Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

టార్గెట్ సచిన్ టెండూల్కర్: రికార్డు సృష్టించిన కెప్టెన్ కుక్

ఢాకా: ఇంగ్లాండ్ టెస్టు కెప్టెన్ అలెస్టర్ కుక్ మరో ఘనతను సాధించాడు. ఇంగ్లాండ్ తరుపున అత్యధిక టెస్టుమ్యాచ్ లాడిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. బంగ్లాదేశ్‌తో చిట్టగ్యాంగ్‌లో జరుగుతున్న తోలి టెస్టులో అతడు ఈ మైలురాయిని అందుకున్నాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇంగ్లాండ్ తరుపున 133 టెస్టులాడిన అలెక్‌ స్టివార్ట్‌ రికార్డును కుక్ అధిగమించాడు. అయితే అలెస్టర్ కుక్‌ 31 ఏళ్లకే ఈ రికార్డు సాధించడం విశేషం. కాగా, ప్రస్తుతం కుక్ క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ రికార్డుపై కన్నేశాడు. సచిన్ టెండూల్కర్ 200 టెస్టు మ్యాచ్ లాడిన సంగతి తెలిసిందే.

ఇంగ్లాండ్‌ తరఫున టెస్టు క్రికెట్‌లో పదివేలకు పైగా పరుగులు చేసిన తొలి ఆటగాడిగా కుక్ రికార్డు సృష్టించాడు. 47.31 సగటుతో కుక్ ఇప్పటివరకు 10,603 పరుగులు చేశాడు. ఇందులో 29 సెంచరీలు, 51 అర్ధ సెంచరీలు ఉన్నాయి. టెస్టు క్రికెట్‌లో కుక్ అత్యధిక స్కోరు 294.

I could break Sachin Tendulkar's record, says Alastair Cook

కాగా, భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ అత్యధికంగా 200 టెస్టులాడి అందరికంటే ముందంజలో ఉన్నాడు. రికీ పాంటింగ్, స్టీవా(168) తర్వాతి స్థానంలో నిలిచాడు. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక టెస్టులు ఆడిన క్రికెటర్ల జాబితాలో అలెస్టర్ కుక్ 11వ స్థానంలో ఉన్నాడు.

తన పదేళ్ల టెస్టు కెరీర్‌లో కుక్ ఒక్కటంటే ఒక్క టెస్టు మాత్రమే ఆడలేదు. 2006లో ఇండియాపై టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. కాగా, ప్రస్తుతం చిట్టగాంగ్‌లో బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో కుక్ కేవలం 4 పరుగులు చేసి పెవిలియన్‌కు చేరాడు.

Story first published: Monday, November 13, 2017, 12:12 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+