Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ధోనీ పట్ల బీసీసీఐ వ్యవహరించిన తీరు బాలేదు: పాకిస్థాన్ మాజీ క్రికెటర్

Ex-Pakistan spinner Saqlain Mushtaq Says BCCI did not treat MS Dhoni the right way

కరాచీ: భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ రిటైర్మెంట్ పట్ల భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ప్రవర్తించిన తీరు బాలేదని పాకిస్థాన్ మాజీ స్పిన్నర్ సక్లైన్ ముస్తాక్ అన్నాడు. భారతకు ఎన్నో చిరస్మరణీయ విజయాలందించిన ధోనీ.. వీడ్కోలు మ్యాచ్ లేకుండా ఆటకు అల్విదా ప్రకటించడం బాలేదన్నాడు. ఇక గతేడాది వన్డే ప్రపంచకప్‌ సెమీస్‌లో న్యూజిలాండ్‌ చేతిలో ఓటమిపాలయ్యాక ధోనీ ఆటకు దూరమైన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఐపీఎల్‌ ఆడి జట్టులోకి వస్తాడని ఆశించినా భారత 74వ స్వాతంత్ర్య దినోత్సవం రోజున ఊహించని విధంగా అందర్నీ ఆశ్చర్యపరుస్తూ రిటైర్మెంట్‌ ప్రకటించాడు.

నా ఫేవరేట్ క్రికెటర్..

నా ఫేవరేట్ క్రికెటర్..

ఇక మహీ సాధా సీదాగా వీడ్కోలు పలకడం బాలేదని అటు అభిమానులతో పాటు ఇటు మాజీ క్రికెటర్లు అంటున్నారు. ఈ నేపథ్యంలోనే తన యూట్యూబ్‌చానెల్‌‌లో మాట్లాడిన సక్లైన్ ముస్తాక్.. మహీపై ప్రశంసల జల్లు కురిపించాడు. భారత జట్టు ప్రస్తుత స్థితికి ధోనీనే కారణమని కొనియాడాడు. ప్రతీ క్రికెటర్‌కి జీవితంలో ఇలాంటి రోజు వస్తుందని, ఆటకు వీడ్కోలు చెప్పక తప్పదని ముస్తాక్‌ అన్నాడు. అలాగే ధోనీ తన ఫేవరెట్‌ క్రికెటర్‌ అని, అతడో గొప్ప ఆటగాడే కాకుండా అత్యత్తమ ఫినిషర్‌, పోరాడే నాయకుడు, నిరాడంబర వ్యక్తి అంటూ ప్రశంసించాడు.

నూటికి ఒక్కరు..

నూటికి ఒక్కరు..

‘చూడటానికి మహీ ఎంత ప్రశాంతంగా కనిపించినా అతడు చాలా ప్రభావితం చేస్తాడు. ధోనీ అసాధారణ ఆటగాడు. ఇలాంటి వారు నూటికి ఒక్కరుంటారు. మహీ సాధించిన పేరూ, గౌరవం చరిత్రలో అలా నిలిచిపోతుంది. భారత జట్టు ఇప్పుడున్న స్థితికి అతడే పెద్ద కారణం. అలాగే ధోనీని అనుకరించి, అభిమానించే వాళ్లు ఎంతో మంది ఉన్నారు. వాళ్లంతా ధోనీని చివరి మ్యాచ్‌లో చూడాలనుకుంటారు.

ఆగలేక మాట్లాడుతున్నా..

ఆగలేక మాట్లాడుతున్నా..

నేనెప్పుడూ సానుకూల అంశాలు మాత్రమే మాట్లాడుతాను. నెగటివిటీని స్ప్రెడ్ చేయను. ఎవరిమీదా తప్పుగా మాట్లాడను. కానీ ధోనీ విషయంలో మాత్రం ఆగలేక ఇలా స్పందించాల్సి వస్తుంది. బీసీసీఐ ధోనీ వీడ్కోలు విషయంలో సరిగా ప్రవర్తించలేదు. అంత గొప్ప ఆటగాడికి సరైన పద్ధతిలో వీడ్కోలు పలకలేదు. ఇది ముమ్మాటికి బీసీసీఐ వైఫల్యమే. అతని వీడ్కోలు ఇలా ఉండాల్సింది కాదు. ఇది నా మనసులో నుంచి వచ్చిన మాట. ధోనీ కోట్లాది మంది అభిమానులు కూడా ఈ విషయాన్ని అంగీకరిస్తారు.

ఇలా అంటున్నందుకు సారీ బీసీసీఐ..

ఇలా అంటున్నందుకు సారీ బీసీసీఐ..

ఇలా అంటున్నందుకు బీసీసీఐకి క్షమాపణలు. కానీ మీ తీరుతో నేను బాధపడ్డా. ప్రతీ క్రికెటర్‌ కూడా గొప్పగా వీడ్కోలు అందుకోవాలనుకుంటాడు. ఆ విషయంలో ధోనీ కూడా అతీతుడు కాదు. అతని భవిష్యత్తు బాగుండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నా. కానీ ధోనీ విషయంలో మేమంతా పశ్చాతపపడేది ఏదైనా ఉందంటే అది వీడ్కోలు మ్యాచ్ ఆడకపోవడమే. ప్రతి ధోనీ అభిమాని ఈ విషయంలో రిగ్రెట్ అవుతారు. ధోనీ భారత జెర్సీలో చివరి మ్యాచ్ ఆడితే చాలా సంతోషంగా ఫీలవుతా'అని సక్లైన్ ముస్తాక్ చెప్పుకొచ్చాడు.

మీకేమైనా పిచ్చా.. రోహిత్, ధోనీ ఫ్యాన్స్ ఫైటింగ్‌పై సెహ్వాగ్ ఫైర్!

Story first published: Sunday, August 23, 2020, 15:55 [IST]
Other articles published on Aug 23, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+