
పంత్‌కు అర్థమయ్యేలా చెప్పాం..
‘మైదానంలోకి అడుగు పెట్టిన ప్రతిసారి రిషభ్ పంత్‌ను ధోనీతో పోల్చేవారు. దాంతో అతను కూడా ఈ భ్రమలో పడిపోయాడు. దీని నుంచి బయట పడాలని పంత్ కు చాలా సార్లు సూచించాం. మాహీది విభిన్నమైన వ్యక్తిత్వం. నీవు మరో రకం. నువ్వు ఓ అసాధారణమైన ఆటగాడివి. కావాల్సిన ప్రతిభ ఉంది. అందుకే మేం అండగా ఉంటున్నామని పంత్‌కు వివరించాం.'అని ఎమ్మెస్కే తెలిపాడు.

తనకు తాను ధోనీగా ఫీలవ్వడంతో..
ఇవన్నీ పట్టించుకొని పంత్.. తనకు తానుగా ధోనీతో పోల్చుకోవడం మొదలు పెట్టాడని, మైదానంలో అతనిలా అనుకరించడం ప్రారంభించాడని ఎమ్మెస్కే గుర్తు చేసుకున్నాడు. ‘పంత్ ఎప్పుడూ ధోనీ నీడలో ఉండేవాడు. అతడు తనను ధోనీతో పోల్చుకోవడం మొదలుపెట్టాడు. ధోనీని కాపీ చేస్తూ ఉండేవాడు. మేనరిజమ్స్‌లో కూడా అతన్ని అనుకరించేవాడు. కొన్ని మ్యాచ్‌ల్లో పంత్ వ్యవహారశైలి చూస్తే ఈ విషయం మీకే అర్థం అవుతుంది.'అని ఈ మాజీ చీఫ్ సెలెక్టర్ పేర్కొన్నాడు.

ఏకైక ఆటగాడు..
ధోనీ రిటైర్ అయ్యాడు కనుకు ఇకనైనా అతని నీడలో నుంచి పంత్ బయటికు రావాల్సిన అవసరం ఉందన్నాడు. ఎందుకంటే జట్టులో కేఎల్ రాహుల్‌తో అతనికి తీవ్ర పోటీ ఉందన్న ఎమ్మెస్కే.. ధోనీ రిటైర్మెంట్‌తో పంత్ ఆటలో మార్పు రావచ్చని ఆశాభావం వ్యక్తం చేశాడు. ‘అదృష్టవశాత్తూ ధోనీ రిటైర్ అయ్యాడు. ఇకనైనా ధోనీ నీడలో నుంచి పంత్ బయటికొచ్చి మెరుగ్గా ఆడతాడని ఆశిస్తున్నా. టెస్టుల్లో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ దేశాల్లో సెంచరీ కొట్టిన ఏకైక భారత వికెట్ కీపర్ పంత్. దీన్ని బట్టి అతడిలో ఎంత ప్రతిభ దాగి ఉందో అంచనా వేయొచ్చు' అని ప్రసాద్ పేర్కొన్నాడు.

నిర్లక్ష్యమైన ఆట తీరుతో..
ఇక ధోనీ వారసుడిలా ఇప్పటికే చాలా అవకాశాలు అందుకున్న యువ వికెట్ కీపర్ రిషభ్ పంత్.. పేలవమైన ఆట తీరుతో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు. బ్యాటింగ్, కీపింగ్‌లోనూ తడబడ్డాడు. పరిస్థితులతో సంబంధం లేకుండా పదే పదే నిర్లక్ష్యపు షాట్లు ఆడుతూ జట్టులో చోటు కూడా కోల్పోయాడు. అతని స్థానంలో వికెట్ కీపింగ్ చేసిన కేఎల్ రాహుల్ సూపర్ సక్సెస్ కావడంతో పంత్ భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. అటు టెస్ట్‌ల్లో కూడా సూపర్ వికెట్ కీపింగ్ స్కిల్స్ ఉన్న వృద్దిమాన్ సాహాతో గట్టి పోటీ నెలకొంది. ధోనీ రిటైర్మెంట్‌తో సంజూ శాంసన్ కూడా రేసులోకి వచ్చాడు. అంతేకాకుండా దేశవ్యాప్తంగా ఉన్న యువ వికెట్ కీపర్లు కూడా అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో పంత్ ఎలా నెగ్గుకొస్తాడో చూడాలి.
CPL 2020: కళ్లు చెదిరే క్యాచ్‌తో ఔరా అనిపించిన క్రికెట్ బాహుబలి!


Click it and Unblock the Notifications












