మహేశ్ బాబు ఫ్యాన్స్‌కు బిగ్ సర్‌ప్రైజ్ అంటున్న వార్నర్!

సిడ్నీ: ఆస్ట్రేలియా విధ్వంసకర ఓపెనర్, సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్‌పై రేపు మహేశ్ బాబు ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్ ఇస్తానంటున్నాడు. కరోనాతో ఇంటికే పరిమితమైన ఈ ఆసీస్ క్రికెటర్ టిక్‌టాక్‌లో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా తెలుగు డైలాగ్స్, పాటలతో అభిమానుల ఉర్రూతలూగిస్తున్నాడు. సతీమణి క్యాండిస్‌తో కలిసి అదరగొడుతున్నాడు.
అలవైకుంఠపురం మూవీలోని 'రాములో రాములా'తో మొదలెట్టి 'బుట్టబొమ్మ'తో అదరగొట్టి.. పోకిరి, బాహుబలి డైలాగ్స్‌తో మెప్పించి తెలుగు ఫ్యాన్స్‌ను ఉర్రూతలూగిస్తున్నాడు. దాదాపు అందరి హీరోలను కవర్ చేసిన వార్నర్.. అందరివాడయ్యాడు. దీంతో ఆయా హీరోల అభిమానులు వార్నర్‌కు స్పెషల్ రిక్వెస్ట్‌లు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ కోరిక మేరకు పక్కా లోకల్ సాంగ్‌తో బర్త్‌డే విషెస్ చెప్పి వారిని ఆనందంలో ముంచెత్తాడు.
View this post on InstagramA post shared by David Warner (@davidwarner31) on
మైండ్ బ్లాక్ పార్డ్-1 రేపే..
అనంతరం మహేశ్ బాబు ఫ్యాన్స్ విజ్ఞప్తి మేరకు సరిలేరు నీకెవ్వరులోని 'మైండ్‌బ్లాక్' పాటకి టిక్-టాక్ చేసి అలరించాడు. అయితే ఆ పాటలోని లిరిక్స్‌కు మాత్రమే వార్నర్ టిక్ టాక్ చేయడంతో ఫ్యాన్స్ మరోసారి కాస్ట్యూమ్స్‌తో కావాలని కోరారు. దీంతో ఆ పాటకు సంబంధించిన పార్ట్1ను రేపు(శనివారం) విడుదల చేయనున్నట్లు వార్నర్ ప్రకటించాడు.
అయితే ‘మైండ్ బ్లాక్' సాంగ్‌కు టిక్‌టాక్ అని చెప్పకుండా సర్‌ప్రైజ్ అంటూ ఆ పాటకు సంబంధించిన స్టెప్పులతో చిన్న హింట్ ఇచ్చాడు. దీంతో వార్నర్ తర్వాత టిక్‌టాక్ ‘మైండ్ బ్లాక్'అని అభిమానులు ఫిక్సయ్యారు.
వార్నర్ నీ దేవ సేన ఎక్కడ..
ఇక ‘బాహుబలి' చిత్రంలోని ప్రభాస్ ఫోటోను, ఆ గెటప్‌లోని తన ఫొటోను పక్కపక్కన పెట్టి ఇద్దరిలో ఎవరి కాస్ట్యూమ్ ప్రిఫెర్ చేస్తారు అని ప్రశ్నించాడు. దీంతో నెటీజన్స్ ఎవరి స్టయిల్లో వాళ్ళు కామెంట్ చేస్తున్నారు. కొందరు వార్నర్ కి సపోర్ట్ చేస్తుంటే మరికొందరు బాహుబలిని నువ్వు మించలేవు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇంకొందరూ.. ‘దేవసేన ఎక్కడ', ‘టాలీవుడ్‌లో హీరోగా ఎందుకు ట్రై చేయడం లేదు', ‘ప్రభాస్ ఇండియా బాహుబలి, వార్నర్ ఆస్ట్రేలియా బాహుబలి'అని సరదాగా వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు.

ఆ విజయాన్ని గుర్తు చేసుకున్న వార్నర్
ఇక నాలుగేళ్ల క్రితం సరిగ్గా ఇదే రోజు(2016 మే 29) డేవిడ్ వార్నర్ సారథ్యంలో సన్ రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడింది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన నాటి ఉత్కంఠకర ఫైనల్లో వార్నర్ అద్భుత ప్రదర్శనతో చాంపియన్‌గా నిలిచింది. ఈ విజయానికి నేటితో నాలుగేళ్లు పూర్తయిన సందర్భంగా ఈ మధుర క్షణాన్ని వార్నర్ నెమరవేసుకున్నాడు. ట్రోఫీ అందుకున్న ఫొటోను షేర్ చేస్తూ.. ‘ఈ విజయంలో భాగమైన ప్రతీ ఒక్కరి గురించి గర్వంగా ఫీలవుతున్నా'అని క్యాప్షన్‌గా పేర్కొన్నాడు.

రష్మిక ఫిదా..
ఇక వార్నర్ మైండ్ బ్లాక్ టిక్‌టాక్‌కు ఆ మూవీ హీరోయిన్ రష్మిక మందన్న ఫిదా అయిన విషయం తెలిసిందే. ముఖ్యంగా తన లిరిక్స్‌కు వార్నర్ టిక్ టాక్ చేయడంపై సంతోషం వ్యక్తం చేసింది. తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఈ సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్‌ను కొనియాడింది. అంతేకాకుండా ఆ వీడియోకు వార్నర్ ఇచ్చిన క్యాప్షన్ చదివితే నవ్వు ఆగడంలేదని తన ఫాలోవర్స్‌కు తెలిపింది. ‘డేవిడ్ వార్నర్ చంపేసావ్‌పో.. క్యాప్షన్ చదవుతుంటే నవ్వు ఆగడం లేదు'అని రాసుకొచ్చింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications
వలస కూలీల కోసం వంటవాడిగా మారిన సెహ్వాగ్!