న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

మీకు తెలుసా? వన్డే‌ల్లో రోహిత్ (264*) అత్యధిక స్కోర్ కాదంటా!!

Did you know? Rohit Sharma’s 264 is not the highest individual score in 50-over format
Rohit Sharma's 264 Is Not The Highest Individual Score In 50-Over Format

హైదాబాద్: వన్డేల్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ ఎవరిదంటే.. టక్కున టీమిండియా పరిమిత ఓవర్ల వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ పేరు చెబుతాం. వన్డేల్లోనే ఎవరికీ సాధ్యం కానీ రితీలో హిట్ మ్యాన్ మూడు డబుల్ సెంచరీలు సాధించాడు.

శ్రీలంకపై అతను ఆడిన 264 పరుగుల విధ్వంసక‌ర ఇన్నింగ్స్ యావత్ క్రికెట్ ప్రపంచానికి తెలుసు. ఇప్పటికీ ఆ మ్యాచ్ హిట్ మ్యాన్ అభిమానుల మదిలో మెదులుతుంది. ఈ ఇన్నింగ్స్‌తోనే అంతర్జాతీయ వన్డేల్లో రోహిత్‌ వ్యక్తిగత అత్యధిక స్కోర్ రికార్డు అందుకున్నాడు. అయితే ఓవరాల్‌గా చూసుకుంటే మాత్రం రోహిత్‌ది అత్యధిక స్కోర్ కాదంటా.!

2002లోనే ఇంగ్లండ్ ప్లేయర్..

2002లోనే ఇంగ్లండ్ ప్లేయర్..

ఇంగ్లండ్‌కు చెందిన అలిస్టెయిర్ బ్రౌన్ 18 ఏళ్ల క్రితమే 268 పరుగులతో ఈ ఘనతనందుకున్నాడు.- 2002 ఇంగ్లీష్ ట్రోఫీలో స‌ర్రే-గ్లామోర్గ‌న్ జ‌ట్ల మ‌ధ్య‌ జరిగిన మ్యాచ్‌లో అలిస్టెయిర్ విధ్వంసకర ఇన్నింగ్స్‌తో ఈ రికార్డు నమోదు చేశాడు.

చిన్న బౌండరీ.. చితక్కొట్టాడు...

చిన్న బౌండరీ.. చితక్కొట్టాడు...

అయితే సర్రే తరఫున బరిలోకి దిగిన అలిస్టెయిర్ ఇన్నింగ్స్ ఆరంభంలోనే స్లిప్‌లో ఇచ్చిన క్యాచ్‌ను ప్రత్యర్థి జట్టు జారవిడిచింది. అంతేకాకుండా 60 యార్డ్స్ ఆఫ్ సైడ్ బౌండరీని అలిస్టెయిర్ సద్వినియోగం చేసుకున్నాడు. చిన్న బౌండరీవైపే చితక్కొట్టాడు. 160 బంతుల్లో 12 సిక్సర్లు, 30 ఫోర్లతో వీరవిహారం చేశాడు.

గేల్.. నువ్వే నా క్వారంటైన్‌ పార్ట్‌నర్.. రమ్ తీసుకురావడం మర్చిపోకు: మహిళా క్రికెటర్

ప్రత్యర్థి కూడా..

ప్రత్యర్థి కూడా..

అలిస్టెయిర్ విధ్వంసకర ఇన్నింగ్స్‌తో స‌ర్రే 438 ప‌రుగుల‌ భారీ స్కోరు చేసింది. అనంతరం గ్లామోర్గాన్ జట్టు 428 పరుగులు చేసి, ప‌ది ప‌రుగుల‌ తేడాతో ఓడిపోయింది. దీంతో ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు 867 పరుగులు చేశాయి. ఇది 2000-01లో మద్రాస్ వేదికగా భారత్-ఎ, బి జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో నమోదైన 754/16 పరుగుల కన్నా ఎక్కువ. ఇక 268 పరుగులతో అలిస్టెయిర్ అప్పటి వరకు ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ల రికార్డు కలిగి ఉన్న సౌతాఫ్రికా ప్లేయర్ గ్రేమ్ పొలాక్(222), ఇంగ్లండ్ బ్యాట్స్‌మన్ అల్విన్ కాళీచరణ్(206) రికార్డులను అధిగమించాడు.

సచిన్ మొదలెట్టాడు..

సచిన్ మొదలెట్టాడు..

ఇక అంతర్జాతీయ వన్డేల్లో తొలి డబుల్ సెంచరీని భారత లెజెండరీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ సాధించాడు. 2010లో సౌత్ ఆఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో మాస్టర్ ఈ ఫీట్ అందుకున్నాడు. అనంతరం

వీరేంద్ర సెహ్వాగ్, రోహిత్ శర్మ, క్రిస్ గేల్, మార్టిన్ గుప్తిల్, ఫ‌ఖార్ జ‌మాన్‌లు వన్డేల్లో డబుల్ సెంచరీలతో చెలరేగారు. కాకపోతే రోహిత్ శర్మనే ట్రిపుల్‌ డబుల్‌ సాధించాడు.

Story first published: Thursday, March 26, 2020, 15:41 [IST]
Other articles published on Mar 26, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X