
భిన్నాభిప్రాయాలు..
అయితే ఈ విషయమై ప్రపంచ ఆటగాళ్లు రెండుగా చీలిపోయారు. అబ్బే.. ప్రేక్షకుల్లేకుండా ఏం అడుతామండీ.. వాళ్ల కేరింతలు.. అల్లరే కదా మనకు శక్తినిచ్చేదని కొందరంటే.. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజల ఆరోగ్యం దృష్ట్యా ఖాళీ మైదానల్లోనే ఆడటం ఉత్తమమని ఇంకొందరూ అభిప్రాయపడుతున్నారు.తాజాగా ప్రేక్షకులు లేకుండా మ్యాచ్‌లు నిర్వహణకు టీమిండియా వికెట్ కీపర్, కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్ దినేశ్ కార్తీక్ మద్దతుగా నిలిచాడు. మొత్తం ప్రేక్షకుల మధ్యే ఆడారా? అని ఈ ప్రతిపాదనను వ్యతిరేకించేవారిని ప్రశ్నించాడు. ఇంగ్లండ్ మహిళా క్రికెట్ జట్టు మాజీ మీడియం పేసర్, కామెంటేటర్ ఇసా గుహాతో ఇన్‌స్టా చాట్‌లో ఈ విషయంపై ముచ్చటించారు.

మనం ఎలా పెరిగాం..
ఇందుకు దేశీయ మ్యాచ్‌లనే ఉదాహరణగా తీసుకోవాలన్నాడు. ‘మనం దేశవాళీ మ్యాచ్‌లు ఆడుతున్నప్పుడు క్రికెట్ స్టేడియాల్లో అభిమానులు పెద్దగా ఉండరు. మనం ప్రేక్షకులు లేని ఖాళీ మైదానాల్లోనే క్రికెట్ ఆడుతూ పెరిగాం. ఇదేమీ మనకు కొత్త కాదు. ఇప్పుడేదో కొత్తగా ప్రేక్షకులు లేకుండా మ్యాచ్‌లు ఆడుతున్నట్లు చెబుతారెందుకు'అని ప్రశ్నించాడు.

మన కోసమే కామెంటర్లు కామెంట్ చేస్తారు..
ఇక ఆటగాళ్ల పట్ల కామెంటేటర్లు వ్యవహరిస్తున్న తీరుతో చాలా మంది బాధపడుతుంటారని కార్తీక్ తెలిపాడు. కానీ వారు మన గురించి మాట్లాడకపోతే మనలోని సత్తా ఎలా తెలుస్తుందన్నాడు. వ్యాఖ్యాతలు కేవలం నీ ఆట గురించి మాత్రమే మాట్లాడతారనే విషయం తెలుసుకోవాలన్నాడు. ఓ సందర్భంలో ప్రముఖ కామెంటేటర్ ఇయాన్ చాపెల్ మాటలను కార్తీక్ ప్రస్తావించాడు. ‘ఒక ప్లేయర్ చాపెల్ దగ్గరకొచ్చి తన గురించి ఎందుకు మాట్లాడతున్నారని అడిగాడు.. అప్పుడు చాపెల్ ఆడటం నీ డ్యూటీ.. మాట్లాడటం నా డ్యూటీ '' అని బదులిచ్చాడని కార్తీక్ గుర్తుచేసుకున్నాడు. అది నిజమేనని కామెంటేటర్‌లు మన కోసమే చెబుతారనే విషయం గ్రహించాలన్నాడు.

13 ఏళ్లుగా వెయిటింగ్..
తమ రాష్ట్రానికి చెందిన చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ తరఫున ఆడేందుకు 13 ఏళ్లుగా ఎదురుచూస్తున్నానని ఇటీవల క్రిక్‌బజ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో దినేశ్ కార్తీక్ చెప్పుకొచ్చాడు. ‘2008 ఐపీఎల్ సీజన్ వేలం తమిళనాడు ప్లేయర్‌గా నన్ను ఫస్ట్ కొనుగోలు చేస్తారనుకున్నా. కానీ నన్ను కాదని ధోనీని ఎంపిక చేశారు. అప్పుడు చాలా బాదేసింది. ఆ తర్వాతైనా ఎంపికచేస్తారని భావించా. ఇప్పటికీ 13 ఏళ్లుగా చెన్నై ఫ్రాంఛైజీ పిలుపు కోసం ఎదురుచూస్తున్నా'అని కార్తీక్ తన మనసులోని బాధను బయటపెట్టాడు.
మేం దేశం కోసం ఆడితే.. భారత క్రికెటర్లు వ్యక్తిగత రికార్డుల కోసం ఆడారు: పాక్ మాజీ క్రికెటర్


Click it and Unblock the Notifications












