
అండర్-19 ప్రపంచకప్‌తో తారాజువ్వలా..
2008 అండర్-19 ప్రపంచకప్‌కు జట్టుకు కెప్టెన్స్ వహించిన కోహ్లీ ఓ కొత్త చాంపియన్‌గా నిలిచాడు. సిరీస్‌లో భారీ లక్ష్యాలను బ్యాటుతో అవలీలగా ఛేదిస్తూ, సందర్భానికి తగ్గట్లు బౌలర్లనూ, ఫీల్డర్లనూ మారుస్తూ ఆల్‌రౌండ్ ఆటగాడిగా అదరగొట్టాడు. భారత్‌ను అండర్-19 ప్రపంచకప్ విజేతగా నిలబెట్టాడు. దీంతో రాత్రికి రాత్రే భవిష్యత్తు తారగా ముద్ర వేసుకున్నాడు. ఆ వెంటనే ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ నుంచి పిలుపొచ్చింది.

ఫస్ట్ మ్యాచ్‌లో విఫలం..
ఆపైన అదే సంవత్సంరం శ్రీలంకతో సిరీస్‌కు సచిన్, సెహ్వాగ్ గాయాల కారణంగా దూరమవడంతో అనూహ్యంగా కోహ్లీకి జట్టులో చేరే అవకాశం లభించింది. అలా ఊహ తెలిసినప్పట్నుంచీ భారత్‌కు ఆడాలని తండ్రితో కలిసి కోహ్లీ కన్న కల పందొమ్మిదేళ్ల వయసులో సరిగ్గా 12 ఏళ్ల క్రితం ఇదే రోజు(2008 ఆగస్టు 18) నెరవేరింది. కానీ ఆ మ్యాచ్‌లో కోహ్లీ విఫలమయ్యాడు. గంభీర్‌తో కలిసి ఓపెనర్‌గా బరిలోకి దిగిన విరాట్ 12 పరుగులే చేసి ఔటయ్యాడు. కాకపోతే ఆ సిరీస్‌లో నాలుగో మ్యాచ్‌లో కోహ్లీ అర్ధ శతకంతో టోర్నీ భారత్ సొంతమైంది. అక్కడితో తన రాత మారిపోయిందనుకున్న కోహ్లీ ఆశ అంత సులువుగా తీరలేదు. తరవాతి సిరీస్‌కు సచిన్, సెహ్వాగ్ అందుబాటులోకి రావడంతో కోహ్లీ జట్టులో చోటు కోల్పోయాడు.

గంభీర్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్..
2009లో భారత్‌లో శ్రీలంక పర్యటించినప్పుడు నాలుగో వన్డేకు గాయంతో యువరాజ్ దూరమయ్యాడు. అతని స్థానంలో కోహ్లీకి అవకాశం లభించింది. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ అప్పటి సహచర ఆటగాడు గౌతమ్ గంభీర్‌తో కలిసి సింగిల్స్ తీస్తూ అతన తన తొలి శతకాన్ని సాధించాడు. మూడో వికెట్‌కు వీరిద్దరూ 224 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అయితే కోహ్లీ ఆటకు ముగ్దుడైన గంభీర్ తనకు లభించిన మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ పురస్కారాన్ని కోహ్లికి ఇచ్చాడు. పరుగుల ప్రవాహాన్ని కొనసాగిస్తూ జట్టులో శాశ్వత సభ్యుడిగా మారాడు. కెప్టెన్‌గా ఎదిగాడు. క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ 100 శతకాల రికార్డును బద్దలు కొట్టడానికి దూసుకెళ్తున్నాడు.

#12YearsOfViratKohli ట్రెండింగ్..
ఇక కోహ్లీ అంతర్జాతీయ కెరీర్ 12 ఏళ్లు పూర్తయిన సందర్భంగా అభిమానులు విరాట్ చిరస్మరణీయ ఇన్నింగ్స్‌లను గుర్తు చేసుకుంటున్నారు. సూపర్ రికార్డులను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తున్నారు. దీంతో #12YearsOfViratKohli హాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతుంది. సీడీపీ, మీమ్స్ ట్రెండ్ చేస్తున్నారు. ఇప్పటి వరకు కోహ్లీ భారత్ తరఫున 248 వన్డేలు, 86 టెస్ట్‌లు,82 టీ20లు ఆడాడు. వన్డేల్లో 43 సెంచరీలు, 58 హాఫ్ సెంచరీలతో 11867 పరుగులు చేశాడు. టెస్ట్‌ల్లో 7240 రన్స్ చేశాడు. ఇందులో 27 సెంచరీలు, 22 హాఫ్ సెంచరీలున్నాయి. 82 టీ20ల్లో 24 హాఫ్ సెంచరీలతో 2794 రన్స్ చేశాడు.


Click it and Unblock the Notifications
