Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అతనిలా మ్యాచ్‌లు ముగించాలనుకుంటున్నా: డేవిడ్ మిల్లర్

David Miller lavishes praise on MS Dhoni ahead of IPL 2020

దుబాయ్‌: భారత మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ సారథి మహేంద్ర సింగ్ ధోనీపై రాజస్థాన్ రాయల్స్ ప్లేయర్ డేవిడ్ మిల్లర్ ప్రశంసల జల్లు కురిపించాడు. తీవ్ర ఒత్తిడిలో కూడా ధోనీ మ్యా‌చ్‌లను ప్రశాంతంగా ముగిస్తాడని, అతని ఆట తీరు తనకెంతో ఇష్టమని ఈ సౌతాఫ్రికా ప్లేయర్ చెప్పాడు. అతనిలా మ్యాచ్‌లను ముగించేందుకు తానూ ప్రయత్నిస్తానని పేర్కొన్నాడు. మహీ నైపుణ్యాలు అద్భుతమని కొనియాడాడు. మహీ అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమైనా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో మెరుపులు మెరిపిస్తాడన్నాడు.

ధోనీలా ఆడేందుకు ప్రయత్నిస్తా..

ధోనీలా ఆడేందుకు ప్రయత్నిస్తా..

ఐపీఎల్‌లో గత ఎనిమిదేళ్లు కింగ్స్‌ ఎలెవన్ పంజాబ్‌కు ఆడిన మిల్లర్‌ ఈ సారి రాజస్థాన్‌ రాయల్స్‌ తరఫున బరిలోకి దిగుతున్నాడు. జట్టుతో యూఏఈలో ఉన్న మిల్లర్ నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నాడు. మరో 5 రోజుల్లో క్యాష్ రిచ్ లీగ్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఓ చానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చాడు.

‘ధోనీ ఆడే విధానం, అతని సారథ్యం నాకెంతో ఇష్టం. ముఖ్యంగా అతని ప్రశాంతత. అతనెప్పుడూ నియంత్రణలోనే ఉన్నట్టు అనిపిస్తుంది. ధోనీ తనను తాను ప్రదర్శించుకొనే తీరు అద్భుతం. అతనిలో నాకు ఎక్కువగా నచ్చేదీ అదే. మహీలాగే ఉత్సాహంగా ఆడేందుకు నేనూ ప్రయత్నిస్తా' అని మిల్లర్‌ అన్నాడు.

ధోనీలా మ్యాచ్‌లు ముగించాలని..

ధోనీలా మ్యాచ్‌లు ముగించాలని..

‘మిగతా బ్యాట్స్‌మెన్‌లాగే అతనికి బలాబలహీనతలు ఉంటాయి. మహీలాగా బ్యాటింగ్‌ చేయాలనుకోవడం కన్నా అతడి చేజింగ్‌ను చూసి ఆశ్చర్యపోతుంటా. అతనిలా మ్యాచులు ముగించాలన్నదే నా తాపత్రయం. ఏ ఆటగాడికైనా సొంత శైలి ఉంటుంది. అందుకు తగ్గ టెక్నిక్‌ ఉంటుంది. అయితే, నాకు నేను రేటింగ్‌ ఇచ్చుకొని ఏదో ఒక విభాగంలోకి నన్ను చేర్చుకోలేను. కెరీర్‌ సాంతం ముగిశాక అప్పుడు గణాంకాలను బట్టి నిర్ణయం తీసుకోవచ్చు. ఏదేమైనప్పటికీ ధోనీ అత్యుత్తమ ఫినిషర్‌. అదెన్నోసార్లు నిరూపించుకున్నాడు. అతడు ఆడుతుంటే చూసేందుకు ఇష్టపడతాను' అని మిల్లర్‌ పేర్కొన్నాడు.

రెండు మూడేళ్లుగా బాగా ఆడలేదు..

రెండు మూడేళ్లుగా బాగా ఆడలేదు..

‘గత రెండు మూడేళ్లుగా అత్యుత్తమంగా ఆడలేకపోయా. అందుకే మ్యాచులు గెలిపించలేకపోయా. ప్రస్తుతం నా ఫామ్ బాగుంది. అనుభవం వచ్చింది. ఏం చేయాలో ఎలా ఆడాలో తెలిసింది' అని మిల్లర్‌ చెప్పుకొచ్చాడు. కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ తరఫున 2017, 18లో మిల్లర్‌ ఎనిమిది మ్యాచులే ఆడాడు. గతేడాది 10 మ్యాచులాడి 129.87 స్ట్రైక్‌రేట్‌తో 213 పరుగులు చేశాడు. 2013 సీజన్‌లో అతను 164.56 స్ట్రైక్‌రేట్‌తో 418 పరుగులు, 2014లో 149.16 స్ట్రైక్‌రేట్‌తో 446 పరుగులు చేశాడు. ఆ తర్వాత ఎన్నడూ ఆ స్థాయిలో ఆడలేదు.

దినేశ్ కార్తీక్, ఆండ్రూ రస్సెల్ మధ్య విభేదాల్లేవ్.. ఉన్నది బ్రొమాన్స్‌: డేవిడ్ హస్సీ

Story first published: Monday, September 14, 2020, 20:43 [IST]
Other articles published on Sep 14, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+