బ్రాడ్ ధనాధన్ ఫిఫ్టీ.. ఇంగ్లండ్‌దే పైచేయి.. కష్టాల్లో విండీస్!

మాంచెస్టర్: వెస్టిండీస్‌తో జరుగుతున్న నిర్ణాయక టెస్టులో ఇంగ్లండ్ పైచేయి సాధించింది. అయితే రెండో రోజు ఆట అనేక మలుపులు తిరిగింది. ఆట ప్రారంభమవ్వగానే ఇంగ్లండ్ వరుసగా నాలుగు ఓవర్లలో నాలుగు కీలక వికెట్లు కోల్పోయింది. స్కోర్ మూడొందలు దాటుడే కష్టమనుకుంటున్న తరుణంలో.. స్టువర్ట్ బ్రాడ్(45 బంతుల్లో 9 ఫోర్లు, 1 సిక్సర్‌తో 62, 2/17) అద్భుత ప్రదర్శన కనబర్చాడు. కరీబియన్ బౌలర్లను ఉతికి ఆరేస్తూ.. వన్డే తరహాలో బ్యాటింగ్ చేశాడు. మెరుపు హాఫ్ సెంచరీతో ఇంగ్లండ్‌ను పటిష్ట స్థితిలో నిలిపాడు. అంతేకాకుండా బౌలింగ్‌లోనూ రెండు వికెట్లు తీసి కరీబియన్లను దెబ్బకొట్టాడు.
అటు అండర్సన్(2/17) కూడా చెలరేగడంతో కరీబియన్లు కోలుకోలేకపోయారు. దీంతో శనివారం ఆట ముగిసేసరికి విండీస్ తొలిఇన్నింగ్స్‌లో 47.1 ఓవర్లలో 6 వికెట్లకు 137 పరుగులు చేసింది. క్రీజులో హోల్డర్(24 బ్యాటింగ్), డౌరిచ్(10 బ్యాటింగ్) ఉన్నారు. క్యాంప్‌బెల్(36) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అంతకుముందు ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 369 పరుగులకు ఆలౌటైంది. ప్రస్తుతం ఆ జట్టు 232 రన్స్ ఆధిక్యంలో ఉంది. రోచ్‌కు 4 వికెట్లు దక్కాయి.

ఇంగ్లండ్ కష్టాలతో...
ఓవర్‌నైట్ స్కోరు 258/4తో శనివారం ఆట కొనసాగించిన ఇంగ్లండ్‌ను విండీస్ బౌలర్లు కట్టడి చేశారు. వరుసగా నాలుగు ఓవర్లలో నాలుగు వికెట్లు తీయడంతో స్కోర్ 280/8గా మారింది. ఓవర్‌నైట్ బ్యాట్స్‌మన్ పోప్ (150 బంతుల్లో 11 ఫోర్లతో 91; ) ఒక్క పరుగైనా చేయకుండానే వెనుదిరగ్గా.. మరో బ్యాట్స్‌మన్ బట్లర్ (142 7 ఫోర్లు, 2 సిక్స్‌లతో బంతుల్లో 67; ) కూడా మరో 11 రన్స్ మాత్రమే జత చేశాడు. ఇద్దరినీ గాబ్రియెల్ పెవిలియన్ పంపాడు. తర్వాత కీమర్ రోచ్... వోక్స్ (1), ఆర్చర్ (3)లను ఔట్ చేశాడు. దీంతో ఒకదశలో 300 పరుగుల్లోపే తొలి ఇన్నింగ్స్ ముగిసేలా కనిపించింది.

ఇంగ్లండ్ టెస్ట్ చరిత్రలోనే..
కానీ బ్రాడ్ మెరిపించడంతో టెస్టు కాసేపు వన్డేలా మారింది. ఈ టెయిలెండర్ దూకుడు పెరగడంతో జట్టు స్కోరు కూడా పెరిగింది. బ్రాడ్ 33 బంతుల్లో అర్ధసెంచరీ (8 ఫోర్లు, 1 సిక్స్) ఇంగ్లండ్ టెస్టు చరిత్రలో వేగవంతమై మూడో అర్ధసెంచరీగా నిలిచింది. డామ్ బెస్ (18 నాటౌట్; 1 ఫోర్)తో తొమ్మిదో వికెట్‌కు జతచేసిన 76 పరుగుల భాగస్వామ్యం ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌ను పటిష్టం చేసింది. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 111.5 ఓవర్లలో 369 పరుగుల వద్ద ఆలౌటైంది. రోచ్ 4, గాబ్రియెల్, చేజ్ చెరో 2 వికెట్లు తీశారు.

రోచ్ ‘డబుల్ సెంచరీ'
వోక్స్‌ను ఔట్ చేయడంతో కీమర్ రోచ్ 200 వికెట్ల క్లబ్‌లోకి చేరాడు. టెస్టు క్రికెట్‌లో 200 వికెట్లు పూర్తి చేసుకున్న తొమ్మిదో వెస్టిండీస్ బౌలర్‌గా కీమర్ రోచ్ గుర్తింపు పొందాడు. గతంలో విండీస్ తరఫున కొట్నీ వాల్‡్ష, ఆంబ్రోస్, మార్షల్, లాన్స్ గిబ్స్, గార్నర్, హోల్డింగ్, గ్యారీ సోబర్స్, ఆండీ రాబర్ట్స్ ఈ ఘనత సాధించారు.
తొలి ఇన్నింగ్స్ మొదలుపెట్టిన విండీస్‌ను బ్రాడ్ బంతితోనూ దెబ్బ తీశాడు. తన మొదటి ఓవర్లోనే క్రెయిగ్ బ్రాత్‌వైట్ (1)ను ఔట్ చేశాడు. కాసేపయ్యాక మరో ఓపెనర్ జాన్ క్యాంప్‌బెల్ (32)ను ఆర్చర్ ఔట్ చేయగా... షై హోప్ (17) అండర్సన్ స్వింగ్‌కు కంగుతిన్నాడు.

విండీస్ విలవిల..
టీ విరామంలోపే ఈ మూడు వికెట్లు పడటం కరీబియన్ ఇన్నింగ్స్‌ను దారుణంగా దెబ్బతీసింది. అప్పుడు విండీస్ స్కోరు 58/3. ఆఖరి సెషన్‌లోనూ ఇంగ్లండ్ బౌలర్ల హవానే కొనసాగడంతో వెస్టిండీస్ విలవిలలాడింది. బ్రూక్స్ (4)ను అనుభవజ్ఞుడైన అండర్సన్ బుట్టలో పడేయగా... చేజ్ (9)ను బ్రాడ్ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. 73 పరుగులకే 5 వికెట్లను కోల్పోయింది.
కాసేపు పోరాడిన బ్లాక్‌వుడ్ (26; 3 ఫోర్లు)... విండీస్ స్కోరు కష్టంగా 100 పరుగులు దాటాక వోక్స్ బౌలింగ్‌లో నిష్క్రమించాడు. ఆట నిలిచే సమయానికి కెప్టెన్ హోల్డర్ (24 బ్యాటింగ్; 4 ఫోర్లు), డౌరిచ్ (10 బ్యాటింగ్; 2 ఫోర్లు) క్రీజులో ఉన్నారు. విండీస్ ఫాలోఆన్ తప్పించుకోవాలంటే మరో 33 పరుగులు చేయాలి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications
సచిన్ టెండూల్కర్‌ను మోసం చేసిన హైదరాబాద్ రియల్టర్!