Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు తీసిన పాక్ బౌలర్! (వీడియో)

Watch Shaheen Afridi four wickets in four balls, all of them bowled

లండన్: పాకిస్థాన్ స్టార్ పేసర్ షాహిన్ అఫ్రిది తన సూపర్ బౌలింగ్‌తో యావత్ క్రికెట్ ప్రపంచాన్ని ఆకట్టుకున్నాడు. నిప్పులు చెరిగే బంతులతో ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను హడలెత్తించాడు. నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు తీసి రికార్డు సృష్టించాడు. ఇంగ్లండ్‌ కౌంటీ క్రికెట్‌లో భాగంగా హాంప్‌షైర్‌, మిడిల్సెక్స్‌ మధ్య ఆదివారం జరిగిన టీ20 మ్యాచ్‌‌లో ఈ సంచలన ప్రదర్శనను నమోదు చేశాడు.

ఈ మ్యాచ్‌లో హాంప్‌షైర్‌కు ప్రాతినిథ్యం వహించిన షాహీన్‌ (6/19) 6 వికెట్లతో ప్రత్యర్థి పతనాన్ని శాసించాడు. అతను వేసిన 18 ఓవర్‌లో చివరి నాలుగు బంతుల్లో వరుసగా
జాన్‌ సింప్సన్‌, స్టీవెన్‌ ఫిన్‌, తిలాన్‌, టిమ్‌ ముర్తాఘ్‌ను పెవిలియన్‌ చేర్చి అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. అఫ్రిది దెబ్బకు మిడిల్సెక్స్‌ బ్యాటింగ్‌ లైనప్‌ కుప్పకూలింది.

తొలుత బ్యాటింగ్‌ చేసిన హాంప్‌షైర్‌ నిర్ణీత 20 ఓవర్లకు 9 వికెట్లు కోల్పోయి 141పరుగులు చేసింది. చేజింగ్‌లో మిడిల్సెక్స్‌ బ్యాట్స్‌మెన్‌ తడబడటంతో 121 పరుగులు మాత్రమే చేసి ఓటమిపాలైంది. అద్భుత ప్రదర్శన కనబర్చిన షాహీన్‌ అఫ్రిదికి మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ దక్కింది. కాగా.. పాకిస్థాన్‌ తరఫున టీ20ల్లో వరుసగా బంతుల్లో 4 వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా షాహీన్‌ రికార్డు సృష్టించాడు.

ఓవరాల్‌గా మూడో బౌలర్‌. షాహిన్ అఫ్రిదికి ముందు శ్రీలంక స్టార్ పేసర్ లసిత్‌ మలింగ, అఫ్గానిస్థాన్‌ స్పిన్నర్‌ రషీద్‌ఖాన్‌ ఈ ఘనత సాధించారు. ఇక షాహిన్.. నాలుగు వికెట్లలో నాలుగు క్లీన్‌ బౌల్డ్‌లే కావడం విశేషం. అంతేకాకుండా అతను ఈ మ్యాచ్‌లో తీసిన 6 వికెట్లకు 6 క్లీన్ బౌల్డ్ కావడం గమనార్హం. అద్భుత రికార్డు అందుకున్న షాహిన్‌ను ఐసీసీ కొనియాడుతూ ట్వీట్ చేసింది. ఈ ఫీట్‌కు సంబంధించిన వీడియో హాంప్ షైర్ ట్విటర్‌లో షేర్ చేయగా నెట్టింట హల్ చేస్తోంది.

Story first published: Monday, September 21, 2020, 13:52 [IST]
Other articles published on Sep 21, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+