లో టైటిల్ గెలిచి కోచ్‌గా తన సత్తా చాటాడు. అదే మ్యాజిక్‌ను ఇక్కడ రిపీట్ చేస్తాడనుకుంటున్నా'అని మైఖెల్ చెప్పుకొచ్చాడు.

కమిన్స్ ఎక్కువ మ్యాచ్‌లు ఆడడు..

కమిన్స్ ఎక్కువ మ్యాచ్‌లు ఆడడు..

ఈ సీజన్ ఐపీఎల్ వేలంలో భారీ ధరకు కేకేఆర్ కొనుగోలు చేసిన పాట్ కమిన్స్ (రూ. 15.5 కోట్లు) ఎక్కువ మ్యాచ్‌లు ఆడడని మైఖెల్ వాన్ జోస్యం చెప్పాడు. యూఏఈ పిచ్‌లు నెమ్మదైనవని, అక్కడ అతని ప్రభావం అంతగా అవసరం ఉండదన్నాడు. జట్టులో ఉన్న నాణ్యమైన ఆటగాళ్లే విజయాలందిస్తారని చెప్పాడు. ‘సత్తాచాటే ఆటగాళ్లు కేకేఆర్‌లో చాలా మంది ఉన్నారు. ఈ క్రమంలోనే సునీల్ నరైన్, కుల్దీప్ యాదవ్, పాట్ కమిన్స్ అన్ని మ్యాచ్‌లు ఆడకపోవచ్చు. ఆండ్రూ రస్సెల్, ఇయాన్ మోర్గాన్, దినేశ్ కార్తీక్, శుభ్‌మన్ గిల్, నితీష్ రాణాలతో ఆ జట్టు బ్యాటింగ్ లైనప్ బలంగా ఉంది. ఈ సారి టైటిల్ నెగ్గేది కోల్‌కతానే'అని వాన్ చెప్పుకొచ్చాడు.

కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు

కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు

బ్యాట్స్‌‌మెన్‌‌: ఇయాన్‌‌ మోర్గాన్‌‌, నితీశ్‌‌ రాణా, రాహుల్‌‌ త్రిపాఠి, రింకూ సింగ్‌‌, శుభ్‌‌మన్‌‌ గిల్‌‌, సిద్ధేశ్‌‌ లాడ్‌‌, టామ్‌‌ బాంటన్‌‌,

వికెట్‌‌ కీపర్లు: దినేశ్‌‌ కార్తీక్‌‌ (కెప్టెన్‌‌), నిఖిల్‌‌ నాయక్‌‌.

ఆల్‌‌రౌండర్లు: ఆండ్రీ రస్సెల్‌‌, కమలేష్ నాగర్‌‌కోటి, సునీల్‌‌ నరైన్‌‌, శివమ్‌‌ మావి.

బౌలర్లు: కుల్దీప్‌‌ యాదవ్‌‌, ఫెర్గుసన్‌‌, మణి మారన్‌‌, సిద్ధార్థ్‌‌, కమిన్స్‌‌, ప్రసిద్‌‌ కృష్ణ, సందీప్‌‌ వారియర్‌‌, వరుణ్‌‌ చక్రవర్తి, అలీ ఖాన్‌‌.

సన్‌‌రైజర్స్ హైదరాబాద్ బెస్ట్ ఎలెవన్ ఎంపిక చేసిన సునీల్ గవాస్కర్.. ఆ స్టార్ ఆటగాడికి దక్కని చోటు!

Story first published: Saturday, September 19, 2020, 18:09 [IST]
Other articles published on Sep 19, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+