Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

India vs Australia: ఇది రహానే, పుజారాకు తాడోపేడో సిరీస్!

Deep Dasgupta says This could be a make-or-break series for Rahane and Pujara

న్యూఢిల్లీ: ఆస్ట్రేలియాతో జరగనున్న అప్‌కమింగ్ మూడు టెస్ట్‌లు టీమిండియా తాత్కలిక కెప్టెన్ అజింక్యా రహానే, స్టార్ బ్యాట్స్‌మన్ చతేశ్వర్ పుజారాకు చాలా కీలకమని మాజీ క్రికెటర్ దీప్ దాస్‌గుప్తాఅన్నాడు. ముఖ్యంగా విరాట్ కోహ్లీ గైర్హాజరీలో వీరు రాణించడం జట్టుకు వారి కెరీర్‌కు అత్యంత ముఖ్యమని అభిప్రాయపడ్డాడు. హీరోలు కావాలన్నా.. లేక జీరోలుగా మిగిలిపోవాలన్నా వారి ముందున్న ఏకైక అవకాశం ఇదేనన్నాడు.

 రహానే తడబాటు..

రహానే తడబాటు..

గత కొంత కాలంగా టెస్ట్ క్రికెట్‌లో రహానే తడబడుతున్నాడు. ఈ ఏడాది ఆడిన మూడు మ్యాచ్‌ల్లో 22 సగటుతో 133 పరుగులే చేశాడు. పుజారా కూడా 23.83 యావరేజ్‌తో 143 పరుగులకే పరిమితమయ్యాడు. ఇందులో 53 అత్యధికం. ఫామ్ లేకపోయినా టెస్ట్‌ల్లో రహానే వైస్ కెప్టెన్‌గా కొనసాగుతున్నాడు. పెటర్నీటీ లీవ్ మీద కెప్టెన్ విరాట్ కోహ్లీ భారత్‌కు తిరిగిరావడంతో మిగిలిన మూడు టెస్ట్‌లకు రహానే సారథ్యం వహించనున్నాడు. ఫస్ట్ టెస్ట్ దారుణ ఓటమి, కోహ్లీ గైర్హాజరీ నేపథ్యంలో సాధారణంగానే రహానేపై తీవ్ర ఒత్తిడి నెలకొంది. సిరీస్‌పై ఆశలు సజీవంగా ఉండాలంటే బాక్సింగ్ డే టెస్ట్‌లో తప్పక గెలవాలి.

 తాడో పేడో తేల్చుకోవాలి..

తాడో పేడో తేల్చుకోవాలి..

ఈ ఒత్తిడి అధిగమించి జట్టును ముందుండి నడిపించాలి. అలా చేయాలంటే బ్యాటింగ్‌లో సత్తా చాటాలి. ఈ క్రమంలో రహానే, పుజారాలకు ఇది చక్కని అవకాశమని దీప్ దాస్‌గుప్తాచెప్పుకొచ్చాడు. ‘అజింక్యా రహానే, చతేశ్వర్ పుజారాకు ఈ సిరీస్ చాలా కీలకం. ముఖ్యంగా ఈ విపత్కర పరిస్థితుల్లో వారు సత్తాచాటాల్సిన అవసరం ఉంది. గత కొంత కాలంగా నిలకడలేమి ఆటతో ఇబ్బంది పడుతున్న రహానేకు ఈ సిరీస్ అగ్నిపరీక్షలాంటిది. అతను రెండు, మూడేళ్లుగా సెంచరీలు చేయకపోయినా మంచి గేమ్‌లు ఆడాడు. ఇప్పుడు తాడో పేడో తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. పుజారాది కూడా అలాంటి పరిస్థితినే'అని దీప్ దాస్ గుప్తా ఓ చానె‌ల్‌తో మాట్లాడుతూ పేర్కొన్నాడు.

రెండు మ్యాచ్‌ల్లో విజయం..

రెండు మ్యాచ్‌ల్లో విజయం..

ఇప్పటి వరకు రహానే రెండు టెస్ట్‌ మ్యాచ్‌లకు సారథ్యం వహించగా ఈ రెండింటిలో భారత్ గెలవడం సానుకూలాంశం. పైగా ఈ మ్యాచ్‌ల్లో రహానే బ్యాటింగ్ సగటు 47 ఉండటం విశేషం. విదేశాల్లో మెరుగైన సగటు ఉన్న ఇండియన్ బ్యాట్స్‌మెన్‌లో రహానే ముందు వరుసలో ఉంటాడు. అయితే ఫస్ట్ టెస్ట్‌లో 36 పరగుల స్వల్ప స్కోర్‌కే పరిమితమైన పరువు తీసుకున్న భారత్ జట్టుపై తీవ్ర ఒత్తిడి నెలకొంది. ఈ పరిస్థితుల్లో కోహ్లీ లేని భారత్ రహానే సారథ్యంలో ఎలా రాణిస్తుందో అనేది ఆసక్తికరంగా మారింది. మెల్‌బోర్న్‌లో మెరిసి పోటీలో నిలుస్తుందా? లేక ఫస్ట్ టెస్ట్ మాదిరి చేతులెత్తెస్తుందో చూడాలి!

Yearender 2020: క్రికెట్ ఫ్యాన్స్‌ను ఏడిపించిన ఘటనలు!

Story first published: Wednesday, December 23, 2020, 19:20 [IST]
Other articles published on Dec 23, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+