జరిగిందేదో జరిగింది.. ఇకనైనా మర్యాద ఇవ్వండి: బ్రావో

న్యూఢిల్లీ: ఇప్పటి వరకు జరిగిందేదో జరిగిందని, ఇక నుంచైనా తమకు గౌరవం ఇవ్వాలని నల్లజాతీయుల తరఫున వెస్టిండీస్ ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రావో యావత్ ప్రపంచ ప్రజానికానికి విజ్ఞప్తి చేశాడు.. అమెరికా నల్లజాతీయుడు జార్జ్ ఫ్లాయిడ్ హత్యోదంతం నేపథ్యంలో జాతి వివక్షపై జరుగుతున్న చర్చలో భాగంగా బ్రావో స్పందించాడు. ఇప్పటికే తన సహచర ఆటగాళ్లు క్రిస్ గేల్, డారెన్ సామీ ఈ వ్యవహారంపై గళం ఎత్తగా తాజగా బ్రావో తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. నల్లజాతీయులందరికీ గౌరవం ఇవ్వాల్సిందేనన్నాడు.

సమానత్వం కావాలి..
జింబాబ్వే మాజీ క్రికెటర్ పొమ్మి ఎంబాగ్వతో లైవ్ సెషన్‌లో పాల్గొన్న బ్రావో.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న నల్లజాతీయులు అందరిలానే గౌరవ, మర్యాదాలు అందుకోవాలన్నాడు. ఎవరూ ప్రతీకారం కోరుకోవడం లేదని, సమానత్వం కావాలనుకుంటున్నారని తెలిపాడు. ‘ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఘటనలు చూస్తుంటే బాధగా ఉంది. ఓ నల్లజాతి వ్యక్తిగా నల్లజాతీయుల చరిత్ర గురించి తెలుసు. మేం ఎప్పుడూ ప్రతీకారం కోరుకోలేదు. సమాత్వం, గౌరవం మాత్రమే అడుగుతున్నాం. ఇతరులకు మేం కూడా మర్యాదిస్తాం. అయినా తరతరాలుగా మేమే ఎందుకు వివక్షను ఎదుర్కుంటున్నాం?.

మా గురించి తెలుసుకోవాలి..
నా సోదరీ సోదరమణులు, మా శక్తి సామార్ధ్యాలు, అందం గురించి తెలుసుకోవాలనుకుంటున్నా. ఏదో ఒక రోజు నెల్సెన్ మండేలా, మహ్మద్ అలీ, మైఖేల్ జ జోర్డాన్ లాంటి మా నల్లజాతి ఆణిముత్యాలను చూస్తారు. ఇప్పటివరకు జరిగిందే జరిగింది. మాకు సమానత్వం కావాలి. ఎలాంటి ప్రతీకారం, యుద్దం వద్దు. కేవలం గౌరవమిస్తే చాలు. ఒకరికొకరం అప్యాయంగా పలకరించుకోవడం, ప్రేమను పంచుకోవడం కావాలి. అదే ముఖ్యం'అని బ్రావో చెప్పుకొచ్చాడు.

కాలూ' అని పిలిచేవారు:
ఐపీఎల్ మ్యాచ్‌ల సందర్భంగా తాను జాతి వివక్ష వ్యాఖ్యల్ని ఎదుర్కొన్నానని డారెన్ స్యామీ ఇటీవల అన్నాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడిన సమయంలో తనతో పాటు శ్రీలంక క్రికెటర్ తిసారా పెరీరా వర్ణ వివక్షకు గురయ్యాడని తెలిపాడు. 'సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన సమయంలో నన్ను, పెరీరాను 'కాలూ... కాలూ' అని పిలిచేవారు. అప్పుడు దానర్థం మాకు తెలిసేది కాదు. భారత్‌లో 'కాలూ' అంటే 'బలమైన వ్యక్తి' అని పిలుస్తున్నారేమో అనుకునేవాడిని. కానీ ఈ మధ్యే ఆ పదానికి అర్థం తెలుసుకున్నా. చాలా బాధగా ఉంది' అని సామీ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా పేర్కొన్నాడు.

సమయం మించిపోలేదు మిత్రమా
వర్ణ వివక్ష (జాత్యాంహకారం)పై పోరాడేందుకు మరీ ఎక్కువ ఆలస్యం కాలేదని వెస్టిండీస్ విధ్వంసక ఓపెనర్ 'యూనివర్సల్ బాస్' క్రిస్ గేల్ చెప్పాడు. క్రికెట్లో తాను వర్ణ వివక్షతో కూడిన వ్యాఖ్యలను ఎదుర్కొన్నానని చెప్పిన విండీస్ మాజీ కెప్టెన్ డారెన్ సమీకి మద్దతు తెలుపుతూ గేల్ ట్వీట్ చేశాడు. 'సరైన విషయం కోసం పోరాడేందుకు సమయం మించిపోలేదు. కొన్ని సంవత్సరాల నుంచి నువ్వు ఎదుర్కొన్న చేదు అనుభవాలపై పోరాడేందుకు మరీ ఆలస్యం కాలేదు. నీ కథ లాగే ఇంకా చాలా ఉన్నాయి. నేను చెప్పినట్టే క్రికెట్లోనూ వర్ణ వివక్ష ఉంది' అని గేల్ ట్వీట్ చేశాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications
శరీర రంగే కాదు.. మతం కారణంగా కూడా వివక్ష: ఇర్ఫాన్ పఠాన్