For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

భారత్ Vs ఇంగ్లాండ్: పూర్తి షెడ్యూల్, ఛాన్స్ కొట్టేసిన విశాఖ

By Nageshwara Rao

హైదరాబాద్: స్వదేశంలో భారత్ మరో సిరిస్‌కు సిద్ధమైంది. భారత్‌లో న్యూజిలాండ్ పర్యటన ముగిసిన అనంతరం ఇంగ్లాండ్ జట్టు భారత పర్యటనకు రానుంది. ఇంగ్లాండ్ జట్టు భారత్‌లో 5 టెస్టులు, మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడనుంది. నవంబర్ 9న జరగనున్న తొలి టెస్టులో ప్రారంభం కానున్న ఇంగ్లాండ్ పర్యటన ఫిబ్రవరి 1తో ముగియనుంది.

నవంబర్ 9 నుంచి డిసెంబర్ 20 వరకు భారత్-ఇంగ్లాండ్ మధ్య ఐదు టెస్టులు జరగనున్నాయి. ఈ టెస్టు సిరిస్‌కు రాజ్ కోట్, విశాఖపట్నం స్టేడియాలు తొలిసారిగా ఆతిథ్యమివ్వనున్నాయి. మిగతా మూడు టెస్టులు మొహాలి, ముంబై, చెన్నైలలో జరగనున్నాయి. 2014లో పటౌడీ ట్రోఫీలో భాగంగా భారత్-ఇంగ్లాండ్‌ల మధ్య ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరిస్ జరిగింది.

విరాట్ కోహ్లీ టీమిండియా టెస్టు కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత భారత్ ఇప్పటివరకు ఆడిన 17 టెస్టులకు గాను 10 టెస్టుల్లో విజయం సాధించింది. ఇంగ్లాండ్‌తో కూడా టీమిండియా అదే జోరును కొనసాగించే అవకాశం ఉంది. టెస్టు సిరిస్ ముగిసిన తర్వాత జనవరి 15 నుంచి వన్డేలు ప్రారంభం కానున్నాయి. టెస్టు సిరిస్, వన్డే సిరిస్‌కు మధ్య క్రిస్మస్ సందర్భంగా విరామం వచ్చింది.

India vs England 2016: Full schedule, when and where to watch, live coverage on TV


టెస్టు షెడ్యూల్‌
1st Test: 9-13 November at Saurashtra Cricket Association Stadium in Rajkot.
2nd Test: 17-21 November at Dr. Y.S. Rajasekhara Reddy ACA-VDCA Cricket Stadium, Visakhapatnam.
3rd Test: 26-30 November at Punjab Cricket Association IS Bindra Stadium, Mohali, Chandigarh.
4th Test: 8-12 December at Wankhede Stadium, Mumbai.
5th Test: 16-20 December at MA Chidambaram Stadium at Chepauk, Chennai

వన్డే షెడ్యూల్‌
1st ODI: 15 January at Maharashtra Cricket Association Stadium, Pune.
2nd ODI: 19 January at Barabati Stadium, Cuttack.
3rd ODI: 22 January at Eden Gardens, Kolkata.

టీ2 0షెడ్యూల్‌
1st T20I: 26 January at Green Park, Kanpur.
2nd T20I: 29 January at Vidarbha Cricket Association Stadium, Jamtha, Nagpur.
3rd T20I: 1 February at M Chinnaswamy Stadium, Bengaluru.

అన్ని మ్యాచ్‌లు కూడా స్టార్ స్పోర్ట్స్ ప్రసారం అవుతాయి. టెస్టు మ్యాచ్‌లు ఉదయం 9.30 గంటలకు ప్రారంభం అవుతాయి. వన్డేలన్నీ కూడా డే/నైట్ జరుగుతాయి. టీ20 మ్యాచ్‌లు సాయంత్రం 7 గంటల తర్వాత జరుగుతాయి.

Story first published: Monday, November 13, 2017, 12:12 [IST]
Other articles published on Nov 13, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+