Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కెప్టెన్ ఇన్నింగ్స్‌తో ఇషాన్ షో: టెస్ట్ టీమ్‌లోకి రీఎంట్రీకి బిగ్ స్టేట్‌మెంట్!

దులీప్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌లో సౌత్ జోన్ జట్టుపై ఈస్ట్ జోన్ కెప్టెన్ ఇషాన్ కిషన్ తన బ్యాటింగ్‌తో విశ్వరూపం చూపించాడు. చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ కీలక పోరులో తొలి రోజే విధ్వంసకర సెంచరీ సాధించి.. తన జట్టును భారీ స్కోరు దిశగా నడిపించాడు. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేయాలన్న తన నిర్ణయాన్ని సరైనదని నిరూపిస్తూ.. స్టేడియం నలువైపులా అద్భుతమైన షాట్లతో సౌత్ జోన్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు.

IND vs PAK: భారత్‌ను ఓడిస్తాం.. టైటిల్ గెలుస్తాం: పాక్ కోచ్

IND vs PAK: భారత్‌ను ఓడిస్తాం.. టైటిల్ గెలుస్తాం: పాక్ కోచ్

ఈ కీలక మ్యాచ్‌లో ఈస్ట్ జోన్ శుభారంభం సాధించింది. టాపార్డర్ బ్యాటర్లు జట్టుకు పటిష్టమైన పునాది వేశారు. యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ కేవలం 37 బంతుల్లో 5 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 44 పరుగులు చేసి దూకుడుగా ఇన్నింగ్స్‌ను ప్రారంభించగా.. ఆ తర్వాత అభిమన్యు ఈశ్వరన్, శిఖర్ మోహన్ చెరో హాఫ్ సెంచరీలతో రాణించారు. తూర్పు జోన్ స్వల్ప వ్యవధిలోనే వికెట్లు కోల్పోయిన దశలో కెప్టెన్ ఇషాన్ కిషన్ క్రీజులోకి వచ్చి బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడాడు.

Duleep Trophy Final Ishan Kishan Hits Century in Final Knocking India Test Doors Full Details Here

మిడిలార్డర్లో బ్యాటింగ్‌కు వచ్చిన ఇషాన్ కిషన్, కుమార్ కుశాగ్రతో కలిసి ఐదో వికెట్‌కు అమూల్యమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ప్రారంభంలో పిచ్‌ను, బంతి కదలికలను జాగ్రత్తగా పరిశీలించిన ఇషన్ కిషన్.. క్రీజులో కుదురుకున్న తర్వాత సౌత్ జోన్ బౌలర్లపై దాడికి దిగాడు. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి ఇషాన్ కిషన్ 111 పరుగులతో నాటౌట్‌గా నిలవడంతో ఈస్ట్ జోన్ తొలి ఇన్నింగ్స్‌లో 4 వికెట్ల నష్టానికి 385 పరుగుల భారీ స్కోరును నమోదు చేసింది.

IND vs PAK: చేసింది తొక్కలో 55 రన్స్.. బిల్డప్ మాత్రం మామూలుగా లేదుగా! (వీడియో)

Also Read

IND vs PAK: చేసింది తొక్కలో 55 రన్స్.. బిల్డప్ మాత్రం మామూలుగా లేదుగా! (వీడియో)

2023 నుంచి భారత టెస్ట్ జట్టుకు దూరంగా ఉంటున్న ఇషాన్ కిషన్‌కు ఈ సెంచరీ ఎంతో కీలకమైనది. రెడ్ బాల్ క్రికెట్లో కెప్టెన్‌గా బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ ఫైనల్ వంటి కీలక మ్యాచ్‌లో శతకం బాదడం ద్వారా తన అత్యుత్తమ ఫామ్‌ను మళ్లీ నిరూపించుకున్నాడు. ఈ అద్భుతమైన ఇన్నింగ్స్ తో రాబోయే టెస్ట్ సిరీస్‌ల కోసం టీమిండియాలోకి తిరిగి రావాల్సిందిగా సెలెక్టర్లకు బలమైన సందేశాన్ని పంపాడు.

Story first published: Sunday, September 6, 2026, 18:40 [IST]
Other articles published on Sep 6, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+