Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs PAK: చేసింది తొక్కలో 55 రన్స్.. బిల్డప్ మాత్రం మామూలుగా లేదుగా! (వీడియో)

IND vs PAK: మహిళల ఆసియా కప్ 2026లో భాగంగా భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో వివాదాస్పద ఘట్టం చోటుచేసుకుంది. టీమిండియా ఓపెనర్ షెఫాలీ వర్మను ఔట్ చేసిన అనంతరం పాకిస్తాన్ కెప్టెన్ ఫాతిమా సనా ఆమెకు పెవిలియన్ వైపు వెళ్లమని సైగ చేస్తూ వివాదాస్పద రీతిలో సాగనంపారు. ఈ మ్యాచ్‌లో భారత్ ముందే సెమీఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకోగా.. టీ20 అంతర్జాతీయ క్రికెట్లో పాకిస్తాన్‌పై వరుసగా ఐదో విజయాన్ని నమోదు చేసింది. మరోవైపు పాకిస్తాన్ సెమీస్ అవకాశాలు ఇప్పుడు వారి చివరి గ్రూప్ మ్యాచ్ ఫలితంపై ఆధారపడి ఉన్నాయి.

IND vs PAK: పాక్‌పై ఏకపక్ష విజయం.. భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ ఏమన్నారంటే?

IND vs PAK: పాక్‌పై ఏకపక్ష విజయం.. భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ ఏమన్నారంటే?

దుబాయ్ వేదికగా జరిగిన ఈ పోరులో భారత ఇన్నింగ్స్ తొలి బంతికే షెఫాలీ వర్మ సిక్సర్ బాది ఆ తర్వాతి బంతికి సింగిల్ తీసి మహిళల టీ20 అంతర్జాతీయ క్రికెట్లో 3000 పరుగుల మైలురాయిని చేరుకున్నారు. ఆ తర్వాత ఫాతిమా సనా బౌలింగ్‌లో ఫోర్ బాదిన షెఫాలీని ఫాతిమా సనా క్యాచ్ ఔట్ చేశారు. 12 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద షెఫాలీని ఔట్ చేసిన తర్వాత ఫాతిమా మైదానంలో చూపించిన దూకుడు తీవ్ర విమర్శలకు దారితీసింది. భారత మాజీ క్రికెటర్, ప్రముఖ కామెంటేటర్ వివేక్ రజ్ఞాన్ ఈ ప్రవర్తనను తీవ్రంగా తప్పుపట్టారు. పాకిస్తాన్ జట్టు మొత్తం కేవలం 55 పరుగులకే ఆలౌట్ అయిన విషయాన్ని గుర్తు చేస్తూ.. "మీ జట్టు చేసిందే 55 పరుగులు, అలాంటప్పుడు షెఫాలీ వర్మకు పెవిలియన్ దారి చూపించడం ఏంటి?" అని ఆయన ఘాటుగా ప్రశ్నించారు.

IND vs PAK Fatima Sana Send-off Controversy After Pak All Out for 55 against India Details Here

ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ ఒక దశలో వికెట్ నష్టపోకుండా 27 పరుగులు చేసి మంచి స్థితిలోనే కనిపించింది. అయితే భారత స్పిన్నర్లు శ్రీచరణ, ప్రేమా రావత్ తలో 3 వికెట్లు పడగొట్టగా.. దీప్తి శర్మ రెండు వికెట్లతో విరుచుకుపడ్డారు. దీంతో పాకిస్తాన్ కేవలం 28 పరుగుల వ్యవధిలోనే తమ 10 వికెట్లను కోల్పోయి 55 పరుగులకే కుప్పకూలింది. మహిళల టీ20 అంతర్జాతీయ లీగ్ లో పాకిస్తాన్ కు ఇది అత్యల్ప స్కోరు కావడం గమనార్హం.

IND vs PAK: అందుకే చిత్తుగా ఓడాం: పాకిస్థాన్ కెప్టెన్

Also Read

IND vs PAK: అందుకే చిత్తుగా ఓడాం: పాకిస్థాన్ కెప్టెన్

ఈ పరాజయంలోనూ బౌలర్ గా ఫాతిమా సనా రాణించారు. 56 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ ను ఫాతిమా కొంతవరకు ఒత్తిడిలోకి నెట్టారు. షెఫాలీ వర్మతో పాటు ప్రతీకా రావల్, స్మృతి మంధాన వికెట్లను ఆమె తీయడంతో భారత్ 29 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. అయితే ఆ తర్వాత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, దీప్తి శర్మ బాధ్యతాయుతంగా ఆడి మరో వికెట్ పడకుండా జాగ్రత్తపడ్డారు. భారత్ 8.4 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి 57 పరుగులు చేసి 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

Story first published: Sunday, September 6, 2026, 13:41 [IST]
Other articles published on Sep 6, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+