ఐపీఎల్, పీఎస్‌ఎల్ ఒకటేనా? అయితే నువ్వో మూర్ఖుడివి.!!

హైదరాబాద్: ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ఆదరణ పొందిన క్రికెట్ లీగ్ ఏదైనా ఉందా? అంటే అది ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) మాత్రమే అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ క్యాష్‌రిచ్ లీగ్‌లో ఒక్కసారైనా ఆడాలని ప్రతీ క్రికెటర్ కల కంటాడు. ఈ లీగ్‌తో అనామక క్రికెటర్లు కూడా రాత్రికి రాత్రే కోటీశ్వరులయ్యారు. కాసులు కురిపించే ఈ లీగ్‌కు సరితూగేది ఏదీలేదు. అలాంటింది దాయాదీ దేశం నిర్వహిస్తున్న పాకిస్థాన్ ప్రీమియర్ లీగ్ (పీఎస్‌ఎల్), ఐపీఎల్ సమానమే అని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ బ్రాడ్ హగ్ తెలపడం ఇప్పుడు భారత అభిమానులకు తీవ్ర ఆగ్రహం తెప్పిస్తోంది.
ట్విటర్‌లో ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు జవాబిచ్చిన హాగ్‌ను భారత అభిమానులు ఏకిపడేస్తున్నారు. ఐపీఎల్, పీఎస్ఎల్‌ను ఒకే గాడిన కట్టడంపై మండిపడుతున్నారు. సోషల్ మీడియా వేదికగా తమ ఆగ్రహాన్ని వెల్లగక్కుతున్నారు.
ఇంతకేం జరిగిందంటే..
సోషల్ మీడియాలో ఓ నెటిజన్ ఐపీఎల్, పీఎస్ఎల్‌లకు ఎన్నిమార్కులు ఇస్తారని హాగ్‌ను ప్రశ్నించాడు. దీనికి హాగ్.. రెండు లీగ్‌లకు 10 మార్కులకు 9 ఇస్తానని తెలిపాడు. అలాగే ఐపీఎల్ మొదట ప్రారంభమైందని, అయితే పీఎస్ఎల్ మాత్రం కాస్త లేటుగా ప్రారంభమైనప్పటికీ చాలా ప్రభావం చూపించిందని, పాకిస్థాన్ గడ్డకు క్రికెట్‌ను తిరిగి తీసుకురావడానికి పీఎస్ఎల్ ఎంతగానో ఉపకరించిందన్నాడు. మరోవైపు ప్రేక్షకాదరణ పరంగా ఐపీఎల్‌కు తిరుగులేదని, క్యాష్ రిచ్ లీగ్ అంటే ప్రపంచ వ్యాప్తంగా ఎందరికో ఆసక్తి ఉందన్నాడు. ఐపీఎల్, ఐఎస్‌ఎల్ ఒకటేననే విధంగా అతని సమాధనం ఉండటంతో భారత అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఈ ట్వీట్ నెట్టింట హల్‌చల్ చేస్తోంది.
మానవ భద్రతను మించింది లేదు .. ఐపీఎల్ రద్దు చేసే యోచనలో ఫ్రాంచైజీలు.!!

హాగ్.. మతి తప్పిందా ఏంది?
ఈ ట్వీట్‌పై ఆగ్రహానికి గురైన అభిమానులు హగ్‌పై సోషల్ మీడియా వేదికగా దుమ్మెత్తిపోస్తున్నారు. మతి తప్పిందా?,నువ్వో ఫూల్‌వి.. మూర్ఖుడివి అంటూ ఘాటుగా కామెంట్ చేస్తున్నారు. ఐపీఎల్‌ను రివ్యూ చేసేంత గొప్పోడివా? అని కూడా ప్రశ్నిస్తున్నారు. లీగ్‌కు సంబంధించి ఏ లెక్కన చూసుకున్నా.. ఐపీఎల్ ఎన్నో రేట్లు ముందంజలో ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. బ్రేక్ ఫాస్ట్ సరిగా చేయలేదేమో.. అందుకే ఇలా పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నాడరని వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు.

ఐపీఎల్ ముందు పీఎస్‌ఎల్ జూజూబీ..
2008లో ఎనిమిది జట్లతో అంగరంగ వైభవంగా ఐపీఎల్ ప్రారంభమైన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు 12 ఎడిషన్లను పూర్తి చేసుకుంది. ఈ నెలాఖరులో 13వ ఎడిషన్ ప్రారంభంకావల్సి ఉండగా.. కరోనా నేపథ్యంలో ఎప్రిల్ 15కు వాయిదా పడింది. ఊహించని విధంగా ఐపీఎల్ విజయవంతమవ్వడంతో ఈ తరహా లీగ్‌లు చాలా దేశాల్లో జరుగుతున్నాయి. ఈ కోవలోనే 2016లో పీఎస్ఎల్ ప్రారంభమైంది. గతనెలలోనే ఈ టోర్నీ ఐదో ఎడిషన్ ప్రారంభమై ప్రస్తుతం కొనసాగుతోంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications