ధోనీ విజయ రహస్యం అదే : డుప్లెసిస్

చెన్నై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ సూపర్ సక్సెస్ అయ్యేందుకు ధోనీ ఎంపిక విధానమే కారణమని సౌతాఫ్రికా మాజీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ అభిప్రాయపడ్డాడు. తన వ్యూహాలకు అండగా ఉండే అంతర్జాతీయ కెప్టెన్లను తీసుకోవడం, క్లిష్ట పరిస్థితుల్లో కూడా జట్టు విజయం కోసం తెగించి ఆడే ప్లేయర్లను ఎంచుకోవడంతోనే ధోనీ విజయవంతమయ్యాడని చెన్నై సూపర్ కింగ్స్ వెబ్‌సైట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ సఫారీ ప్లేయర్ చెప్పుకొచ్చాడు.

బలమైన నాయకత్వం..
‘నాతో పాటు మెకల్లమ్, బ్రావోలాంటి ఇంటర్నేషనల్ కెప్టెన్లను లక్ష్యంగా పెట్టుకుని చెన్నై టీమ్‌ను ఎంచుకుంది. ధోనీ, రైనా ఎలాగూ ఉంటారు. ఈ ఇద్దరు క్రికెట్ గురించి చాలా ఆలోచిస్తారు. అంతేకాకుండా జట్టులో చాలా మంది లీడర్స్ ఉన్నారు. వాళ్ల అనుభవం, ఆలోచన జట్టుకు ఉపయోగపడుతుంది. చాలా మ్యాచ్‌ల్లో అది నిరూపితమైంది. ఈ క్రెడిట్ కెప్టెన్ మహీ, కోచ్ ఫ్లెమింగ్‌కే దక్కుతుంది. గొప్ప ఫ్రాంచైజీ, బలమైన నాయకత్వంతోనే చెన్నై సూపర్ సక్సెస్ అవుతోంది. ఒకవేళ ధోనీ లేకపోతే ఆ లోటును పూడ్చడం చాలా కష్టం'అని డుప్లెసిస్ పేర్కొన్నాడు.
ఆ ట్వీట్ తొలగించు.. బబితా ఫోగాట్‌కు గుత్తా జ్వాలా స్వీట్ వార్నింగ్

సూపర్ ఫీల్డింగ్..
చెన్నై జట్టులో అద్భుత ఫీల్డర్లు కూడా ఉన్నారని ఈ సఫారీ బ్యాట్స్‌మన్ తెలిపాడు. అందులో జడేజా సూపర్బ్ ఫీల్డర్ అని కితాబిచ్చాడు. జడ్డూ తన ఫీల్డింగ్‌తో సుమారు 20 నుంచి 30 పరుగులు ఆపుతాడని దీనివల్ల బౌలర్లలో ఉత్సాహం వస్తుందన్నాడు. ‘బంతి ఎక్కువగా వచ్చే స్థానాల్లో ఫీల్డింగ్ చేయడం నాకు చాలా ఇష్టం. అలాగే మా జట్టులో మంచి ఫీల్డర్లు ఉన్నారు. అందులో జడేజా అద్భుత ఫీల్డర్. అతను బంతి కోసం పరుగెత్తుతున్నాడంటే బ్యాట్స్‌మన్ ఆగిపోవాల్సిందే. లేకుంటే మూల్యం చెల్లించుకోతప్పదు.'అని జడేజాను డుప్లెసిస్ కొనియాడాడు.

మరవలేని క్షణాలెన్నో..
తన 10 ఏళ్ల ఐపీఎల్ కెరీర్‌లో చెన్నై జట్టుతో ఎన్నో మధుర క్షణాలున్నాయని ఈ సఫారీ మాజీ కెప్టెన్ చెప్పుకొచ్చాడు. రైనా విసిరిన ఐపీఎల్ ఫేవరేట్ మూమెంట్ చాలెంజ్‌లో భాగంగా.. తన ఆల్‌టైమ్ ఫేవరేట్ మూమెంట్స్‌ను పంచుకున్నాడు. గతేడాది ఆర్‌సీబీతో జరిగిన ఓ మ్యాచ్‌లో ధోనీ ఆడిన(84 నాటైట్) విధ్వంసకర ఇన్నింగ్స్, 2013లో రైనా చేసిన సెంచరీ, 2018లో బ్రావో అందించిన అనూహ్య విజయం, గత రెండు సీజన్ల ఫైనల్లో షేన్ వాట్సన్ చేసిన పోరాటం ఎప్పటికీ మరవలేని అద్భుత క్షణాలని డుప్లెసిస్ పేర్కొన్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications