For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అంతర్జాతీయ టీ 20ల్లో ఫస్ట్ ఫిఫ్టీ చేసిన ఇండియన్ ప్లేయర్ ఎవరో తెలుసా..?

Do you know who was first Indian batsman to score half-century in T20Is?
First Indian Batsman to Score Half Century in T20I's - Any Guesses ?

న్యూఢిల్లీ: సౌతాఫ్రికా వేదికగా జరిగిన తొలి టీ20 ప్రపంచకప్‌ను మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలో భారత జట్టు గెలుపొందిన విషయం తెలిసిందే. పాకిస్థాన్‌తో ఆద్యాంతం ఉత్కంఠగా సాగిన నాటి ఫైనల్లో అద్భుత విజయాన్నందుకున్న భారత్ విశ్వవిజేతగా నిలిచింది. ఇక ఈ మెగా టోర్నీలో విధ్వంసక బ్యాటింగ్‌తో చెలరేగిన భారత ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ భారత విజయాల్లో కీలక పాత్ర పోషించాడు.

6 బంతుల్లో 6 సిక్సర్లు..

6 బంతుల్లో 6 సిక్సర్లు..

ముఖ్యంగా ఇంగ్లండ్‌తో జరిగిన లీగ్ మ్యాచ్‌లో ఒకే ఓవర్‌లో ఆరు సిక్సులు బాది ప్రపంచ రికార్డును నెలకొల్పాడు. ఇంగ్లండ్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్‌ను బలిపశువును చేశాడు. ఫలితంగా 12 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసి మరో రికార్డు సృష్టించాడు. ఇక ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో 30 బంతుల్లోనే 70 పరుగులు చేసి భారత జట్టును ఫైనల్‌కు చేర్చాడు. అయితే యువరాజ్ సింగ్ విధ్యంసంలో ఓ అరుదైన రికార్డు కొట్టుకుపోయింది. యూవీ పరుగుల రికార్డుల ముందు నిలవలేకపోయింది.

ఇంతకీ ఆ రికార్డు ఏంటంటే.?

ఇంతకీ ఆ రికార్డు ఏంటంటే.?

అంతర్జాతీయ టీ20ల్లో తొలి హాఫ్ సెంచరీ చేసిన భారత బ్యాట్స్‌మన్ రికార్డు. ఇంతకీ ఎవరనుకుంటున్నారు? సెహ్వాగ్ లేదా యూవీనే కావచ్చు అనుకుంటున్నారా? అలా అనుకుంటే మీది పొరబాటే. ఈ రికార్డును సాధించింది.. వీరేంద్ర సెహ్వాగ్ లేక యువరాజ్ సింగ్‌ కాదు... రాబిన్ ఊతప్ప. అవును భారత్ తరఫున తొలి హాఫ్ సెంచరీ చేసింది అతనే. 2007 నుంచి 2015 వరకూ భారత్ తరఫున 13 అంతర్జాతీయ టీ20లు ఆడిన అతను ఈ అరుదైన ఘనతను అందుకున్నాడు.

అది కూడా పాకిస్థాన్‌పై

అది కూడా పాకిస్థాన్‌పై

అది కూడా చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై కావడం విశేషం. పైగా అతను ఆడిన తొలి టీ20లోనే హాఫ్ సెంచరీ సాధించడం మరో విశేషం. 2007 టీ-20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌తో జరిగిన లీగ్ మ్యాచ్‌లో తొలి ఆరు ఓవర్లలో భారత్ నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లోపడింది. ఈ నేపథ్యంలో ఊతప్ప(32 బంతుల్లో 4 ఫోర్లు 2 సిక్సర్లతో 50) అర్థ శతకం సాధించి.. జట్టును ఆదుకోవడంతో పాటు అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. షాహిద్ అఫ్రిది బౌలింగ్‌లో సింగిల్ తీసి ఫిప్టీ పూర్తిచేసుకున్న ఊతప్ప.. ఆ మరుసటి బంతికే క్యాచ్‌ ఔట్‌గా వెనుదిరిగాడు.

రైనా అంటే ధోనీకి ఇష్టం.. ఆ టైమ్‌లో నన్ను అనుమానించారు: యూవీ

మ్యాచ్ డ్రా.. బౌల్-ఔట్‌‌లో భారత్ గెలుపు..

మ్యాచ్ డ్రా.. బౌల్-ఔట్‌‌లో భారత్ గెలుపు..

ఊతప్ప హాఫ్ సెంచరీకి తోడు చివర్లో కెప్టెన్ ధోనీ (31 బంతుల్లో 33), (ఇర్ఫాన్ పఠాన్ 15 బంతుల్లో 20) రాణించడంతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 141 పరుగులు చేసింది. అనంతరం పాకిస్థాన్ కూడా 20 ఓవర్లలో 7 వికెట్లకు 141 పరుగులు చేయడంతో మ్యాచ్ టై అయింది. దీంతో బౌల్‌-ఔట్ విధానంలో భారత్ 3-0 తేడాతో విజయం సాధించింది. ఇక ఈ మ్యాచ్‌కు సంబంధించిన హైలైట్స్ ఇప్పటికీ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. కానీ భారత్ తరఫున ఫస్ట్ ఫిఫ్టీ చేసింది ఊతప్ప అనే విషయం మాత్రం తెలియకపోవడం గమనార్హం.

ఈ మ్యాచ్ అనంతరం ఊతప్ప ఆడిన 12 మ్యాచ్‌ల్లో మరో హాఫ్ సెంచరీ చేయలేకపోయాడు. ఇటీవల ఈ వెటరన్ క్రికెటర్ మాట్లాడుతూ.. ప్రపంచకప్ జట్టులో ఆడాలనే కల అలానే మిగిలిపోయిందని, కానీ తనకు రీ ఎంట్రీ అవకాశాలు లేవని చెప్పుకొచ్చాడు.

Story first published: Sunday, April 19, 2020, 18:28 [IST]
Other articles published on Apr 19, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+