Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

మీరేం అంపైర్లు సామీ.. ఇన్ని తప్పుడు నిర్ణయాలు.. ఇంత పక్షపాతమా?

England vs West Indies, 1st Test: 2 England umpires, 5 wrong calls against Windies

సౌతాంప్టన్‌: కరోనా వైరస్ కారణంగా ఏర్పడిన విరామం అనంతరం సుమారు 117 రోజుల తర్వాత క్రికెట్ రీస్టార్ట్ అయింది. ఇది సంతోషించే విషయమే అయినా కరోనా నేపథ్యంలో ఐసీసీ తీసుకొచ్చిన తాత్కలిక నిబంధనలు కొత్త తలనొప్పులు తీసుకొస్తున్నాయి. రివర్స్ స్వింగ్ కోసం బంతికి మెరుపు తీసుకురావడానికి బౌలర్లు ఉమ్ము పూయవద్దని, ఆటగాళ్లు హగ్గింగ్, హైఫై సంబరాలు చేసుకోవద్దని, అలాగే మ్యాచ్‌లు నిర్వహించే దేశం స్థానిక అంపైర్లను వినియోగించుకోవాలని ఐసీసీ కొత్త మార్గదర్శకాల్లో పేర్కొంది.

దీంతో బుధవారం నుంచి ఇంగ్లండ్‌-వెస్టిండీస్‌ జట్ల మధ్య ప్రారంభమైన తొలి టెస్టులో ఆతిథ్య జట్టు ఇద్దరు అంపైర్లను నియమించుకుంది. రిచర్డ్‌ కెటిల్‌బారో, రిచర్డ్‌ ఇల్లింగ్‌వర్త్‌. అయితే ఈ ఇద్దరు మైదానంలో చేసిన తప్పిదాలు చర్చనీయాంశమయ్యాయి. అవి కూడా ఆతిథ్య జట్టుకు అనుకూలంగా ఉండటం పలు అనుమానాలు రేకెత్తిస్తున్నాయి.

ఇంగ్లండ్ ఆలౌట్..

ఇంగ్లండ్ ఆలౌట్..

మూడు నెలల తర్వాత మొదలైందన్న ఆనందాన్ని తొలి రోజు 17 ఓవర్లకే పరిమితం చేసిన వరణుడు.. రెండో రోజు మాత్రం కరుణించాడు. లంచ్ బ్రేక్‌లో పలుకరించినా.. కరిబీయన్ల ఖతర్నాక్ బౌలింగ్ చూసి వెళ్లిపోయాడు. పిచ్‌పై తేమ, చల్లటి వాతావరణాన్ని సద్వినియోగం చేసుకున్న వెస్టిండీస్ బౌలర్లు రెచ్చిపోయారు. ఇంగ్లండ్ బ్యాట్స్‌మన్‌కు చుక్కులు చూపించారు. బుల్లెట్ల లాంటి బంతులతో షెనన్ గాబ్రియెల్(4/62) టాపార్డర్ పని పట్టేసి మంచి ఆరంభం ఇస్తే.. కెప్టెన్ జేసన్ హోల్డర్( 6/42) సిక్సర్‌తో ప్రత్యర్థిపై దండయాత్ర చేశాడు. దీంతో ఇంగ్లండ్ ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 204 పరుగులకు ఆలౌటైంది.

ప్రతీ సమీక్షలో అంపైర్స్ విఫలం..

ప్రతీ సమీక్షలో అంపైర్స్ విఫలం..

అయితే, ముగ్గురు ఇంగ్లండ్‌ బ్యాట్స్‌మన్‌ ఎల్బీడబ్ల్యూగా ఔటైనా రిచర్డ్‌ కెటిల్‌బారో అనే అంపైర్‌ మాత్రం నాటౌట్‌గా ప్రకటించాడు. విండీస్‌ జట్టు డీఆర్‌ఎస్‌కు వెళ్లిన ప్రతీసారి ఆ అంపైర్‌ నిర్ణయాలు తప్పుగా తేలాయి. తొలుత షెనన్‌ గాబ్రియెల్‌ బౌలింగ్‌లో రోరీ బర్న్స్‌ ఎల్బీగా ఔటైనా అంపైర్‌ నాటౌట్‌ ఇచ్చాడు. 7 ఓవర్ల తర్వాత మళ్లీ హోల్డర్‌ బౌలింగ్‌లో ఇంకో ఎల్బీని కూడా కాదన్నాడు. అది కూడా డీఆర్‌ఎస్‌కు వెళ్లడంతో ఔట్‌గా తేలింది. మరోసారి 58వ ఓవర్‌లో హోల్డర్‌ బౌలింగ్‌లోనే ఆర్చర్‌ ఎల్బీ అయినా అదే అంపైర్‌ నాటౌటిచ్చాడు. దీంతో మూడుసార్లు ఆ అంపైర్‌ తప్పుడు నిర్ణయాలు తీసుకున్నాడు.

పక్షపాతంగా వ్యవహరించడం..

అలాగే వెస్టిండీస్‌ బ్యాటింగ్‌ ఆరంభించాక ఈ సారి ఇల్లింగ్‌వర్త్‌ అనే అంపైర్‌ ఆండర్సన్‌ బౌలింగ్‌లో రెండుసార్లు జాన్‌ క్యాంప్‌బెల్‌ను ఎల్బీగా ఔటిచ్చాడు. అవి కూడా రెండు తప్పుడు నిర్ణయాలేనని తేలింది. అయితే, అవన్నీ ఎల్బీలే కావడం గమనార్హం. వాటిని గుర్తించడం కష్టమే అయినా, ఆ ఇద్దరు అంపైర్లకు దేశవాళీ క్రికెట్‌లో మంచి అనుభవమే ఉంది. అయినా ఐదుసార్లు తప్పుడు నిర్ణయాలు ఇచ్చారు. ఇవన్నీ పర్యాటక జట్టుకు వ్యతిరేకంగా ఉండటంతో స్థానిక అంపైర్ల విషయంలో కొత్త అనుమానాలు రేకెత్తుతున్నాయి.

ఫ్యాన్స్ ఫైర్.!

ఇక అంపైర్ల నిర్ణయంపై విండీస్ క్రికెటర్ కార్లోస్ బ్రాత్ వైట్ ట్విటర్ వేదికగా అసహనం వ్యక్తం చేశాడు. ప్రతీ నిర్ణయం..తప్పే అని తేలుతుందని అర్థంలో ట్వీట్ చేశాడు. ఇక అంపైర్ల తప్పుడు నిర్ణయాలపై అభిమానులు కూడా మండిపడుతున్నారు. మీరేం అంపైర్లు సామీ ఇన్ని తప్పుడు నిర్ణయాలా? అని వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. వెస్టిండీస్ ఆటగాళ్లను తీసుకొచ్చినప్పుడు.. తటస్థ అంపైర్లను తీసుకురాలేరా? అని ప్రశ్నిస్తున్నారు. ఐదు తప్పుడు నిర్ణయాలు ఇంగ్లండ్‌కు అనుకూలంగానే తీసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

నాన్న నల్లగా ఉన్నాడని అమ్మ వాళ్లు మాట్లాడలేదు.. లైవ్‌లో కంటతడి పెట్టుకున్న విండీస్‌ దిగ్గజం

Story first published: Friday, July 10, 2020, 22:00 [IST]
Other articles published on Jul 10, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+