For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అప్పట్లో సునీల్ నరైన్ కోసం గంభీర్ పట్టుపట్టాడు: కేకేఆర్ మాజీ అసిస్టెంట్ కోచ్

Former cricketer Vijay Dahiya reveals How Gautam Gambhir signed Sunil Narine to KKR

న్యూఢిల్లీ: ఏది ఏమైనా వెస్టిండీస్ స్పిన్నర్ సునీల్ నరైన్‌ను జట్టులోకి తీసుకోవాలని గౌతమ్ గంభీర్ కోల్‌కతానైట్‌రైడర్స్‌ టీమ్‌మేనేజ్‌మెంట్ ముందు పట్టుపట్టాడని భారత మాజీ వికెట్ కీపర్, నాటి కేకేఆర్ అసిస్టెంట్ కోచ్ విజయ్ దహియా గుర్తు చేసుకున్నాడు. 2011లో తొలిసారి కేకేఆర్ సారథ్య బాధ్యతలు అందుకున్న గంభీర్.. ఆ సీజన్‌లో జట్టును తొలిసారి ప్లే ఆఫ్ చేర్చాడు.

నరైన్ ఆటకు ఫిదా..

నరైన్ ఆటకు ఫిదా..

అయితే అదే ఏడాది జరిగిన 2011 చాంపియన్స్ లీగ్‌లో ట్రినిడాడ్ జట్టు తరఫున బరిలోకి దిగిన సునీల్ నరైన్ ఆటకు గంభీర్ ఫిదా అయ్యాడు. ఆ టోర్నీలో నరైన్ 15 వికెట్లతో తన సత్తా చాటాడు. దీంతో అతన్ని ఎలాగైనా కేకేఆర్ జట్టులోకి తీసుకోవాలని భావించిన గౌతీ.. ఆ విషయాన్ని టీమ్ మేనేజ్‌మెంట్‌కు తెలియజేశాడు. ఇదే విషయాన్ని తాజాగా స్పోర్ట్స్ కీదాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో విజయ్ దహియా తెలిపాడు.

జట్టులోకి తీసుకోవాల్సిందే..

జట్టులోకి తీసుకోవాల్సిందే..

‘2012 ఐపీఎల్ వేలానికి ముందు గంభీర్ భారత జట్టుతో ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్నాడు. ఒక రోజు టీమ్‌మేనేజ్‌మెంట్ కాల్ చేసిన అతను..‘ఏది ఏమైనా సరే.. నా జట్టులో మాత్రం సునీల్ నరైన్ ఉండాలి'అని ఆదేశించాడు. ఈ తరహా సారథులు క్రికెట్‌కు చాలా అవసరం'అని దహియా చెప్పుకొచ్చాడు. ఇక గంభీర్ సారథ్యంపై ప్రశంసలు కురిపించిన దహియా.. అతను ఆటగాళ్లు చాలా స్వేచ్చనిచ్చేవాడని, విఫలమైనా అండగా ఉండేవాడని గుర్తు చేసుకున్నాడు. ముఖ్యంగా యూసఫ్ పఠాన్‌‌పై చాలా నమ్మకం ఉంచాడన్నాడు.

ఆటగాళ్లకు పూర్తి స్వేచ్చ..

ఆటగాళ్లకు పూర్తి స్వేచ్చ..

‘గంభీర్ ఆటగాళ్లకు చాలా స్వేచ్చనిచ్చేవాడు. గంభీర్‌తో సహా యూసఫ్ పఠాన్, రజత్ భాటియా 2011 సీజన్‌లో ఆడారు. కానీ ఈ ముగ్గురిలో యూసఫ్ ఒక్కడే దారుణంగా విఫలమయ్యాడు. కానీ గంభీర్ అతనిపై వేటు వేయకుండా అండగా నిలిచాడు. తరుచూ అతనితో మాట్టాడుతూ ఆత్మవిశ్వాసాన్ని పెంచేవాడు. సహాయక సిబ్బంది కూడా పఠాన్‌కు అండగా నిలిచింది.'అని ఈ మాజీ కోచ్ గుర్తు చేసుకున్నాడు. ఇక పఠాన్ కూడా తర్వాతి సీజన్లలో రాణించాడు. నాలుగు సీజన్లలో 6 హాఫ్ సెంచరీలతో 1273 రన్స్ చేశాడు. ఇందులో 2016లోనే మూడు హాఫ్ సెంచరీలున్నాయి.

అదరగొట్టిన నరైన్..

అదరగొట్టిన నరైన్..

ఇక తనపై గంభీర్ పెట్టుకున్న నమ్మకాన్ని నరైన్ కూడా వమ్ము చేయలేదు. మొత్తం 8 సీజన్లు ఆడిన నరైన్ 122 వికెట్లు పడగొట్టాడు. కింగ్స్ పంజాబ్‌తో 2013లో జరిగిన ఓ మ్యాచ్‌లో హ్యాట్రిక్‌తో కలిపి ఏకంగా 8 వికెట్లు తీశాడు. ఇక గంభీర్ సారథ్యంలో కేకేఆర్ టైటిల్ గెలిచిన రెండు సీజన్లలో నరైన్ అద్భుతంగా రాణించాడు. 2012లో 24 వికెట్లు తీసిన ఈ విండీస్ స్పిన్నర్.. 2014లో 21 వికెట్లు పడగొట్టాడు. బ్యాటింగ్‌లో కూడా ఓపెనర్‌గా వచ్చి ధనాధన్ బ్యాటింగ్‌తో విధ్వంసం సృష్టించాడు.

గౌతం గంభీర్ టీమిండియా కెప్టెన్‌గా కొనసాగాల్సింది: ఇర్ఫాన్ పఠాన్

Story first published: Friday, July 31, 2020, 13:37 [IST]
Other articles published on Jul 31, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+