Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సెలెక్టర్లు వద్దన్నా ధోనీనే కెప్టెన్‌గా ఉండాలన్నా..లేకుంటే చాంపియన్స్ ట్రోఫీ మిస్సయ్యేది:శ్రీనివాసన్

Former BCCI president N Srinivasan reveales how he saved M S Dhoni’s captaincy

న్యూఢిల్లీ: మహేంద్ర సింగ్ ధోనీ సుదీర్ఘకాలం భారత జట్టుకు సారథ్యం వహించడానికి తానే కారణమని బీసీసీఐ మాజీ ప్రెసిడెంట్ ఎన్ శ్రీనివాసన్ తెలిపారు. 2011 ప్రపంచకప్ విజయానంతరం విదేశాల్లో భారత జట్టు దారుణంగా విఫలమవడంతో సెలెక్టర్లు ధోనీపై వేటు వేయాలనుకున్నారని, కానీ బీసీసీఐ ప్రెసిడెంట్ హోదాలో ఆ నిర్ణయాన్ని తాను వ్యతిరేకించానని ఆయన గుర్తు చేసుకున్నారు. తన నిర్ణయం వల్ల భారత్ 2013 చాంపియన్స్ ట్రోఫీ గెలిచిందని తెలిపారు. శనివారం ధోనీ అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన సందర్భంగా శ్రీనివాసన్ ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌తో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.

వరుస వైఫల్యాలతో...

వరుస వైఫల్యాలతో...

‘2011 ఏప్రిల్‌లో ధోనీ.. భారత 28 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ ప్రపంచకప్ అందించాడు. కానీ ఆమెగా టోర్నీ అనంతరం విదేశీ పర్యటనకు వెళ్లిన ధోనీ సేన దారుణంగా విఫలమైంది. ఇంగ్లండ్, ఆస్ట్రేలియాతో వరుస సిరీస్‌ల్లో 0-4తో వైట్‌వాష్‌కు గురైంది. అప్పుడు టీమిండియా చీఫ్ సెలెక్టర్‌గా కృష్ణమాచారి శ్రీకాంత్ ఉన్నాడు. అయితే సెలెక్షన్ కమిటీలోని అతని స్నేహితుడు, మాజీ క్రికెటర్ మోహిందర్ అమర్‌నాథ్.. టీమిండియా వైఫల్యాలకు చెక్ పెట్టేందుకు కెప్టెన్సీ మార్చాలని సూచించాడు.

ధోనీని కెప్టెన్సీ నుంచి తప్పించాలని..

ధోనీని కెప్టెన్సీ నుంచి తప్పించాలని..

అంతకు ముందు సీజన్‌లోనే భారత్ టెస్ట్ నెంబర్ వన్ ర్యాంక్ అందుకుంది. విదేశాల్లో పేస్ పిచ్‌లు కావడంతో విజయాలు అందుకోలేకపోయింది. ఓడిన మ్యాచ్‌ల్లో కూడా గెలుపు ముంగిట, డ్రా చేసుకునే అవకాశాలను తృటిలో చేజార్చుకుంది. ఇంగ్లండ్ పర్యటనలో ధోనీనే టాప్ స్కోర‌ర్. కానీ ఆసీస్ పర్యటనలో విఫలమయ్యాడు. దీంతో ధోనీ కెప్టెన్సీపై సెలెక్టర్లు వేటు వేయాలనుకున్నారు. కానీ అతన్ని భర్తీ చేసే ఆటగాడు ఎవరో మాత్రం చెప్పలేదు.

ప్రపంచకప్ అందించిన కెప్టెన్..

ప్రపంచకప్ అందించిన కెప్టెన్..

ఓ ముక్కోణపు సిరీస్ ముందు సెలెక్టర్లు సమావేశమయ్యారు. ధోనీ గురించి చర్చించారు. మహీ ఉండాల్సిందేనని నేను చెప్పాను. దీంతో ధోనీని జట్టులోకి తీసుకున్నారు. కానీ కెప్టెన్సీ నుంచి తొలగించారు. నాకు వెంటనే అప్పటి బీసీసీఐ సెక్రటరీ సంజయ్ జగ్దాలే ఫోన్ చేశాడు. సెలెక్టర్లు కెప్టెన్ మారుస్తున్నారని చెప్పాడు. గోల్ఫ్ ఆడుతున్న నేను వెంటనే అక్కడికి వెళ్లి ధోనీని సారథిగా ఉంచాలని వాదించా. అతను కొన్ని నెలల క్రితమే మన దేశానికి ప్రపంచకప్ తెచ్చిన కెప్టెన్. అలాంటి వాడు రెండు సిరీస్‌లతోనే చెత్త కెప్టెన్ అయ్యాడా? అని ప్రశ్నించా. ఎలా అతన్ని కెప్టెన్సీ నుంచి తప్పిస్తారన్నా.

బీసీసీఐ ప్రెసిడెంట్‌గా ఉన్న అధికారంతో..

బీసీసీఐ ప్రెసిడెంట్‌గా ఉన్న అధికారంతో..

అప్పటి బీసీసీఐ నిబంధనల ప్రకారం సెలెక్షన్ కమిటీ నిర్ణయానికి బీసీసీఐ ప్రెసిడెంట్ ఆమోదం తెలపాలి. తర్వాత లోధా కమిటీ ఆ నిబంధనను మార్చిందనుకోండి. నాకున్న అధికారంతో వారి నిర్ణయాన్ని వ్యతిరేకించా. 2012లో ఇంగ్లండ్ చేతిలో సొంతగడ్డపై భారత్ ఓడింది. ఆ తర్వాత శిఖర్ ధావన్ జట్టులోకి రావడంతో 2013లో ఆస్ట్రేలియాపై భారత్ విజయం సాధించింది. కొన్ని నెలల తర్వాత ఇంగ్లండ్ వేదికగా జరిగిన చాంపియన్స్ ట్రోఫీ గెలుచుకుంది.'అని శ్రీనివాసన్ చెప్పుకొచ్చారు.

రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ ప్రస్థానానికి 12 ఏళ్లు!

Story first published: Monday, August 17, 2020, 21:10 [IST]
Other articles published on Aug 17, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+