For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కేఎల్ రాహుల్ అసభ్య పదజాలం.. ‘ముందుకు రారా లౌ**’అంటూ ఫీల్డర్‌పై ఫైర్!

DC vs KXIP: KL Rahul caught on the stump mic hurling abuse in Kannada

దుబాయ్: ఓవైపు మార్కస్ స్టోయినిస్(21 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లతో 53), మరోవైపు మయాంక్ అగర్వాల్(60 బంతుల్లో 89, 7 ఫోర్లు, 4 సిక్సర్లతో 89) ధాటిగా ఆడటంతో కింగ్స్ ఎలెవన్ పంజాబ్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన మ్యాచ్ టైగా ముగిసి సూపర్ ఓవర్‌కు దారి తీసింది. ఇక సూపర్ ఓవర్ స్పెషలిస్ట్ రబడా రఫ్ఫాడించడంతో ఢిల్లీ క్యాపిటల్స్ థ్రిల్లింగ్ విక్టరీ అందుకుంది. సూపర్ ఓవర్‌లో వరుస బంతుల్లో రెండు వికెట్లు తీసిన రబడా.. చేజారిపోయిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌‌కు అద్భుత విజయాన్నందించాడు. మొత్తానికి ఈ మ్యాచ్‌తో అభిమానులకు కావాల్సిన మజా లభించింది.

అయితే ఈ మ్యాచ్‌లో కింగ్స్ పంజాబ్ కెప్టెన్ కేఎల్ రాహుల్ అసభ్య పదజాలం ఉపయోగించడం చర్చనీయాంశమైంది. కన్నడ భాషలో అతను మాట్లాడిన మాటలు స్టంప్‌మైక్‌లో రికార్డు అయ్యాయి. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట హల్‌చల్ చేస్తోంది.

ఇంతకేం జరిగిందంటే..

అయితే ఏ ఓవర్‌లో జరిగిందనేదానిపై క్లారిటీ లేనప్పటికీ.. తన సూచనలను పట్టించుకోని ఫీల్డర్‌పై రాహుల్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు వీడియో ద్వారా తెలుస్తోంది. ఫీల్డింగ్‌లో ముందుకు రమ్మని చెప్పినా సదరు ఫీల్డర్ వినిపించుకోకపోవడంతో చిర్రెత్తుకుపోయిన రాహుల్.. ‘ముందుకు రారా లౌ**' అంటూ కన్నడంలో తిట్టాడు. ఈ మాటలు స్టంప్స్ మైక్‌లో స్పష్టంగా రికార్డు అయ్యాయి. కన్నడలో తిట్టాడు కాబట్టి.. చివాట్లు తిన్న ఆ ఫీల్డర్ మయాంక్ అగర్వాల్, కరణ్ నాయర్‌, కృష్ణప్ప గౌతమ్‌లో ఎవరో ఒకరై ఉండాలి. ఆ జట్టులో కన్నడ వచ్చిన ఆటగాళ్లు ఈ ముగ్గురే.

ఖాళీ మైదానాలు కావడంతో..

ఖాళీ మైదానాలు కావడంతో..

ఇక గతంలో కూడా రాహుల్ మైదానంలో ఇలాంటి అసభ్య పదజాలాన్ని ఉపయోగించాడు. కాకపోతే అప్పుడు మ్యాచ్‌లు కిక్కిరిసిన మైదానంలో జరగడంతో అతని వ్యాఖ్యలు స్పష్టంగా రికార్డు అవ్వలేదు. కానీ తాజా ఐపీఎల్‌ ఖాళీ మైదానాల్లో జరుగుతుండటంతో ఆటగాళ్లు మైదానంలో మాట్లాడుతున్న మాటలు స్టంప్స్ మైక్‌లో రికార్డు అవుతున్నాయి. పైగా వికెట్ కీపర్‌గా రాహుల్ స్టంప్స్ వెనుకే ఉండటంతో అతని ప్రతీ మాట రికార్డు అయ్యే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలని అతని ఫ్యాన్స్ సూచిస్తున్నారు. లేకుంటే మరో కాఫీ విత్ కరణ్ షో‌లా రోస్ట్ అవుతావని హెచ్చరిస్తున్నారు.

థ్రిల్లింగ్ మ్యాచ్

థ్రిల్లింగ్ మ్యాచ్

ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 157 పరుగులు చేసింది. పంజాబ్ బౌలర్ల ధాటికి ఆ జట్టు ఓ దశలో 120 పరుగులకే పరిమితమవుతుందా? అనిపించింది. కానీ చివర్లో స్టోయినిస్( 21 బంతుల్లో 7ఫోర్లు, 3 సిక్స్‌లతో 53 ) సూపర్ ఫిఫ్టీతో మెరుపులు మెరిపించడంతో పోరాడే లక్ష్యాన్ని ప్రత్యర్థి ముందు ఉంచింది. ఆఖరి ఓవర్‌లోనే ఆ జట్టు 30 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య చేధనకు దిగిన కింగ్స్ పంజాబ్.. మయాంక్ అగర్వాల్(60 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్స్‌లతో 89) వీరోచిత ఇన్నింగ్స్‌తో నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లకు 157రన్స్ చేయడంతో మ్యాచ్ టై అయి సూపర్ ఓవర్‌కు దారి తీసింది. ఓటమి దశ నుంచి గెలుపు ముంగిట నిలిపిన మయాంక్ ఆ లాంఛనాన్ని మాత్రం పూర్తి చేయలేకపోయాడు. సూపర్ ఓవర్‌లో రబడ దెబ్బకు రెండు పరుగులకే పరిమితమైన ఆ జట్టు.. ఓటమికి తలవంచింది.

నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు తీసిన పాక్ బౌలర్! (వీడియో)

Story first published: Monday, September 21, 2020, 15:10 [IST]
Other articles published on Sep 21, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+