
గురువారం మరో పరీక్ష..
కరోనా బారిన పడిన ఆ 13 మందికి తప్ప.. చెన్నై సూపర్ కింగ్స్ జట్టులోని మిగతా వారందరికీ తాజాగా నిర్వహించిన కోవిడ్-19 పరీక్షల్లో నెగెటివ్ వచ్చిందన్నారు. ‘ఆ పదమూడు మందికి తప్ప మిగతా వారందరికీ కొవిడ్ నెగెటివ్‌గా వచ్చింది. వీరికి గురువారం మరోసారి పరీక్షలు చేయనున్నారు. ఈ నెల 4 నుంచి మా జట్టు ప్రాక్టీస్ ప్రారంభించే అవకాశాలున్నాయి' అని విశ్వనాథన్ చెప్పారు.
జట్టులో పాజిటివ్‌గా తేలిన ఆటగాళ్లు దీపక్, రుతురాజ్ కోవిడ్ ప్రొటోకాల్ ప్రకారం 14 రోజుల క్వారంటైన్ పూర్తి చేయడంతోపాటు వరుసగా రెండుసార్లు జరిపిన పరీక్షల్లో నెగెటివ్‌గా వస్తేనే ప్రాక్టీస్‌కు అనుమతిస్తామని తెలిపారు. ఇక లీగ్ నుంచి తప్పుకున్న జట్టు వైస్ కెప్టెన్ సురేశ్ రైనా స్థానంలో ఇప్పటి వరకు ఎవరినీ తీసుకోలేదు. రైనా తిరిగి వస్తాడనే ఆశాభావంతో ఉంది. రిప్లేస్‌మెంట్ విషయాన్ని ధోనీకే వదిలేశారని సమాచారం.
రికవర్ అయ్యా..
పేసర్ దీపక్ చాహర్ కరోనా నుంచి కోలుకుంటున్నాడు. ఈ విషయాన్ని అతనే స్వయంగా వెల్లడించాడు. కరోనా పాజిటివ్‌గా తేలిన దీపక్ ప్రస్తుతం క్వారంటైన్‌లో ఉన్నాడు. పూర్తిగా హోటల్ రూమ్‌కు పరిమితమైన దీపక్‌కు సంబంధించిన ఓ వీడియోను చెన్నై టీమ్ మంగళవారం సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇందులో చాహర్ మాట్లాడుతూ..‘నేను కోలుకున్నాను. ఫిట్‌గా ఉండేందుకు సాధ్యమైనంత వరకు ప్రయత్నిస్తున్నా. త్వరలోనే నన్ను మళ్లీ మైదానంలో చూస్తారు. నాకోసం ప్రార్థించిన వారందరికీ థ్యాంక్స్. 'అని తెలిపాడు. అనంతరం కాళ్లకు సంబంధించిన పలు వర్కౌట్స్ చేశాడు.

భజ్జీ వస్తాడు..
ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ యూఏఈ ప్రయాణాన్ని వాయిదా వేసుకున్నాడు. షెడ్యూల్ ప్రకారం మంగళవారం దుబాయ్‌కు బయలుదేరాల్సి ఉన్నా.. తన ప్రయాణాన్ని రీ షెడ్యూల్ చేసుకున్నాడు. అయితే వచ్చే వారం అతను యూఏఈ వెళ్లే అవకాశాలు ఉన్నాయి. హర్భజన్ కచ్చితంగా టోర్నీకి వస్తాడని విశ్వనాథన్ వెల్లడించారు.

రూ. 10 కోట్లు.. రూ.20 వేల టెస్ట్‌లు..
సుమారు రెండు నెలల పాటు యూఏఈలో జరగనున్న ఐపీఎల్‌లో ఆటగాళ్లు, సహాయక సిబ్బందికి నిర్వహించే కరోనా టెస్ట్‌లకు బీసీసీఐ సుమారు రూ.10 కోట్లు ఖర్చు చేస్తున్నది. 75 మంది హెల్త్‌కేర్ సిబ్బంది.. టోర్నీ ముగిసే వరకు 20 వేల టెస్ట్‌లు చేయనున్నారు. దీనిపై బోర్డుకు చెందిన ఐపీఎల్ అధికారి ఒకరు మాట్లాడుతూ ‘టెస్టుల కోసం యూఏఈకి చెందిన వీపీఎస్ హెల్త్‌కేర్‌తో ఒప్పందం చేసుకున్నాం. 20 వేలకు పైగా టెస్టులు చేయాల్సిరావచ్చు. ఒక్కో టెస్టు కోసం 200 దిర్హమ్ (రూ.3978) ఖర్చు పెడుతున్నాం' అని అన్నారు. దుబాయ్ వెళ్లే ముందు భారత్‌లో నిర్వహించిన పరీక్షల ఖర్చులను ఆయా ఫ్రాంచైజీలే భరించాయి.
CPL 2020: కిడ్నీ స్టోన్స్ సమస్యతోనే సునీల్ నరైన్ దూరం: మెక్‌కల్లమ్


Click it and Unblock the Notifications
