Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

England vs Pakistan: పట్టు బిగించిన ఇంగ్లండ్.. ఫాలో ఆన్‌లో పాక్

England vs Pakistan: James Anderson picks five as England enforce follow-on
ENG VS PAK 2020 : Pak క్రికెటర్లను కాటేసిన కరోనా.. గత్యంతరం లేక 3 Star హోటల్లో బస !

సౌతాంప్టన్‌: ఊహించినట్లే సిరీస్ నిర్ణాయక టెస్ట్‌లో ఇంగ్లండ్ పట్టు బిగించింది. లెక్క సరిచేయాలన్న పట్టుదలతో బరిలోకి దిగిన పాకిస్థాన్.. బ్యాటింగ్‌లో తడబడింది. పటిష్టమైన ఇంగ్లండ్ బౌలింగ్‌ను దీటుగా ఎదుర్కోలేక చేతులెత్తేసింది. 75 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. దీంతో ఆ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 93 ఓవర్లలో 273 పరుగులకు ఆలౌటైంది. అయితే ఫాలో ఆన్‌ ఆడాల్సి ఉండగా వెలుతురులేమితో ఆటను నిలిపేశారు. పాక్‌ కెప్టెన్‌ అజర్‌ అలీ (141 నాటౌట్‌; 21 ఫోర్లు) అజేయ సెంచరీతో సత్తాచాటాడు. ఇంగ్లండ్‌కు 310 పరుగుల ఆధిక్యం లభించింది.

ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 8 వికెట్లకు 583 పరుగులు చేసి డిక్లేర్‌ చేసింది. జాక్‌ క్రాలీ (267; 34 ఫోర్లు, సిక్స్‌) డబుల్‌ సెంచరీ... జోస్‌ బట్లర్‌ (152; 13 ఫోర్లు, 2 సిక్స్‌లు) సెంచరీ సాధించారు.

దెబ్బతీసిన అండర్సన్..

దెబ్బతీసిన అండర్సన్..

ఓవర్‌నైట్‌ స్కోరు 24/3తో మూడో రోజు ఆదివారం ఆట కొనసాగించిన పాక్‌ను ఇంగ్లండ్‌ బౌలర్లు అండర్సన్‌ (5/56), బ్రాడ్‌ (2/40) దెబ్బ తీశారు. అండర్సన్ ధాటికి పాక్ ఓ 75 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అండర్సన్ ధాటికి ఆ జట్టు టాపార్డర్ పెవిలియన్‌కు క్యూ కట్టింది. ఫస్ట్ సెంచరీ హీరో ఓపెనర్ షాన్ మసూద్(4), మరో ఓపెనర్ అబిద్ అలీ(1), నిలకడకు మారు పేరైన బాబర్ అజామ్(11), అసద్ షఫీక్(5), ఫవాద్ అలామ్(21) దారుణంగా విఫలమయ్యారు.

అజర్, రిజ్వాన్ పోరాటం.

అజర్, రిజ్వాన్ పోరాటం.

ఈ క్లిష్ట స్థితిలో కెప్టెన్‌ అజర్‌ అలీ, రిజ్వాన్‌ అత్యుత్తమ ఆటతీరుతో కదం తొక్కారు. సెకండ్ సెషన్ మొత్తం ఆధిపత్యం చూపెట్టారు. ఈ క్రమంలో అజర్‌ అలీ (141 నాటౌట్‌; 21 ఫోర్లు) కెరీర్‌లో 17వ టెస్టు సెంచరీ చేయడంతోపాటు 6 వేల పరుగుల మైలురాయిని దాటాడు. మరోవైపు రిజ్వాన్ హాఫ్ సెంచరీ చేశాడు. ఆరో వికెట్‌కు 138 పరుగుల భాగస్వామ్యం జోడించిన తర్వాత ఈ జంటను వోక్స్ విడదీశాడు. కీపర్‌కు క్యాచ్ ఇచ్చి రిజ్వాన్ వెనుదిరిగాడు.

చేజారిన క్యాచ్‌లు..

చేజారిన క్యాచ్‌లు..

అయితే పాక్‌ ఇన్నింగ్స్‌ చివర్లో ఆండర్సన్‌ వేసిన రెండు ఓవర్లలో మూడు క్యాచ్‌లు మిస్‌ కావడంతో అతడి 600 వికెట్లు పూర్తి కాలేదు. ఈ ఘనతను అతను ఇంకా రెండు వికెట్ల దూరంలో ఉన్నాడు. చివర్లో బ్రాడ్ దెబ్బకు పాక్ టెయిలండర్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. యాసిర్ షా(20), షాహిన్ షా అఫ్రిది(3), నసీమ్ షా(0) ఓవర్ల వ్యవధిలోనే ఔటయ్యారు. ఇంకా రెండు రోజుల ఆట మిగిలుండగా.. పాకిస్థాన్‌ను ఓటమి నుంచి తప్పించాలంటే వరణుడే కరుణించాలి.

కోహ్లీ ఎవడైతే నాకేంటి.. ఎవడు నాపై ఆధిపత్యం చెలాయించవద్దు: విండీస్ పేసర్

1
46764
Story first published: Monday, August 24, 2020, 8:25 [IST]
Other articles published on Aug 24, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+