ధోనీ కారణంగా ఓ భారత యువతితో పాక్ క్రికెటర్ 'డేటింగ్' క్యాన్సిల్!

న్యూఢిల్లీ: భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఇటీవలె అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. అతను రిటైర్మెంట్ ప్రకటించిన క్షణం నుంచి యావత్ క్రికెట్ ప్రపంచం మహీ గురించి, అతని సారథ్యం గురించి మాట్లాడుతోంది. ధోనీ అందించిన విజయాలను స్మరించుకుంటూ ప్రశంసల జల్లు కురిపిస్తుంది.తనదైన వ్యక్తిత్వం, ఆటతీరుతో భారత జట్టుకు ఎన్నో చిరస్మరణీయ విజయాలను అందించాడని, అతడో గొప్ప ఆటగాడే కాకుండా, అత్యుత్తమ ఫినిషర్, కెప్టెన్ అని మెచ్చుకుంటున్నారు.

పాక్ క్రికెటర్ డేట్ క్యాన్సల్..
అలాంటి ఆటగాడు.. అనుకోకుండా ఒక పాకిస్థాన్ క్రికెటర్ డేటింగ్ రద్దుకు కారణమయ్యాడని క్రిక్‌బజ్ తన కథనంలో పేర్కొంది. అది కూడా మహీ టీమిండియాకు ఎంపికవ్వకముందని, ఆ పాక్ క్రికెటర్ డేటింగ్‌కి వెళ్లాల్సింది కూడా ఓ భారత యువతితోనని రాసుకొచ్చింది. ధోనీ 2005లో జాతీయ జట్టుకు ఎంపికవ్వకముందు ఇండియా ఏ టీమ్‌లో ఆడాడు.

భారత్-ఏ ట్రై సిరీస్‌లో..
2004 కెన్యా పర్యటనలో పాకిస్థాన్ ఏ, భారత్ ఏ జట్లతో నిర్వహించిన ట్రై సిరీస్‌లో రెచ్చిపోయి ఆడి 360 పరుగులు చేశాడు. దాంతో సెలక్టర్ల దృష్టిలో పడి భారత జట్టుకు ఎంపికయ్యాడు. అయితే.. ఆ ట్రై సిరీస్‌లోనే పాకిస్థాన్‌తో ఆడిన ఓ మ్యాచ్‌లో మహీ సిక్సుల వర్షం కురిపించాడు. అదే సమయంలో లాంగ్ ఆన్‌లో ఫీల్డింగ్ చేస్తున్న ఓ పాకిస్థాన్ క్రికెటర్.. ఆ మ్యాచ్‌ను వీక్షించడానికి వచ్చిన ఓ భారత్ యువతిని పరిచయం చేసుకున్నాడు.

భారతీయ అమ్మాయిని ఫ్లట్ చేసి..
ఆమెను ఫ్లట్ చేసి ఆ మ్యాచ్ అయ్యాక ఆ యువతితో రెస్టారెంట్‌కు వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. అందుకు ఆమె కూడా అంగీకరించింది. కానీ ఇంతలోనే ధోనీ కొట్టిన ఓ భారీ సిక్సర్ నేరుగా వెళ్లి ఆమెకు తగిలింది. దీంతో ఆ యువతి గాయపడి ఆస్పత్రి పాలవ్వగా.. డేటింగ్ వెళ్లాలనుకున్న ఆ పాకిస్థాన్ క్రికెటర్ ఆశలు అడియాశలయ్యాయి. ఇది మహీ కావాలని చేయకపోయినా.. అనుకోకుండా జరిగిపోయిందని క్రిక్‌బజ్ తన కథనంలో పేర్కొంది.

అనంతరం ధోనీకి తిరుగులేదు..
ఆ ట్రై సిరీస్ తర్వాత ధోనీ భారత జట్టుకు ఎంపికయ్యాడు. తొలి మ్యాచ్ బంగ్లాదేశ్‌తో ఆడగా పరుగులేమీ చేయకుండానే రనౌటై గోల్డెన్ డకౌట్‌గా వెనుదిరిగాడు. అనంతరం పాకిస్థాన్‌తో వైజాగ్ వేదికగా జరిగిన వన్డేలో ఆకాశమే హద్దుగా చెలరేగి తన పేరును యావత్ క్రికెట్ ప్రపంచానికి తెలియజేశాడు. ఆ మ్యాచ్‌లో 148 పరుగులు బాదగా తర్వాత శ్రీలంకపై 183 పరుగులు చేశాడు. అక్కడి నుంచి ధోనీ వెనుతిరిగి చూసుకోవాల్సిన పరిస్థితి రాలేదు. ఇక 2007 నుంచీ 2017 వరకు పదేళ్లపాటు జట్టు సారథిగా కొనసాగడమే కాకుండా మూడు ఐసీసీ ట్రోఫీలు అందుకున్న ఏకైక కెప్టెన్‌గా చరిత్రకెక్కాడు.
మీకేమైనా పిచ్చా.. రోహిత్, ధోనీ ఫ్యాన్స్ ఫైటింగ్‌పై సెహ్వాగ్ ఫైర్!
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications