ఆ ట్వీట్ తొలగించు.. బబితా ఫోగాట్‌కు గుత్తా జ్వాలా స్వీట్ వార్నింగ్

న్యూఢిల్లీ: దేశంలో కరోనా బాధితుల సంఖ్య పెరగడానికి తబ్లిగీ జమాత్ ప్రార్థనలే కారణమని భారత స్టార్ రెజ్లర్, బీజేపీ మహిళా నాయకురాలు బబితా ఫోగాట్ చేసిన వరుస ట్వీట్లతో తీవ్ర దుమారం రేగిన విషయం తెలిసిందే. బబితా విద్వేశాన్ని రెచ్చగొడుతుందని ఆగ్రహం వ్యక్తం చేసిన కొందరూ ఆమె ట్విటర్ అకౌంట్‌ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ దేశంలో ద్వేశానికి చోటులేదని, ఇలాంటి వారు రోల్‌మోడల్స్ ఎలా అవుతారని ఆమెపై తీవ్ర ట్రోలింగ్‌కు పాల్పడ్డారు.
అయితే ఈ విమర్శలపై బబితా కూడా అదే రితీలో బదులిచ్చింది. బెదిరిస్తే బెదరడానికి తానేం జైరా వసీం కాదని, తానేమి తప్పుగా మాట్లాడలేదని, తన వ్యాఖ్యాలకు ఇప్పటికీ కట్టుబడి ఉన్నానని స్పష్టం చేసింది.
ఆ భక్తులకు కరోనా పరీక్షలు నిర్వహించారా?
అయితే ఆమె వ్యాఖ్యలపై సినీ, క్రీడా సెలెబ్రిటీలు కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తూ ట్వీట్ చేస్తున్నారు. బాలీవుడ్ హీరోయిన్ స్వరా భాస్కర్ వాస్తవ లెక్కలు తెలుసుకోవాలని బబితా వ్యాఖ్యలకు కౌంటరిచ్చింది. జమాత్ ప్రార్థనలకు ఢిల్లీ పోలీసులు ఎందుకు పర్మిషన్ ఇచ్చారని, పైగా ఆ సమయంలో హిందూ దేవాలయాలను కూడా వేల సంఖ్యలో సందర్శించారని, వారికి కరోనా పరీక్షలు నిర్వహించారా? అని ప్రశ్నించింది.

మరే జాతీయవాది గొంతెత్తడు..
మరో బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ బబితాకు మద్దుతగా నిలిచింది. ఆమెకు భద్రత కల్పించాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ‘ఈ రోజు బబితాకు ఏదైనా జరిగితే.. మరే జాతీయవాది గొంతెత్తడు. ఆమెకు వెంటనే భద్రత కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నా'అని కంగనా ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొంది.
బబితా ఆ ట్వీట్ తీసేయ్..
ఇక భారత బ్యాడ్మింటన్ డబుల్స్ స్టార్ గుత్తా జ్వాలా స్టార్ రెజ్లర్‌కు స్వీట్ వార్నింగ్ ఇచ్చింది. వివాదాలు వద్దని ఆ ట్వీట్ తొలగించాలని కోరింది.
‘సారీ బబితా.. ఈ కరోనా వైరస్ జాతి లేదా మతాన్ని చూస్తుందని అనుకోను. నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా. మనం స్పోర్ట్స్ పర్సనాలటీలం. మనం దేశానికే ప్రాతినిథ్యం వహిస్తున్నాం. మనం గెలిచినప్పుడు ప్రజలంతా కులాలు-మతాలు లేకుండా సెలబ్రేట్ చేసుకుంటారు. మన విజయాల్ని వారి గెలుపులుగా భావిస్తారు' అని జ్వాల పేర్కొన్నారు.
అంతేకాకుండా మరో ట్వీట్‌లో తాను విమర్శలు ఎదుర్కొన్నప్పుడు భారతీయురాలిగానే ఉన్నానని, అదే సమయంలో తాను పతకాలు గెలిచినప్పుడు ఎవరూ ఏమతం అనేది చూడలేదన్నారు. ఏ పరిస్థితుల్లోనైనా మనల్ని భారతీయులగా మాత్రమే గుర్తించారన్నారు. ప్రతీ ఒక్కరూ తన విజయాన్ని వారి విజయంగానే చూశారన్నారు. సమైక్యతే మన బలమని, దేశాన్ని విడగొట్టద్దు' అని జ్వాల పేర్కొన్నారు.

ప్రధాన సమస్య కరోనా కాదు..
సామాజిక మాధ్యమాల్లో చురుకుగా ఉంటూ దేశంలో జరిగే ప్రతిఘటనపై స్పందిస్తూ తన అభిప్రాయాలను నిక్కచ్చిగా పంచుకునే బబితా.. బుధవారం దేశంలో వేగంగా విస్తరిస్తున్న కరోనా వైరస్‌ను ఉద్దేశించి వరుస ట్వీట్‌లు చేసింది. దేశంలో కరోనా వైరస్ కన్నా తబ్లిగీ జమాతే ప్రార్థనలే ప్రధాన సమస్యగా మారిందని ట్వీట్ చేసింది. అంతకు మందు ఈ తబ్లిగీ జమాతే ప్రార్థనల్లో పాల్గొన్న ప్రజలు ఈ వైరస్‌ను ఇతరులకు అంటించకుంటే ఈ పాటికి దేశంలో లాక్‌డౌన్ ఎత్తేసేవారని, కరోనాను భారత్ జయించేదని పేర్కొంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications