అలా చేస్తే బౌలర్లకు కష్టమే: దీప్‌దాస్ గుప్తా

న్యూఢిల్లీ: క్రికెట్ మ్యాచ్‌ల సందర్భంగా బంతి మెరుపును మరింత పెంచేందుకు... రివర్స్ స్వింగ్ రాబట్టేందుకు బౌలర్లు ఉమ్మి (సెలైవా)ని ఉపయోగిస్తుంటారు. అయితే ఉమ్మి ద్వారా కూడా కరోనా వైరస్ వ్యాప్తి చెందే ప్రమాదం ఉండటంతో.. ఇక మీదట మ్యాచ్‌ల సందర్భంగా బౌలర్లు ఉమ్మిని బంతిపై రుద్దకుండా అనిల్ కుంబ్లే నేతృత్వంలోని అంతర్జాతీయ క్రికెట్ కమిటీ ఐసీసీకి సిఫారసు చేసింది. అయితే ఈ నిర్ణయాన్ని భారత మాజీ వికెట్‌కీపర్ దీప్ దాస్‌గుప్తా వ్యతిరేకించారు. ఉమ్మిని నిషేదిస్తే బౌలర్లకు కష్టాలు ఎదురవుతాయన్నాడు. ఉమ్మిని వాడటం అనేది బౌలర్ల అస్త్రాలలో భాగమని ఇండియా టూడేతో మాట్లాడుతూ అన్నాడు.'ఉమ్మి ఉపయోగించడం బౌలర్లకు చాలా ముఖ్యం. అది వారి బౌలింగ్ అస్త్రాలలో భాగం. ఆ కోణం నుంచి చూస్తే ఇది పెద్ద విషయం. కాబట్టి ఐసీసీ క్రికెట్ కమిటీ నిర్ణయాన్ని బౌలర్లు ఎలా స్వీకరిస్తారో చూడాలి.'అని ఈ మాజీ వికెట్ కీపర్ చెప్పుకొచ్చాడు.

రెండు కొత్త బంతులు తెచ్చినా..
ఇక ఉమ్మి నిషేధిస్తే ప్రత్యామ్నాయంగా టెస్ట్‌ల్లో రెండు కొత్త బంతులను ఉపయోగించాలని భారత సీనియర్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ సూచించాడు.ఇక క్రికెట్ ఆస్ట్రేలియా మాత్రం బంతుల్లో క్రిమిసంహారక మందులను వాడలని ఆలోచిస్తుంది. దీనికోసం ఐసీసీ అనుమతి కూడా కోరింది. ఈ సలహాలపై కూడా స్పందించిన దీప్ దాస్‌గుప్తా.. దాని వల్ల కూడా ప్రయోజం తక్కువనేని అభిప్రాయపడ్డాడు. ‘సెలైవా అనేది బహుముఖ సాధనం. అది స్పిన్నర్లకు, పేసర్లకు ఉపయోగపడుతుంది. రెండు బంతులు తీసుకోవాలంటున్నారు. దీనివల్ల పేసర్లతో పాటు స్పిన్నర్లు కొంత మేలు జరుగుతుందని అర్థం చేసుకోగలను. కానీ వీదేశీ పిచ్‌లపై స్పిన్నర్లు పరిస్థితి ఏంటి? 'అని ఈ మాజీ వికెట్ కీపర్ ప్రశ్నించాడు.

ఉమ్మిని రిప్లేస్ చేయలేం..
ఉమ్మిని రిప్లేస్ చేసేది ఏది లేదని దీప్‌దాస్ స్పష్టం చేశాడు. అది మ్యాచ్‌లో కీలక పాత్ర పోషిస్తుందన్నాడు. ‘సెలైవాను రిప్లేస్ చేయడం చాలా కష్టం. బంతి సాధారణ స్వింగ్‌తో పాటు రివర్స్ స్వింగ్ చేయడానికి అది ఎంతో ఉపయోగపడుతుంది. స్పిన్నర్లకు కూడా బంతిపై పట్టు చిక్కెలా చేస్తుంది. అలాంటి ఉమ్మి వాడకాన్ని నిషేధిస్తే బౌలర్లకు కష్టాలు తప్పవు. సెలైవాను రిప్లేస్ చేసేది ఏది లేదనుకుంటున్నా.
ఉమ్మి నిషేధం నిర్ణయం బ్యాట్స్‌మన్, వికెట్ కీపర్లపై ఎలాంటి ప్రభావం ఉందు. దీని వాడకం క్రికెట్ చాలా ముఖ్యం. మాములుగా బ్యాట్స్‌మన్ కొట్టిన బంతి ఫీల్డర్ చేతిలో పడగానే.. అతను తన లాలాజలంతో బంతిని షైన్ చేస్తాడు. ఇది మైదానంలో ప్రతీ ఆటగాడు సహజంగా చేసే ప్రక్రియ. క్రీడల్లో దీని ప్రభావం చాలా ఎక్కువ. అలాంటి పద్దతిని ఒక్కసారిగా తొలగిస్తే మైదానంలో పరిస్థితులు కఠినంగా మారనున్నాయి.'అని ఈ మాజీ క్రికెటర్ చెప్పుకొచ్చాడు.

బౌలర్లు ఆట కోల్పోతారు: హర్భజన్
ఇలా ఉమ్మి వాడకంపై నిషేధం విధించడం, ఆటను బౌలర్లకు దూరం చేయడమేనని హర్భజన్ సింగ్ విమర్శించాడు. ‘చెమటతో బంతిని తుడిచినా.. ఉమ్మితో తుడిస్తే వచ్చే షైన్ రాదు. ముఖ్యంగా ఉపఖండంలోని పరిస్థితుల్లో ఉమ్మి వాడకం తప్పనిసరి' అని హర్భజన్ పేర్కొన్నాడు.
సర్ఫరాజ్ ఖాన్ పెద్ద మనసు.. వలస కూలీలకు ఫుడ్ ఫ్యాకెట్స్ అందిస్తున్న యువ క్రికెటర్
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications