Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

డేవిడ్ వార్నర్ ఐపీఎల్ ఆల్‌టైమ్ ఎలెవన్‌.. యూవీకి దక్కని చోటు!

David Warner ignores Lasith Malinga, Yuvraj Singh in his all-time IPL XI

హైదరాబాద్: కరోనా లాక్‌డౌన్‌తో ఇంటికే పరిమితమైన ఆస్ట్రేలియా విధ్వంసకర బ్యాట్స్‌మన్, సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ సోషల్ మీడియాలో కాలాక్షేపం చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే టిక్‌టాక్‌లోకి కూడా అడుగుపెట్టిన ఈ విధ్వంసకర ఓపెనర్.. రోజుకో వీడియోతో అభిమానులను అలరిస్తున్నాడు. ఇటివలే తెలుగు సూపర్ హిట్ 'బుట్టబొమ్మా సాంగ్'కు సతీమణితో కలిసి స్టెప్పులేసిన వార్నర్.. ఆ మూవీ హీరో అల్లు అర్జున్ ప్రశంసలతో పాటు తెలుగు ప్రజల మనసును దోచుకున్నాడు. ఇలా రోజుకో వీడియో వార్తలతో నిలుస్తున్న వార్నర్ తాజాగా తన ఐపీఎల్ అత్యుత్తమ జట్టు ప్రకటించాడు.

ముగ్గురే.. ఆ ముగ్గురు ఆసీసే..

ముగ్గురే.. ఆ ముగ్గురు ఆసీసే..

11 మంది సభ్యులతో ప్రకటించిన ఈ జట్టులో వార్నర్ ముగ్గురు ఓవర్సీస్ ప్లేయర్లనే ఎంపిక చేశాడు. ఆ ముగ్గురు కూడా ఆస్ట్రేలియా ప్లేయర్లే కావడం గమనార్హం. ఇక తన అత్యుత్తమ జట్టులో భారత విధ్వంసకర ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్‌ను ఎంపికచేయలేదు. అంతేకాకుండా అత్యంత ప్రభావితమైన స్టార్ పేసర్ లసిత్ మలింగాకు చోటు ఇవ్వలేదు. ఆశ్చర్యకరంగా 2015 నుంచి ఐపీఎల్ ఆడనటువంటి మిచెల్ స్టార్క్‌ను ఆల్‌టైమ్ టీమ్‌లోకి తీసుకున్నాడు.

కోహ్లీ, రోహిత్, ధోనీ..

కోహ్లీ, రోహిత్, ధోనీ..

భారత స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ, తనను ఓపెనర్లుగా ఎంచుకున్న వార్నర్.. మిడిలార్డర్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, సీనియర్ బ్యాట్స్‌మన్ సురేశ్ రైనాలను తీసుకున్నాడు. 5412 పరుగులతో కోహ్లీ టోర్నీ టాప్ స్కోరర్‌గా ఉండగా.. రైనా(5368)తో తర్వాతి స్థానంలో ఉన్న విషయం తెలిసిందే. హార్దిక్ పాండ్యా, గ్లేన్ మ్యాక్స్ వెల్‌లను ఆల్‌రౌండర్‌గా ఎంపికచేశాడు. తన ప్రారంభ సీజన్‌ నుంచి పాండ్యా అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నాడు. 2014,2017 సీజన్లలో అదరగొట్టిన మ్యాక్స్‌వెల్ ఇతర సీజన్లలో మాత్రం విఫలమయ్యాడు. ఏడో స్థానంలో భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీని తీసుకున్నాడు.

వేలంలోకి కూడా రాని స్టార్క్..

వేలంలోకి కూడా రాని స్టార్క్..

ఆశ్చర్యకరంగా ఐపీఎల్‌ మొత్తంలో కేవలం 27 మ్యాచ్‌లు ఆడిన మిచెల్ స్టార్క్‌ను బౌలర్‌గా ఎంచుకున్నాడు. ఈ సీజన్ ఐపీఎల్ వేలంలో కూడా స్టార్క్ తన పేరు ఇవ్వలేదు. 2018లో ఎంపికైనా గాయంతో ఒక్కమ్యాచ్ ఆడకుండానే దూరమయ్యాడు. జస్‌ప్రీత్ బుమ్రా, ఆశిష్ నెహ్రా పేస్‌దళంలోకి తీసుకున్న వార్నర్.. స్పిన్నర్లుగా కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చహల్‌లకు ఓటేశాడు. జట్టును ఎంపిక చేసిన ఈ ఆసీస్ ఆటగాడు.. కెప్టెన్ ఎవరో మాత్రం చెప్పలేదు.

వార్నర్ ఆల్‌టైమ్ ఎలెవన్:

వార్నర్ ఆల్‌టైమ్ ఎలెవన్:

డేవిడ్ వార్నర్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, సురేశ్ రైనా, హార్దిక్ పాండ్యా, గ్లేన్ మ్యాక్ వెల్, ఎంఎస్ ధోనీ, మిచెల్ స్టార్క్, ఆశిష్ నెహ్రా, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చహల్

ఐదు టెస్ట్‌ల సిరీస్ సూపర్‌గా ఉంటుంది..

ఐదు టెస్ట్‌ల సిరీస్ సూపర్‌గా ఉంటుంది..

ఈ ఏడాది చివర్లో ఆస్ట్రేలియాకు రానున్న భారత జట్టుతో నాలుగు కాకుండా ఐదు టెస్టులతో సిరీస్​ నిర్వహిస్తే అద్భుతంగా ఉంటుందని డేవిడ్ వార్నర్ అన్నాడు. క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ) సైతం రెండు వారాల క్రితం ఈ ప్రతిపాదనను తెరమీదకు తెచ్చింది. దీనికి మద్దతు తెలిపిన వార్నర్... సిరీస్​లో ఐదు టెస్టులు ఉంటే పోటీ మరింత రసవత్తరంగా, సవాల్​గా ఉంటుందని అన్నాడు.

"ఐదు టెస్టుల సిరీస్​ కచ్చితంగా అద్భుతంగా ఉంటుంది. పోటీ మంచి రసవత్తరంగా జరుగుతుంది. అదే భారత్​లో అయితే మూడు టెస్టుల సిరీస్​ అంటేనే చాలా సవాల్​తో కూడుకున్నది. ఎందుకంటే అక్కడ కొన్నిచోట్ల దాదాపు ఉష్ణోగ్రత 45డిగ్రీల వరకు నమోదవుతూ ఉంటుంది" అని వార్నర్ చెప్పాడు.

పాకిస్థాన్ క్రికెటర్‌తో ఎఫైర్ అంటూ తమన్నాపై తప్పుడు ప్రచారం.!

Story first published: Thursday, May 7, 2020, 13:58 [IST]
Other articles published on May 7, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+