లండన్: భారత పర్యటనకు రానున్న 16 మందితో కూడిన ఇంగ్లాండ్ జట్టుని బుధవారం ప్రకటించారు. గాయం నుంచి ఇంకా కోలుకోలేని ఇంగ్లాండ్ పేసర్ జేమ్స్ ఆండర్సన్‌కు జట్టులో చోటు కల్పించలేదు. కెప్టెన్ అలెస్టర్ కుక్ నేతృత్వంలోని ఇంగ్లాండ్ జట్టు భారత్‌తో ఐదు టెస్టు మ్యాచ్‌లు ఆడనుంది.
ఐదు టెస్టుల్లో భాగంగా తొలి టెస్టు నవంబర్ 9న రాజ్‌కోట్‌లో జరగనుంది. భారత్-ఇంగ్లాండ్ మధ్య జరగనున్న ఈ టెస్టు సిరిస్‌లో బీసీసీఐ తొలిసారిగా అంపైర్ నిర్ణయ సమీక్షా పద్ధతి (డీఆర్ఎస్) విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేసేందుకు అంగీకరించిన సంగతి తెలిసిందే.
మెట్టు దిగిన బీసీసీఐ: భారత్-ఇంగ్లాండ్ సిరిస్‌లో డీఆర్ఎస్ప్రస్తుతం బంగ్లాదేశ్‌తో రెండు టెస్టు మ్యాచ్‌ల సిరిస్ ఆడేందుకు వచ్చిన ఇంగ్లాండ్ జట్టే భారత పర్యటనకు రానుంది. తొలి టెస్టులో బంగ్లాదేశ్‌పై ఇంగ్లాండ్ 22 పరుగుల తేడాతో విజయం సాధించింది. శుక్రవారం (అక్టోబర్ 28) నుంచి ఢాకాలో రెండో టెస్టు ప్రారంభం కావాల్సి ఉంది.
టార్గెట్ సచిన్ టెండూల్కర్: రికార్డు సృష్టించిన కెప్టెన్ కుక్ బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో భుజానికి గాయమైన కారణంగా జేమ్స్ ఆండర్సన్‌ని భారత్ పర్యటనకు దూరంగా పెడుతున్నట్లు ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు(ఈసీబీ) బుధవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొంది. కాగా, ఇంగ్లాండ్ తరుపున అత్యధిక వికెట్లు (473) తీసుకున్న ఆటగాడిగా ఆండరన్స్ రికార్డు సృష్టించాడు.
భారత్ Vs ఇంగ్లాండ్: పూర్తి షెడ్యూల్, ఛాన్స్ కొట్టేసిన విశాఖ
నవంబర్ 9న జరగనున్న తొలి టెస్టులో ప్రారంభం కానున్న ఇంగ్లాండ్ పర్యటన ఫిబ్రవరి 1తో ముగియనుంది. నవంబర్ 9 నుంచి డిసెంబర్ 20 వరకు భారత్-ఇంగ్లాండ్ మధ్య ఐదు టెస్టులు జరగనున్నాయి. ఈ టెస్టు సిరిస్‌కు రాజ్ కోట్, విశాఖపట్నం స్టేడియాలు తొలిసారిగా ఆతిథ్యమివ్వనున్నాయి.

మిగతా మూడు టెస్టులు మొహాలి, ముంబై, చెన్నైలలో జరగనున్నాయి. విరాట్ కోహ్లీ టీమిండియా టెస్టు కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత భారత్ ఇప్పటివరకు ఆడిన 17 టెస్టులకు గాను 10 టెస్టుల్లో విజయం సాధించింది. ఇంగ్లాండ్‌తో కూడా టీమిండియా అదే జోరును కొనసాగించే అవకాశం ఉంది.
టెస్టు సిరిస్ ముగిసిన తర్వాత జనవరి 15 నుంచి వన్డేలు ప్రారంభం కానున్నాయి. టెస్టు సిరిస్, వన్డే సిరిస్‌కు మధ్య క్రిస్మస్ సందర్భంగా విరామం వచ్చింది.
భారత పర్యటనకు ఇంగ్లాండ్ టెస్టు జట్టు:
1. Alastair Cook (captain, Essex)
2. Moeen Ali (Worcestershire)
3. Zafar Ansari (Surrey)
4. Jonny Bairstow (Yorkshire)
5. Jake Ball (Nottinghamshire)
6. Gary Ballance (Yorkshire)
7. Gareth Batty (Surrey)
8. Stuart Broad (Nottinghamshire)
9. Jos Buttler (Lancashire)
10. Ben Duckett (Northamptonshire)
11. Steven Finn (Middlesex)
12. Haseeb Hameed (Lancashire)
13. Adil Rashid (Yorkshire)
14. Joe Root (Yorkshire)
15. Ben Stokes (Durham)
16. Chris Woakes (Warwickshire)